జన విస్పోటనం

ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరడం మానవాళి చరిత్రలో ఓ మైలురాయి. భూగోళం మీద జీవం ఉనికి ప్రారంభ మైనప్పటి నుండి ఈ స్థాయిలో పురోగతి సాధించిన మరో జీవి లేదనడం అతిశయోక్తి కాదు. జంతువుల్లో జంతువుగా మనుగడ కోసం పోరాడిన స్థితి నుండి బుద్ధిజీవిగా మారేంత వరకు మానవజాతి సాగించిన ఈ ప్రయాణం అనితర సాధ్యం! ఈ క్రమంలోనే భూగోళమంతా మనుషులు విస్తరించారు. భిన్న వాతావరణ పరిస్థితులను, ప్రకృతి వైపరీత్యాలను ఎదర్కుని నిలిచారు. అయితే, ఈ విస్తరణ భూగోళమంతా ఒకే మాదిరి జరగలేదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరిగింది. మనుగడ పోరాటంలో భాగంగా మనిషి సాగించిన వలసలూ జనాభా సంఖ్యను ప్రభావితం చేశాయి. నాగరికత పెరిగిన తరువాత, మానవ జీవితంలో లాభ, నష్టాల లెక్కలు అడుగుపెట్టిన తరువాత పేదరికం కూడా కుటుంబాలలో సభ్యుల సంఖ్యను ప్రభావితం చేసింది. సంతానం ఎక్కువుంటే సంపాదించే వారి సంఖ్య పెరుగుతుందని అనుకోవడం ఇప్పటికీ వింటూనే ఉం టాం. ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన నివేదిక కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. పేద దేశాల్లో జనాభా గరిష్ట స్థాయిలో పెరుగుతూ ఉంటే, ధనిక దేశాల్లో దీనికి భిన్నమైన స్థితి! 800 కోట్ల జనాభాలో ఆసియా, ఆఫ్రికా దేశాలదే సింహభాగం. దానిలోనూ మన దేశానిదే పైచేయి. గడిచిన పన్నెండేళ్లలో భారత్‌లో 17.7 కోట్ల మంది పెరగగా, చైనాలో 7.3 కోట్ల మంది పెరిగా రని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఇదే ఊపులో మరో ఏడాదికి జనాభాలో చైనాను అధిగమించి మన దేశం మొదటి స్థానంలో నిలవనుంది. 2050 నాటికి 170 కోట్ల జనాభాతో భారత్‌ తొలి స్థానానికి,అదే సమయంలో చైనా జనాభా 130 కోట్లకు పరిమితం కానుందని అంచనా! ప్రపంచ జనాభా 2037 నాటికి 900 కోట్లకు, 2058 నాటికి వెయ్యి కోట్లకు, 2080 నాటికి 1400 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు.సైమన్‌ గునపర్తి
జనాభా ఈ స్థాయికి చేరుకోవడం మానవాళికి వరమా..శాపమా? ప్రభుత్వాలు ఎటువంటి విధానాలు అవలంభించాలన్నది చర్చనీ యాంశంగా మారింది. జనాభా విస్ఫోటనం ఒకప్పుడు తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఇప్పుడూ ఆ పరిస్థితి ఉందా అంటే జవాబు చెప్పడం కష్టం. భూగోళాన్ని యూనిట్‌గా తీసుకుని చూస్తే జనాభా పెరగుతోందన్నది ఒక వాస్తవం! అయితే, అన్ని దేశాలకూ ఇది ఒకేమాదిరి వర్తించదు. పొరుగు దేశమైన చైనానే దీనికి ఉదాహరణ! ఒకప్పుడు వన్‌ ఆర్‌ నన్‌ నినాదం ఇచ్చిన ఆ దేశ ప్రభుత్వం ఇప్పుడు ఒకరు, లేదా ఇద్దరు అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని దేశాల్లో పిల్లలను ఎక్కువగా కనేవారికి అక్కడి ప్రభుత్వాలు అనేక రాయితీలు కల్పిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మన దేశంలో యువకుల సంఖ్య అత్యధికంగాఉంది. మరో యాభై ఏళ్ళ తరువాత ఇదే స్థితి ఉం టుందన్న గ్యారంటీ లేదు. మనదేశంలో ఒకప్పుడు సంతానోత్పత్తి రేటు 5కు పైగా ఉండగా, ఇప్పుడది 2.2కు తగ్గింది. చైనాలో ఇది 1.7గా ఉంది. భారత్‌, చైనాలలోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే విధమైన ధోరణి కనపడుతోంది. 1963లో సగటున 5.3గా సంతానోత్పత్తి రేటు ఉండగా 1990కి 3.3కు 2020కి 2.3కు తగ్గింది. ‘ప్రపంచం మన అవసరాలకు సరిపడినంతా ఉంది. కానీ, మన అత్యాశకు సరిపడినంత కాదు’ అన్న మహాత్మాగాంధీ మాటలు ఇక్కడ ప్రస్తావనార్హం. పెట్టుబడిదారీ విధానం అని వార్యంగా పెంచి పోషించే అసమానతలు పేదరికంలోనే కాదు, జనాభా విస్తరణలోనూ ప్రస్ఫుటమౌతాయి. దేశాల వలస విధానాలు వారి ప్రయోజనాల కోసమే రూపొందుతాయి. పేద దేశాల్లో పెరుగుతున్న జనాభానే పెట్టుబడిదారులు ముడిసరుకుగా మార్చు కుంటారు. సమస్త భూగోళాన్ని, ప్రకృతిని దోచుకుంటూ లాభాల పంట పండిస్తారు. హద్దుల్లేని ఈ దోపిడి మానవాళితో పాటు సమస్త జీవరాశి ఉనికినే ప్రమాదంలో పడే స్తున్నా వారి వైఖరిలో మార్పేమీ ఉండదు. పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయంగా వచ్చే సోషలిస్టు సమాజంలో దోపిడి ఉండదు. అంతరాలు మాయమవుతాయి కాబట్టి బతుకు భయం ఉండదు. పిల్లలను కనాలా..వద్దా అన్నది భార్యాభర్తలే నిర్ణయించుకుంటారు. అటువంటి సమాజమే జనాభా సమస్యకు స్థిరమైన పరిష్కారాన్ని చూపుతుంది.
భారత్‌ వాటానే ఎక్కువ
800 కోట్లకు ప్రపంచ జనాభా చేరిన నేపథ్యంలో ఇందుకు భారత్‌ ప్రధానంగా దోహదపడిరదని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. గత 12ఏళ్లలో భారత్‌లో 17.7కోట్ల మంది పెరగగా,చైనాలో 7.3 కోట్ల మందే పెరిగారు. వచ్చే ఏడాది కల్లా అత్యంత జనాభా కలిగిన దేశంగా చైనాను భారత్‌ అధిగమించేస్తుందని భావిస్తున్నారు. 2037కల్లా కొత్తగా చేరే వంద కోట్ల జనాభాలో కూడా ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచే ఎక్కువ శాతం వుండగలదని, మరోవైపు యూరప్‌ వాటా ప్రతికూలంగా వుండగలదని యుఎన్‌ జనాభా నిధి పేర్కొంది. భారత్‌సహా ఎనిమిది దేశాల్లోనే జనాభా వృద్ధి అధికం. ప్రధానంగా తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో జనాభా వృద్ధి ఎక్కువగా కేంద్రీకృత మవుతోందని పేర్కొంది. 2050 వరకు అంచనా వేసిన పెరుగుదలలో మెజారిటీ భాగం ప్రధానంగా ఎనిమిది దేశాలకే పరిమిత మవుతుందని పేర్కొంది. ఆ దేశాల్లో భారత్‌, పాకిస్తాన్‌, ఫిలిప్పీన్స్‌ వంటి వర్ధమాన దేశాలు, నైజీరియా, ఇథియోపియా వంటి సబ్‌ సహారా ఆఫ్రికా దేశాలు వున్నాయి. ఈ పరిస్థితులు ఈ దేశాలకు సవాళ్లు విసురుతున్నాయి. పెరుగు తున్న యువత చాలా పరిమితమైన వనరు లపైనే ఆధారపడాల్సి వస్తోంది.
సవాళ్లు తప్పవు : ఐరాస
తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో జననాల రేటు పెరుగుదల వల్ల మరింత ముప్పు తలెత్తే ప్రమాదం వుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరిం చింది. పర్యావరణ పరంగా మరింత నష్టం జరుగుతుందని, గ్లోబల్‌ వార్మింగ్‌ పెరుగు తుందని, అడవుల నరికివేత ఎక్కువవుతుందని హెచ్చరించింది. ఇటు ప్రజలను, అటు భూగోళాన్ని కాపాడుకునే చర్యలు మరింత పెరగాలని పిలుపునిచ్చింది.
జనాభా పెరుగుదల ఇలా…
1927లో ఈ భూ మండలం మీద జనాభా కేవలం 200కోట్లుగా వుంది,1998నాటికి ఆ సంఖ్య 600కోట్లకు చేరుకుంది. ఇప్పటికీ, ఈ పెరుగుదల చాలా మందగమనంతో వుందనడానికి సంకేతాలు కనిపిస్తున్నాయి. 1950 నుంచి వార్షిక జనాభా పెరుగుదల రేటు చాలా తక్కువ స్థాయిలో వుంది. ప్రపంచ జనాభా మరో వంద కోట్లు దాటడానికి ప్రస్తుతం 12 సంవత్సరాలు పట్టింది. ఆతదు పరి మైలురాయిని చేరడానికి 15ఏళ్లు పట్ట వచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఆతర్వాత మరో మైలురాయికి చేరేసరికి దాదాపు రెండు న్నర దశాబ్దాలు పడుతుందని ఐక్యరాజ్య సమితి గణాంకాలు పేర్కొంటున్నాయి. 2037 నాటికి 900 కోట్లకు, 2058నాటికి వెయ్యి కోట్లకు జనాభా చేరుతుందని అంచనా వేశారు.
సంపన్న దేశాల్లో మందగమనం
జననాల్లో మందగమనమనేది ప్రధానంగా సంపన్న దేశాల్లో కనిపిస్తోంది. ఆ దేశాల్లో పిల్లలను పెంచేందుకు అయ్యే వ్యయం అధికంగా వుండడం, పైగా వివాహాలు చేసుకునే రేటు తగ్గిపోవడం ఇందుకు కారణంగా వుంది. దక్షిణ కొరియా నుంచి ఫ్రాన్స్‌ వరకు గల దేశాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా వుంది. ఇక్కడ జనాభా క్షీణిస్తోంది. వృద్ధుల స్థానంలో తగినంతమంది పిల్లలు జన్మించడం లేదు. మరింతమంది పిల్లలను కనాలంటూ కుటుంబాలకు మెరుగైన చెల్లింపులు జరపడం వంటి చర్యలను ప్రభుత్వాలు తీసుకుంటున్నా పెద్దగా మార్పేమీ లేదని ఐక్య రాజ్యసమితి పేర్కొంటోంది. అధిక ఆదాయ, ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాల్లో రాబోయే మూడు దశాబ్దాల్లో 65 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారి సంఖ్య తగ్గుతుందని, 65ఏళ్ల కన్నా పైబడిన వారి సంఖ్య మరింత పెరుగుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.
12 ఏళ్లలో వంద కోట్లు..
ప్రపంచ జనాభా 700 కోట్ల నుంచి 800 కోట్లకు(8పఱశ్రీశ్రీఱశీఅ) చేరడానికి పట్టిన సమయం ఎంతో తెలుసా? కేవలం12 సంవత్సరాలు. ప్రపంచ జనాభా 2011లో 700కోట్ల మైలు రాయికి చేరుకోగా,12 ఏళ్ల తరువాత 2022లో 800 కోట్ల మార్క్‌ ను అందుకుంది.ఈ జనాభా పెరుగుదలలో భారత్‌ గణనీయ పాత్ర పోషిం చింది. అత్యల్ప తలసరి ఆదాయం ఉన్న దేశాల్లే జనాభా పెరుగుదల ఎక్కువగా ఉందని ఒక అధ్యయనంలో తేలింది.
చైనాను దాటేయనున్న భారత్‌
2011 నుంచి 2022 మధ్య 700కోట్ల నుంచి 800 కోట్లకు పెరిగిన జనాభా (జూశీజూబశ్రీa్‌ఱశీఅ) లో అత్యధిక శాతం భారత్‌ లో జన్మించిన వారే.ఈ విషయంలో భారత్‌ చైనాను రెండో స్థానంలోకి నెట్టేసింది. కాగా,ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా చైనా,ఆతరు వాత స్థానంలో భారత్‌ ఉన్న విషయం తెలి సిందే. అయితే, త్వరలో ఈ రెండు అగ్ర స్థానా లు తారుమారవనున్నాయి. అత్యధిక జనాభా ఉన్న దేశంగా 2023 లోనే భారత్‌ అవతరించ బోతోంది. చైనా కట్టుదిట్టంగా చేపట్టిన జనభా నియంత్రణ పద్ధతుల వల్ల ప్రస్తుతం అక్కడ జనాభా వృద్ధి రేటు నెగటివ్‌ గా నమోదవు తోంది.కాగా,భారత్‌ జనాభా 2050 నాటికి 170 కోట్లు చేరుతుందని, అదే సమయంలో చైనా జనాభా 130కోట్లకు తగ్గుతుందని అంచనా.
ఐరాస నివేదికలోని కీలకాంశాలు..
జనాభా అత్యధికంగా పెరుగుతున్న దేశాల్లో భారత్‌ తొలిస్థానంలో ఉన్నది. 2023లో జనాభా పరంగా చైనాను భారత్‌ అధిగ మిస్తుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుంది.2030 నాటికి ప్రపంచ జనాభా 850కోట్లకు,2050 నాటికి 970కోట్లకు,2080 నాటికి 1000 కోట్లకు చేరుతుంది.2100 వరకు అదే స్థాయిలో కొనసాగొచ్చు. ఈ అంచనాలో సగానికిపైగా పెరుగుదల కేవలం 8 దేశాల్లోనే (భారత్‌, పాకిస్థాన్‌, కాంగో,ఈజిప్టు, ఇథియో పియా, నైజీరియా,ఫిలిప్పీన్స్‌,టాంజానియా) నమోదవుతుంది.700కోట్ల నుంచి 800కోట్లకి చేరుకోవడంలో సగానికిపైగా (60కోట్ల మంది) జనాభా ఆసియా దేశాల నుంచే ఉన్నది. మిగి లిన 40కోట్ల జనాభా ఆఫ్రికా దేశాల నుంచే ఉన్నది.అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పనిచేసే జనాభా(25-64 ఏళ్ల వారు) క్రమంగా పెరుగుతున్నది. స్త్రీకి జీవితకాల సంతానోత్పత్తి రేటు 2.1కి తగ్గింది.ప్రస్తుతం ప్రపంచ సగటు ఆయా ప్రమాణం 72.8 సంవత్సరాలు. 1990తో పోల్చితే తొమ్మిదేళ్లు పెరిగింది. 2050 నాటికి సగటు ఆయుర్ధాయం 77.2 సంవత్సరాలకు చేరుతుంది. 2021లో తక్కువ అభివృద్ధి చెందిన దేశాల ఆయుర్ధాయంప్రపంచ సగటు కంటే 7ఏళ్లు తక్కువ.ప్రపంచజనాభాలో బంగ్లాదేశ్‌ వాటా 2.2శాతంగా ఉంది. జనాభా పరంగా 8వ అతిపెద్ద దేశం. ప్రస్తుతం 17 కోట్లుగా ఉన్న జనాభా 2050 నాటికి 20.4 కోట్లకు చేరు తుంది.65ఏళ్లు పైబడిన జనాభా ప్రస్తుతం 10శాతంగా ఉంది. 2050 నాటికి ఇది16 శాతానికి పెరుగుతుంది. అంటే వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ సంఖ్య ఐదేళ్ల పిల్లలకు రెట్టింపు.