జాతి వజ్రాలు..జాగృతి తేజాలు
దేశ స్వతంత్ర పోరాటంలో భాగంగా తమ సర్వాన్నీ త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలు ఎందరో.జైలు జీవితాన్నీ సంతోషంగా అనుభవించిన ఉదాత్తులు ఎందరో. వారం దరికీ దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ వేనవేల వందనాలు. అలాంటి వారిలో కొందరి గురించి క్లుప్తంగా స్మరించు కుందాం..!
ఉరితాళ్లు ముద్దాడిన..మన్యం వీరులు
బ్రిటిష్ పాలకులను గడగడలాడిరచి దేశ స్వాతం త్య్రం కోసం ఉరితాడును ముద్దాడిన ఎందరో మన్యం పోరాటయోధుల త్యాగాలు నేటికీ వెలుగు లోకి రాకుండా మరుగునపడటం విచారకరం. ప్రథమార్థంలోనే బ్రిటిష్ వారిని ఎదురించిన మన్యం వీరులు చాలా మందే పశ్చిమ ఏజెన్సీలో ఉన్నారు. ఇందులో పోలవరం తాలూకా కొరు టూరుకు చెందిన కారుకొండ సుబ్బారెడ్డి ప్రథ ముడు. అలాగే కొండమొదలుకు చెందిన కుర్ల సీతారామయ్య,కుర్ల వెంకట సుబ్బారెడ్డి, గురుగుంట్ల కొమ్మిరెడ్డి ఉరితాళ్లకు బలైనవారే. వీరిలో సుబ్బా ండ్డినే బ్రిటిష్‌వారు టార్గెట్ చేశారు. ఇప్పుడు పిలవ బడే పోలవరం, బుట్టాయగూడెం మండల ప్రాంతాల్లోని 20 పరగణాల ప్రాంతాలను బ్రిటిష్ వారికి సమాంతరంగా సుబ్బారెడ్డి కుటుంబీకులు పాలన సాగించేవారు. వ్యవసాయ కుటుంబం నేపథ్యం ఉన్న వీరు అన్ని రకాల పన్నులు వసూలుచేసి ప్రజల అవసరాలను తీరుస్తూ ఉండేవారు.సుబ్బారెడ్డి కుటుంబీకుల పాలనలో ఉన్న ప్రాంతాన్ని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని బ్రిటిష్‌వారు ప్రయ త్నించినా..యుక్తవయస్సులో దేశభక్తి మెండుగా ఉన్న సుబ్బారెడ్డి తన అనుచరులతో కలిసి వారిని ఎదురించాడు.దీంతో పగబట్టిన బ్రిటిష్‌వారు సుబ్బా ండ్డిని పట్టుకుని ఉరితీయడానికి ఆదివాసీలనే లోబ ర్చుకునేందుకు పన్నాగంపన్నారు. విచిత్ర మేమి టంటే ఇతనికి అత్యంత సన్నిహితుడే సుబ్బా రెడ్డి మరణానికి కారకుడయ్యాడు. సుబ్బారెడ్డిని పట్టించిన వారికి అప్పట్లో 500 నుంచి 2500రూపాయలు రివార్డు ఇస్తామని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిం దంటే ఆయనపోరాట స్ఫూర్తి ఎలాంటిదో నేటితరం గుర్తుంచు కోవాలి. లొంగిపోయిన చింతపల్లికి చెంది న వేట్ల దాసిరెడ్డి ద్వారా ఆచూకీ తెలుసుకుని సుబ్బా రెడ్డిని పట్టుకుని ప్రస్తుతం బుట్టా యగూడెం మండల కేంద్రంలో బ్రిటిష్‌వారు నిర్మించిన జైలులో బంధిం చారు.1858 అక్టోబర్ ఏడోతేదీన సుబ్బారెడ్డి,కుర్ల సీతారామయ్య,తూటిగుంటలో కుర్ల వెంకట సుబ్బా రెడ్డి,పాత పోలవరం దివానం వద్ద గురుగుంట్ల కొమ్మిరెడ్డిను బ్రిటిష్ పాలకులు ఉరి తీసినట్టు చరిత్ర చెబుతోంది.చరిత్ర ఆధారాలు లేకపోయినా సుబ్బా రెడ్డి తలను రాజమండ్రి కోటగుమ్మానికి వేలాడ దీశారనే కథనాలూ ఉన్నా యి. మొండెంను మాత్రం కుటుంబ సభ్యులకు ఇవ్వకుండానే బ్రిటిష్‌వారు దహనం చేశారని చరిత్ర ఆధారాలు లేకపోలేదు. ప్రముఖ బ్రిటిష్ ఛానల్ బీబీసీ 1858 నాటి స్వాతంత్య్ర పోరాటంపై సర్వే చేయగా కోరుకొండ సుబ్బా రెడ్డితోపాటు మరికొం దరి పోరాటాలు,మరణ విషయాలు బహిర్గత మైనట్టు వెలుగులోకి వచ్చాయి. సూర్యుడస్తమించని బ్రిటిష్ సామ్రా జ్యాన్ని గడగడ లాడిరచిన ఆదివాసీ పోరాటయోధుడు సుబ్బారెడ్డి నాల్గోతరానికి చెందిన పూర్వీకులు నేటికీ ఉన్నారు. సుబ్బారెడ్డి మునిమ నవడు కోరుకొండ అబ్బాయిరెడ్డి ప్రస్తుతం జీలుగు మిల్లి మండలం కామయ్యపాలెం వద్ద పోలవరం నిర్వాసితులకు నిర్మించిన పునరా వాస కాలనీలో ఉంటున్నాడు. అబ్బాయిరెడ్డి అల్లుడు బోనపు శ్రీనివాసరెడ్డి కుటుంబసభ్యులు అక్కడేఉంటున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాత కొరుటూరు మునిగి పోవడంవల్ల వారంతా ఇక్కడ కు వచ్చారు. విచిత్రమేమిటంటే సుబ్బారెడ్డి గురించి వీరికి ఒక్క విషయం కూడా తెలీదు.గ్రామంలో పాతతరం వారు తమ పూర్వీకులు పోరాట యోధు లు అంటుంటే వినేవారమే తప్పా..తెలియదని చెప్పారు.
ఎందరో మన్నెం వీరులు
మన్యం పోరాటంలో అల్లూరి సీతారామరాజుకు అండగా నిలిచిన, తుదివరకూ ఉద్యమించిన, ప్రాణాలర్పించిన ఎందరో మన్నెం వీరులు ఉన్నారు. వారిలో గాం గంటందొర,గామ్ మల్లుదొర, ఎండు పాగాలు,గోకిరి ఎర్రేసు,మోది గాడు తదితరులు ఉన్నారు. గూడెం తాలూకా మాకవరం ముత్తాలోని బట్ట పనుకుల గ్రామానికి చెందిన మహాయోధులు గామ్‌సోదరులు. బట్టు వణుకుల మునస బు గిరీ నుంచి గంటందొరను అప్పటి డిప్యూటీ తహసీల్దార్ బాస్టియన్ దుర్మార్గంగా తొలగించాడు. గంటందొర, మల్లుదొర సాగుచేస్తున్న భూములను ముఠాదారుని చేత ఇతర రైతులకు ఇప్పించాడు.వారిపై కక్షకట్టి బిచ్చ మెత్తు కోవాల్సిన దుస్థితికి బ్యాస్టియన్ తీసు కొచ్చాడు.గామ్ సోదరుల్లో పెద్దవాడు గంటయ్య దొర ఇలా చెప్పాడు..‘బాస్టియన్ చాలా క్రూరంగా వ్యవహరించాడు. ఈతాలూకా ప్రజల పట్ల అనేక తప్పిదాలు చేశాడు.బ్యాస్టియన్ నాభూమిని లాక్కొని, సెమర్ల పెద్దబ్బికి ఇచ్చాడు. నన్ను నాశనం చేయొద్దని ప్రాధేయపడ్డాను. అతడు నన్ను తన బూటుకాలితో తన్నాడు.దాంతో నేను జీవితం పట్ల విరక్తి చెందా ను. నాభార్యాబిడ్డలను మాగ్రామం నుంచి పంపేశాను. నేడు రాజు గారి కాళ్ల మీదపడ్డాను. బ్రిటీష్ వాళ్ల అంతం చూడాలని గట్టిగా నిర్ణయించు కున్నాను.’ గామ్ సోదరులు మాకవరం ముత్తాలో చాలా పలుకుబడి ఉన్న వారు.వారిపట్ల బాస్టియన్ దుర్మార్గం ఆముత్తా ప్రజలసానుభూతిని కల్పిం చింది. వారు రాజుకు అనేకమంది అనుచ రులను, సానుభూతిపరులను సమకూర్చారు. ఎంతో నమ్మకస్తులైన,స్థానికంగా పూర్తిస్థాయి పరిజ్ఞానం ఉన్న వీరిచ్చిన సమా చారం ఆధారంగానే విప్లవ కారులను అల్లూరి ఎంపిక చేసుకున్నాడు. మిగిలిన ప్రధాన అనుచరుల్లో అగ్గిరాజు,ఎండు పడాల్ ఉన్నారు.బ్రిటీష్ వారిని పార దోలేందుకు సీతారా మరాజు150 మంది గెరిల్లా యోధులను తయారు చేసి, మూడు దళాలు ఏర్పాటు చేశాడు.వాటికి గంటం దొర, మల్లుదొర, ఎండు పడాల్‌లను దళ నాయకులుగా నియమించాడు.
గాము మల్లుదొర`స్వాతంత్ర సంగ్రమంలో పాత్ర
దొరతనం వారి తాబేదారుల అక్రమ చర్యలను గాము సొదరులు నిరసన తెలిపారు. గూడెం తాసీ ల్దారు బాస్టియన్ ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నారనే వ్యాజ్యంతో గంటందొరను మునసబు పనినుండి తొలగించాడు. వారి భూములను సైతం ప్రభుత్వ పరం చేశాడు. మన్యంలో విప్లవం చెలరేగడానికి ఇదొక బలమైన కవ్వింపు చర్యగా కొందరు భావించారు. గాము సోదరులపై జరిగిన అన్యా యాన్ని ప్రతిఘటించవలసిందిగా మన్యం ప్రజల ఆరాధ్య దైవమైన అల్లూరి సీతారామరాజును కోరారు. బ్రిటిష్ వారి ఆగడాలను అంతమొం దించడానికి విప్లవవీరులు ఇతని నేతృత్వంలో 150 మంది సైనికులతో గాము సోదరులు ప్రథములు. వీరు పోలీసు స్టేషన్లపై దాడిచేసి ఆయుధాలను సేకరించేవారు. వాటిని ఉపయోగించే విధానాల్ని రాజు మన్యం వీరులకు నేర్పించాడు. ఆంగ్లేయ ప్రభుత్వం సీతారామరాజుని పట్టి ఇచ్చిన వారికి పదివేల రూపాయలు, గంటందొర, మల్లుదొరలను పట్టుకున్నవారికి ఒక్కొక్కరికి వెయ్యేసి రూపాయలు ఇవ్వగలమని ప్రకటించింది. మహాసాహసి అయిన మల్లుదొరకు మద్యపానం,స్త్రీ వ్యామోహం బలహీ నతలు ఉండేవి. అందుచేత అతని చర్యలను రాజు ఒక కంట కనిపెడుతూ ఉండేవాడు. కల్లు తాగిన మైకంలో తన రహస్యాలను ప్రభుత్వ గూఢచారికి తెలుపుతున్నట్లు మల్లుదొరను రాజు గూఢచారులు చూడడం తటస్థించింది.వెంటనే ప్రభుత్వ ఉద్యోగిని కాల్చివేసి విషయంరాజు దృష్టికి తెచ్చారు. ఆయు ధాలను అప్పచెప్పి దళాన్ని విడిచి వెళ్ళవలసిందిగా మల్లుదొరనురాజు ఆజ్ఞాపించాడు. మల్లుదొర రాజు ఆజ్ఞను శిరసావహించి 1923 సెప్టెంబరు 17న నడిరపాలెం వెళ్ళాడు. అక్కడ తన ప్రేయసి గృహం లో ఉండగా పట్టుబడ్డాడు. రాజు ఆచూకీ తెలుప మని మల్లుదొరను దారుణంగా హింసించినా అత నేమీ తెలియజేయలేదు. వాల్తేరు ఏజన్సీ న్యాయ మూర్తి మల్లుదొరకు మరణ దండన విధిస్తూ 1924 అక్టోబరు 23న తీర్పు చెప్పారు. మల్లుదొర అప్పీలు చేయగా మరణ శిక్షను ద్వీపాంతర వాస ఖైదుగా మార్చబడిరది.మే8,1924తేదీనరాజువీర మరణం తో అతని అనుచరులు విజృంభించారు. బ్రిటిష్ ప్రభుత్వం అధికారంగా పలువురు యోధులను హతమార్చింది. గంటందొర, కొద్దిమంది అనుచ రులు సైనికులతో భీకరంగా పోరాడి వీరమరణం పొందారు. సీతారామరాజు ప్రధాన అనుచరులలో బ్రతికి బయట పడిరది మల్లుదొర ఒక్కడే.
లోక్ సభ సభ్యునిగా
అండమాన్ జైలులో పదమూడున్నర ఏళ్ళు గడిపిన మల్లుదొరను1937లో ఏర్పడిన కాంగ్రెసు మంత్రి వర్గం విడుదల చేసింది. భారతదేశానికి స్వాతం త్య్రం సిద్ధించిన తర్వాత లంక సుందరం గారి చొరవతో 1952 ఎన్నికలలో విశాఖపట్నం నుండి గెలుపొంది మల్లుదొర లోక్‌సభ సభ్యుడయ్యాడు. ఆయన తొలిసారిగా పార్లమెంటులో మాట్లాడి నప్పుడు సభ యావత్తు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేసింది.ప్రధాని నెహ్రూ స్వయంగా ఆయన త్యాగ నిరతిని కొనియాడారు.
మన్యం యోధుడు మర్రి కామయ్య
భారత స్వాతంత్య్ర సమరంలో నిప్పురవ్వలై ఎగిసి పడుతున్న పోరుబాటలో నేలకొరిగిన ఎందరో అగ్ని కెరటాలున్నారు. ఆ వీర చరిత్రలో విస్మరించబడిన గిరిజన వీరయోధులెందరో స్వాతంత్య్రపోరాట నంతరం కూడా పోరాటాలు కొనసాగించిన ఘన చరిత్రలో మరొక గిరిజన పోరుబిడ్డ మర్రి కామ య్య.విశాఖ మన్యంలో సాగిన తెల్లదొరలదాడిలో అమరుడైన అల్లూరి సీతారామారాజు (1924) తర్వాత రెండువ మన్నెం వీరుడుగా ప్రసిద్దికెక్కింది.. మర్రి కామయ్యే.వీరి పోరాటం చరిత్రలో చిరస్థాయి గా నిలిచింది. కొండతెగకు చెందిన కామయ్య విశాఖపట్నం జిల్లా పాడేరు రెవెన్యూ డివిజన్లోని హుక్కుంపేట మండలంలో గరుడాపల్లిలో జన్మిం చారు. తీగలవలస పంచాయితీలోని గరిడేపల్లి పరిసర గ్రామాల్లో భగత,కొండదొర,వాల్మీకి, నూక దొర,కొండకుమ్మరి తెగ గిరిజనులు నివసి స్తున్నారు. కామయ్య మోతుబరి రైతు.స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ఏజెన్సీ ప్రాంతాలలో కొనసాగుతున్న ఉద్యమాలే కామయ్యను ఉద్యమకారుడిగా మార్చా యి.గిరిజనుల్లో అజ్ఞానం,దుర్భరాన్ని తొలగిం చేందుకు మాడుగుల,అనంతగిరి మండలంలోని గ్రామాలు కొండజాతివారి సంఘాలు ఏర్పాటు చేసి బదులు నిర్వహించారు. జీవనోపాధి పనులు కల్పించడం వంటి సంక్షేమ కార్యక్రమాలు కామయ్య చేశారు. ప్రజలు వ్యవసనాలకు దూరంగా ఉండి, అణిచివేతల నుంచి విముక్తి చెందాలని కామయ్య భౌద్ద మతాన్ని అనుసరించారు. అది సహించలేని ప్రభుత్వం ముఠాదారులు ఏకమై గరిడెపల్లి గ్రామాన్ని తగులబెట్టారు. కామయ్య భూములను, పశువులను,ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేసి చాలా ఇబ్బందులకు గురిచేశారు.అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన కామయ్య కొండకోనల్లో తలదాచుకుంటూ ఉద్యమాన్ని కొనసాగించారు. తనను నమ్ముకున్న 360కుటుంబాలను చేరదీసి గరిడెపల్లి,పరిసరాలలోని బీటుగరువు వద్ద వీరికి నివాసాలు ఏర్పాటు చేశారు. ఆ ఊరు కామయ్య పేటగా మారింది. కానీ బ్రిటీష్ పోలీసులు వారిని ఎలాగైనా అణచివేయాలని కుట్రపన్నిన ముఠాదారు లతో కలసి కామయ్య కుటుంబసభ్యులపై,అతని అనుచరులపై దాడులు చేసేవారు.చివరికి వారి గుడిసెలను కూడా తగలబెట్టారు.కామయ్య కుటుం బతోపాటు ప్రజలందరూ చెల్లాచెదరైపోయారు.
ప్రభుత్వ ముసుగులో ముఠాదారులు చేస్తున్న పాశవిక చర్యలను సహించలేని ప్రజలు కామయ్య నాయకత్వంలో మద్దతుదారులుగా చేరడంలో50దళాలు ఏర్పడ్డాయి.ఉబ్బేట్ రంగయ్య, డుంబేరి వీరన్న,జర్సింగిమంగన్న,కులబిర మోదు న్న,బొడ్డు కొండలరావు,కంబిడి బాలన్న,గుల్లేని పెద్దబ్బాయి11రోజులు జైలు జీవితం గడిపారు. మర్రి దన్ను(కామయ్య కుమారుడు)రేగం భీంరావు, కొర్ర బాలన్న కంఠమచ్చలు మొదలగు వారు కామ య్యకు ప్రధాన అనుచరులు.ఎన్ని కుయుక్తులు పన్నినా కామయ్య అరెస్టు కాకపోవడం అనాటి బ్రిటీష్ ప్రభు త్వం జీర్నించుకోలేపోయింది. అటవీ అధికారులు పోలీసులు ముఠాదారులు కలసి 1940లో కామ య్యను బంధించారు. విడుదలయ్యాక గ్రామాల్లోని వనవాసుల్లో ఆశించిన మార్పు రాలేదు.ప్రజలు పండిరచిన పంటకు గిట్టుబాటు ధరలు లేక షావు కారు వద్ద మోసపోవడం వారి సామాజిక వెనుక బాటు చూసి,తప్పనిసరిగా మళ్లీ ఉద్యమించాల్సి వచ్చింది. ప్రభుత్వ నిర్బంధం పెరగడంతో మళ్లీ కామయ్య అజ్ఞాతంలోకి వెళ్లారు.నాటి తెల్లదొరల నుంచి పెత్తందార్లు వరకు అటవీ సందపను కొల్ల గొట్టిడాన్ని జమిందారీ వ్యవస్థను వ్యతిరేకిస్తూ అడవిపై అధికారం గిరిజనలకే చెందాలని ఉద్య మించిన మన్నెం యోధుడు మర్రి కామయ్య 1959 మే 5న మరణించాడు.
అల్లూరి సహచరుడికి అరుదైన గౌరవం
అల్లూరి సీతారామరాజు తెల్లదొరలతో అలు పెర గని పోరాటమే చేశారు. ఆపోరాటంలో ఆయన వెంట ఉన్నది గిరిజనుడైన గంటం దొర. అల్లూరిని వెన్ను దన్నుగా నిలిచి ఆంగ్లేయులను ముప్పతిప్పలు పెట్టారు. అల్లూరితో పాటు గంటం దొరకు గుర్తిం పు వచ్చిందా అంటేలేదు అనే గిరిజనులు అంటారు. ఇటీవల కాలంలో గంటం దొరను తలచుకోవడం ఆయన జయంతి వర్ధంతులను ఘనంగా ఉత్స వాలుగా నిర్వహించడం వంటివి చేస్తున్నారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి బుధవారం అరకులో గంటం దొర వర్ధంతి వేడుకలను నిర్వహిస్తూ గిరిజనంలో ఆయన లాంటి నాయకుడు లేడు అని కీర్తించారు. గంటం దొర విగ్రహాన్ని కొయ్యూరు మండలంలో ఏర్పాటు చేశారు. దాన్ని ఎంపీ ఆవిష్కరించారు. గంట దొర స్పూర్తి గిరిజనానికి అవసరం అన్నారు. ఆ రోజుల్లోనే ఆయన చూపిన చొరవ ధైర్యం నేటి తరానికి ఆదర్శప్రాయం అన్నారు. ఆయనను దేశం కోసం పోరాడిన యోధుడిగా అంతా గుర్తుంచు కోవాలని అన్నారు.గంటం దొర గురించి గిరిజనా నికి తెలియచేయాల్సిన అవసరం ఉంది అన్నారు. అల్లూరితో పాటు ఉంటూ ఆయన అడుగు జాడ లలో నడుస్తూ గంటం దొర ఆనాడే గిరి సీమలలో అగ్గి పుట్టించారని వైసీపీ నేతలు నివాళులు అర్పి స్తున్నారు.ఒకపుడు అల్లూరి విగ్రహాలే పెద్దగాఉం డేవి కావు.ఇపుడు అల్లూరిని అంతా కీర్తిస్తున్నారు. స్మరిస్తున్నారు. ఆయనతో పాటు గంటం దొరకు గిరి సీమలలో నీరాజనం పలుకుతున్నారు. వారు వందేళ్ళక్రితం చేసిన త్యాగాలను ఈ తరం ఆసక్తిగా తెలుసుకుంటోంది.అది అవసరం కూడా అని మేధా వులు అంటున్నారు.
కొమురం భీమ్.. జల్ జంగల్ జమీన్ అంటూ..
గిరిజన హక్కులు,మనుగడ కోసం పోరాటం సాగిం చిన కొమరం భీమ్ ఇప్పటికీ తమ ప్రాంతంలోని గోండులచే గౌరవించబడే ఒక ఉద్యమ వీరుడు. యావత్ భారతావని ప్రత్యేకంగా కొలుచుకునే స్వాతంత్య్ర సమరయోధుడు. జల్,జంగల్,జమీన్ అంటూ నిజాం,బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డి పోరాటం సాగించిన యోధుడు..గిరిజన హక్కుల కోసం ప్రాణాలర్పించిన అమర వీరుడు కొమురం భీమ్.తెలంగాణ,ఆంధ్రఆదివాసీ ఉద్యమాల్లో చాలా కాలంగా లేవనెత్తిన ప్రసిద్ధ నినాదం జల్ జంగల్ జమీన్…మొట్టమొదట ఈనినాదం చేసింది కొమరం భీమ్.నిజాంల పాలన లో ఉన్న హైదరాబాద్ రాజ్యానికి చెందిన గోండు తెగకు చెందిన యోధుడు ఆయన. భీమ్ తన తెగ హక్కుల కోసం బ్రిటిష్, నిజాం రాజులు, భూస్వాము లకు వ్యతిరేకంగా పోరాడి చివరకు ప్రాణాలర్పిం చిన అమరవీరుడు. భీమ్ ఉత్తరహైదరాబాద్‌లోని ఆసి ఫాబాద్‌లోని సంకేపల్లిలోని గోండు కుటుంబం లో జన్మించాడు. స్థానిక జమీందార్లతో కుమ్మక్కై నిజాం పోలీసులు ఆదివాసీలపై దోపిడీకి, చిత్రహిం సలకు గురిచేస్తూ..అపఖ్యాతి పాలైన చందా-బల్లార్పూర్ అటవీ ప్రాంతంలో భీమ్ పెరిగాడు. అధిక పన్నులు విధిం చేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలను, గిరిజనులను వెళ్లగొట్టేందుకు మైనింగ్ లాబీ చేస్తున్న ప్రయత్నాలను గోండులు ప్రతిఘటించారు. ఆ పోరాటా ల్లోనే కొమరం భీమ్ తండ్రి చనిపోయారు.ఈ నేప థ్యంలో భీమ్,అతని కుటుంబం కరీంనగర్ ప్రాం తానికి వెళ్లారు. కానీ నిజాం, జమీందార్ దళాల దురాగతాలు అక్కడ కూడా భీమ్‌కోసం వేచిఉన్నా యి.ఎందుకంటే ఆరోజుల్లో ఒకపోలీసు భీమ్ చేతిలో చంపబడ్డాడు. దీని తర్వాత.. భీమ్ చంద్రాపూర్‌కు పారిపోయాడు, అక్కడ అతను బ్రిటిష్, నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రచురణకర్త విఠోబా రక్షణలో వచ్చాడు. విఠోభా భీమ్‌కు ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ నేర్పించారు.కానీ విఠోభాను అరెస్టు చేయ డంతో,భీమ్ అస్సాంకు వెళ్లిపోయాడు. అస్సాం భీమ్‌లోని తేయాకు తోటలలో పని చేస్తూ కార్మిక పోరాటాలను నిర్వహించారు. ఇది భీమ్ అరెస్టుకు దారితీసింది. ఈ క్రమంలోనే అరెస్టు కాగా, జైలు గోడను దూకి అక్కడి నుంచి తప్పించుకుని హైద రాబాద్ వచ్చాడు. భీమ్ తన సంఘం పోరాటాలలో పాల్గొన్నాడు.స్వతంత్ర గోండుభూమి కోసం డిమాం డ్‌ను లేవనెత్తాడు.భూస్వాములకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాలకు నాయకత్వం వహించాడు. అతడిని బుజ్జగించేందుకు నిజాం ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను భీమ్ తిరస్కరించాడు. అలాగే నిషే ధిత కమ్యూనిస్టు పార్టీతో కలసి తెలంగాణ పోరా టానికి కృషి చేశారు. భీమ్‌ని పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నిజాంలతో పాటు బ్రిటిష్ వారు 1940లో వారికోసం వెతుకుతున్న నేపథ్యంలో భీమ్, అతని సహచరులు జోడేఘాట్ గ్రామంలో దాక్కున్నారు. కొద్దిసేపటికే రైఫిల్స్‌తో ఉన్న పోలీసుల సైన్యం గ్రామానికి చేరుకుని భీమ్, ఆయన సహచరులు ఉన్న గుడిసెలను చుట్టుము ట్టింది. పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.భీమ్,అతని సహచరులు 15మంది అక్క డికక్కడే మరణించారు. భీమ్ దాక్కున్న ప్రాంతం గురించి అతనికి చెందిన ఒకరు పోలీసులకు లీక్ చేయడంతో ఈవిషయం తెలిసింది. గిరిజన హక్కు లు,మనుగడ కోసం పోరాటం సాగించిన కొమరం భీమ్ ఇప్పటికీ తమప్రాంతంలోని గోండులచే గౌర వించబడే ఒకఉద్యమ వీరుడు.ఆదివాసీ భూరక్షణ చట్టం 1/70 చట్టాన్ని అమలుపర్చడంలేదు. అన్యాక్షి కాంతమవుతున్న అడవులను, భూములను పట్టించు కోదు. గోండు తెగకు సంబంధించిన ప్రధాన్, తోటి, మన్నె,కోయ తెగలే కాకుండా నాయక్‌పోడ్, ఆంధ్ ఇతర ఆదివాసీ తెగలు ఆదిలాబాద్‌లో నివసిస్తు న్నాయి. ఇప్పుడు వీరి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.ఆదిమ సమాజం వీరివల్ల రక్షణలను కోల్పోతున్నది. ఇలాంటి పరిస్థితిలో ఆదివాసీల మనుగడ కష్టమేనని ఆదివాసీ నాయకులు మదనప డుతున్నారు.ఆదివాసీల రక్షణ ప్రభుత్వానిదే అయిన ప్పుడు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న ప్రభుత్వాల వైఖరిలో మార్పు రావడంలేదు. భీం పోరాటం చేసిన ప్రాంతంలో (జోడేఘాట్) నేటికి తాగడానికి నీళ్ళులేవు. సరైన సదుపాయాలు లేకపోవడంతో ఆదివాసీ సమాజాల జీవన ప్రమాణాలు క్షీణిస్తు న్నాయి. అతని ముందు చూపు వివిధ ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తున్నది.యావత్ భారతా వని ప్రత్యే కంగా కొలుచుకునే స్వాతంత్య్ర సమర యోధుడు. ఆయన గుర్తుగా ఆసిఫాబాద్‌కు కొమరం భీమ్ జిల్లా అని పేరు పెట్టారు. -(గునపర్తి సైమన్/పోతుల మోహన సిద్ధార్థ్)