జగనన్న సురక్ష
ప్రజా సమస్యలను సంతృప్తికర స్థాయిలో పరిష్కరించడం,అర్హులందరికీ పథకాలు అందిం చడం లక్ష్యంగా జూన్ 23 నుంచి జూలై 23 వరకు నెల రోజులపాటు జగనన్న సురక్ష కార్య క్రమం విజయవంతంగా కొనసాగిస్తున్నారు. దీనికి ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ప్రతి సచివాలయ పరిధిలో విస్త్రతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ సమస్యకు పరిష్కారం చూపుతున్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా మరో కొత్త కార్యక్రమైన జగనన్న సురక్ష కార్యక్రమం అనే శ్రీకారం చుట్టబోతోంది.ఇది ఎప్పట్నించి ప్రారంభమౌతుందనేది పరిశీలిద్దాం.!
వైసీపీ ప్రభుత్వం జగనన్న సురక్ష పేరుతో మరో కొత్త కార్యక్రమాన్ని తలపెట్టింది.ఇది జూన్ 23 నుంచి ప్రారంభం కానుంది.. ప్రతి ఇంట్లో ఏసమస్యలు ఉన్నా వెంటనే వాటిని పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి జగనన్న సురక్ష కార్యక్రమం కొనసాగింపుగా ఉంటుంది. ప్రతి సామాన్యుడి ముఖంలో చిరునవ్వు చూడటమే ఈ కార్యక్ర మం ఉద్దేశ్యమం.
ఇదో బృహత్తర కార్యక్రమం
ప్రభుత్వం చేపడుతున్న వివిధకార్య క్రమాలు,సంక్షేమపథకాలు, గడపగడపకూ ప్రభుత్వం,ఉపాధిహామీ పనులు, రెవెన్యూ, హౌసింగ్, వ్యవసాయం,సాగునీటి విడుదల, జగనన్న భూహక్కు కార్యక్రమాలపై సచివాలయ స్థాయి నుంచి జిల్లా కలెక్టరేట్ స్థాయివరకు ఎప్పటికప్పడు సమీక్ష చేసుకొని అర్హుల్కెన లబ్దిదారులకు సంక్షేమ ఫలాలు అందించడం ప్రధాన లక్ష్యం.ఈబృహాత్తర క్యాక్రమం నెల రోజుల పాటు నిర్వరామంగా కొనసాగుతుంది. సచివాలయ సిబ్బందికి సైతం శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలకు సంబంధించిన జనన,మరణ,కుల,మత, నివాస పత్రాలు,సర్టిఫికేట్లు జారీ,ప్రభుత్వపథకాల సమస్యలుంటే వెంటనే పరిష్కరిస్తారు.ఈపనుల నిర్వహణ కోసం మండలాధికారులు స్థానికంగా ఎక్కడికక్కడ క్యాంపులు నిర్వహించి తక్షణం పరిష్కరిస్తారు.ఎవరి సమస్యైనా తిరస్కరించ బడితే ఎందుకు తిరస్కరించారనేది ఆఫిర్యాదు దారుడి ఇంటికెళ్లి వివరిస్తారు.అప్పటి వరకూ పరిశీలనకు నోచుకోని సమస్యను 24గంటల్లోగా పరిష్కరమయ్యే అవకాశం ఉంది. అర్హత ఉండీ ప్రభుత్వపథకాలు అందనివారిని గుర్తించి తక్షణం వారికి ఆపధకాల లబ్ది పొందేలా చేస్తారు.
సమస్యలపై మండలాధికారులు క్యాంపులు
సర్టిఫికెట్లకు సంబంధించి,అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా యా? లేవా?అన్నదానిపై ఈ కార్యక్ర మంలో జల్లెడపడపట్టనున్నారు.నగర/పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్,జోనల్ కమిషనర్లు,సిబ్బంది ఒక టీమగా ఏర్పాటు చేసుకుని వివిధ వార్డుల్లో పర్యటిస్తారు.మండల స్థాయిలో ఎంపీడీఓ,డిప్యూటీ తహాసీల్దార్ ఒక బృందం,తహాసీల్దార్ ఈఓ పంచాయితీ రాజ్ కలసి రెండు బృందాలుగా గ్రామాలకు వెళ్తారు. సచివాలయానికి వస్తున్న తేదీ వివరాలను ముందే నిర్ణయించి,ఆ రోజు వాటికి గ్రామంలో ఉన్న క్షేస్థ్రాయి సిబ్బంది ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తారు.నెల రోజులపాటు జరిగే ఈక్రార్యక్రమంలో ప్రతిరోజుఒక టీమ్ ఒక్కో సచివాలయాన్ని మాత్రమే సందర్శిస్తారు.
వాలంటీర్ల గుర్తించుకోవాల్సిన విషయాలు
పనిని సమర్ధవంతంగా అర్ధం చేసుకోవడానికి ఎంఎల్ఓ,మండల ఇన్చార్జిలు,కలసి ఏర్పాఉ చేసిన శిక్షణా సమావేశానికి హాజరుకావాలి. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో సమన్వ యం చేసుకోవాలి. ప్రజల సమస్యలకు సంబంధించిన పత్రాలను గుర్తించి పౌరుల నుంచి తీసుకొని సచివాలయంలో సమర్పించాలి.ప్రతి ఇంటిని సందర్శించి వాలంటీర్ యాప్‌లో సర్వేని పూర్తి చేయాలి.ఇంటికి తాలం వేసి ఉంటే..వేరే సమయంలో మళ్లీ సందర్శించాలి. ఆయా సచివాలయ పరిథిలో క్యాంపు జరిగే తేదీని ప్రతి ఇంట్లో పలుమార్లు చెప్పాలి.ఆవ్యక్తి అనుమతితో వారి జియో`ట్యాగ్ చేయబడిన చిత్రాలను క్లిక్ చేయాలి.అదే రోజున యాప్,వాట్సాప్ గ్రూపుల్లో పోటోలు, అప్‌టడేట్‌ను షేర్ చేయాలి.పథకాలు లేదా డాక్యుమెంట్ సంబంధింత సమస్యలు ఉన్న వ్యక్తులందరినీ క్యాంప్‌కు రావడానికి ప్రొత్సహించాఇ. క్యాంపుకు ముందు ఫిర్యాదు చేయని వ్యక్తులను కూడా తమ సమస్య పరిష్కారం కోసం క్యాంప్ రోజు సందర్శించ వచ్చు. దీనికి సంబంధించి ఆయా వార్డు/గ్రామ సచివాలయంలో ప్రత్యేక డెస్కలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి శనివారం నుంచే మండలస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఆగస్టు 1వతేదీన అర్హత పత్రాలు అందించే కార్యక్రమం
జగనన్న సురక్షలో వివిధ పథకాల కిందఅర్హు లుగా గుర్తించినవారికి ఆగస్టు1వతేదీన అర్హత పత్రాలు అందిస్తారు.ఇందులో సమస్యల పరిష్కారంలో క్వాలిటీ అనేది చాలా ముఖ్యమని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికా రులకు ఆదేశించారు. ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారం కావడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉం డాని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని సూచించారు.. గ్రీవెన్స్‌రిజెక్ట్ చేస్తే ఎందుకు తిరస్కరించారో ఫిర్యాదుదారుడు ఇంటికెళ్లి వివరిస్తున్నారు. ప్రజలకు అన్నిరకాలసేవలు అందించాలని సీఎం ఆదేశించారు.
కల్తీ విత్తనాల పట్ల అలర్ట్..
అదే విధంగా వర్షాకాలం ప్రారంభమైనందున విత్తనాలు,ఎరువులు,పురుగుమందుల కొరత రాకుండా రైతు భరోసా కేంద్రాలను పర్యవేక్షించాల్సి ఉంది.కల్తీవిత్తనాలపట్ల అలర్ట్‌గా ఉండటం,ఎక్కడ్కెనా కల్తీ కనిపిస్తే కలెక్టర్లు, ఎస్పీలను బాధ్యులుగా చేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరించారు. జుల్కె1నుంచి ఇ-క్రాప్ బుకింగ్స్ ప్రారంభించి,సెప్టెంబరు మొదటి వారానికి పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. సెప్టెంబరు నెలాఖరులోగా తుది జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి.సీసీఆర్సీ కార్డులపై అవగాహన కల్పించి కౌలు రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. మొదటి ఫేజ్‌లో2వేల గ్రామాల్లో జగనన్న భూహక్కు,భగరక్షకార్యక్రమం పూర్తయ్యిందని సచివాలయాల స్థాయిలోనే రిజిస్ట్రేషన్ సహా అన్నిరకాల సేవలు వీరికి అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు.ఈ గ్రామాల నుంచి రైతులు ఎవ్వరూకూడా తహశీల్దార్,రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం రాకూడదనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం.
రాష్ట్రవ్యాప్తంగా జగనన్న సురక్ష క్యాంపులు ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సంక్షేమ పథకాలను ఇప్పటి వరకు 99శాతం మంది అర్హులందరికి అందజేసి.. అర్హత ఉండి సాంకేతిక కారణాలతో మిగిలిపోయిన 1 శాతం లబ్ధిదా రులను కూడా కవర్ చేస్తూ 100 శాతం సంక్షేమం అందిచాలనే దిశగా జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తోందని సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సందర్బంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలి రోజు క్యాంపుల నిర్వహణ తీరును వివరించారు. ఈ సందర్బంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే.. వారికి లబ్ది చేకూర్చడం, ప్రజలకు అవసరమైన సర్టిఫికేట్లు, వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష పథకాలన్ని ప్రారంభించినట్లు మంత్రి మేరుగ తెలిపారు. సంక్షేమం, అభివృద్ది రెండు కళ్లుగా భావించి..సీఎం జగన్ మోహన్ రెడ్డి.. దేశ చరిత్రలో ఏముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఒక్క రోజులోనే సర్టిఫికేట్లను అందిస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది
జగనన్న సురక్ష క్యాంపులను ఏర్పాటు చేసి.. అక్కడే ప్రజల సమస్యకు పరిష్కారం చూపు తూ.. అదేవిధంగా అర్హులైన వారికి పథకాలు వచ్చేలా సాంకేతిక సమస్యలను కూడా వెంటనే పరిష్కారం చూపుతున్నామన్నారు. ఇక అవసర మైన వారికి ఉచితంగా సర్టిఫికేట్లను అందిస్తున్న ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుం దని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వాలం టీర్లు, సచివాలయ గృహసార థులు ప్రతి ఒక్కరి ఇళ్లకు వచ్చి వారి సమస్య లను తెలుసుకుని టోకెన్లు ఇస్తారని.. ఇక జులై 1 నుంచి 30 వరకు సచివాలయాల పరిధిలో క్యాంపులు పెట్టి.. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్స్, పథ కాల లబ్ది, సమస్యలను మండల, సచివాల య అధికారులు దగ్గరుండి పరిష్కరి స్తారని ఈ అవ కాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వి నియోగం చేసు కోవాలని మంత్రి మేరుగ అన్నారు. టీడీపీ హయాంలో చేసిన ఒక్క మంచిపని కూడా లేదని.. సీఎం జగన్ సంక్షేమ పథకాలు ఇస్తుంటే.. ముసలి కన్నీరు కార్చిన చంద్రబాబు రాష్ట్రం శ్రీలంక అవుతుందని.. అప్పులపాలు అవుతుందని ప్రచారం చేయిం చారని, ఇప్పుడు అవే సంక్షేమ పథకాలు తానూ ఇస్తానని కళ్లబొల్లి మాటలు చెబుతున్నారని మంత్రి మండిపడ్డారు.
పారదర్శక పాలనకు నిదర్శనంగా జగనన్న ప్రభుత్వం: ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్
సంక్షేమ పథకాల అమలులో పార్టీ, కులం, మతం, ప్రాంతం చూడకుండా..అర్హతే ప్రామాణికంగా ఉందని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో దాదాపు 2.16లక్షల మంది వాలంటీర్లు, 1.5 లక్షల మంది సచివాలయ సిబ్బంది మండల అధికారులు,జిల్లా అధికారులు పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ‘’జగనన్న సురక్ష పథకాన్ని జులై నెలలో ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం.. ఈ నెల లోనే విద్యార్థులు కళాశాలలకు వెళ్తారు కాబట్టి వారికి కావాల్సిన సర్టిఫికెట్లను ముందుగానే ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది, దీంతో పాటు సంక్షేమ పథకాలు కూడా ఆగస్టు నుంచే పథకాల క్యాలెండర్ అమలవుతుంది..అందు కని ఈ నెలలో పథకాలకు లింక్ చేయా ల్సిన సర్టిఫికెట్లను ప్రభుత్వం అందిస్తోంది’’ అని ఎమ్మె ల్సీ మర్రి రాజశేఖర్ చెప్పుకొచ్చారు. గత టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీ సిఫార్సు లు,టీడీ పీ నాయకుల సూచనల మేరకు పథకాలు ఇచ్చే వారని, కానీ సీఎం జగన్ నాయకత్వంలో అర్హతే ప్రామాణికంగా పథకాలు అందిస్తు న్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే వాలంటీర్లు అందరూ ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారని..ఇక వారి సచివాలయ పరిధిలో క్యాంపులు పెట్టి వాటిని పరిష్కరి స్తారని ఎమ్మెల్సీ రాజశేఖర్ చెప్పారు. ప్రజల వద్దకే పాలనను ఆచరించి చూపాం
‘’జగనన్న సురక్ష వంటి కార్యక్రమం అమలు చేయాలంటే దమ్ము, ధైర్యం ఉండాలి, ఆ లక్షణా లు మా నాయకుడు సీఎం జగన్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఎక్కడైనా మాకు ఈ సమస్యలు ఉన్నాయని ప్రజలు అధికారుల వద్దకు వస్తారని, కానీ సీఎం జగన్ మాత్రం అధికారులనే ప్రజల వద్దకు పంపి మీ సమస్య లు ఏంటి అని తెలుసుకుని..వాటిని పరిష్కరిం చేందుకు క్యాంపులు ఏర్పాటు చేయడం ఇది సుపరిపా లనకు నాంది పలకడమేనని’’ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మండలానికి 2 చొప్పున 1,305 సచివాలయాల పరిధిలో ‘జగనన్న సురక్ష’ క్యాంపులు విజయవంతంగా నిర్వహించి లబ్ధిదారులకు అవసరమైన ద్నృవపత్రాలు, ప్రభు త్వ సేవలను అక్కడికక్కడే అందించినట్లు ఎమ్మె ల్సీ పేర్కన్నారు. దీనికి సంబంధించి ఆయా సచి వాలయాల పరిధిలోని వాలంటీర్లు జూన్ 24వ తేదీనే ఇంటింటికీ వెళ్లి క్యాంపుల సమాచారాన్ని తెలియజేయడంతో పాటు ఆయా కుటుంబాల నుంచి వ్యక్తిగత వినతులను సేకరిం చి జగనన్న సురక్ష యాప్ లో నమోదు చేశారని తెలిపారు. రద్దీగా ఉన్న జగనన్న సురక్ష క్యాంపుల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండావారి భోజన, త్రాగునీరు సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది.-జిఎన్‌వి సతీష్