చదువుల తల్లి సావిత్రీబాయి ఫూలే
మహళా హక్కుల ఉద్యమ కెరటం సావిత్రిభాయి ఫూలే.మహిళా లోకానికి చదువులు నేర్పించిన చదువుల తల్లి. గొప్ప సంస్కర్త సావిత్రిభాయి ఫూలే.అట్టడుగు వర్గాలు,మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులునిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, సాంప్ర దాయాలను, ఆదిపత్యవర్గాలనుధిక్కరించి భారత దేశపు మొట్టమొదటి ఉపాధ్యాయు రాలుగా పాఠశాలలు ప్రారంభించి 1848లో దేశంలో బహుజనులకు మొట్టమొదటి పాఠశాల ప్రారంభించారు.సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె. కేవలం నాలుగు సంవత్సరాల్లోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందిం చారు. 1848లోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యా యురాలు. దళితుల,మహిళల విద్యావ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్లు మాత్రమే. వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశా లలు ప్రారంభించిన ఘనత సావిత్రిభాయి ఫూలేదే. ఆమో 126వ వర్ధింతి సందర్భంగా ప్రత్యేక కథనం.!
ఉద్యమశీలి సావిత్రిబాయి ఫూలే
సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు..స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి.. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచ యిత్రి. స్త్రీపురుషులు కులమతాలకతీతంగా విద్యనభ్యసించడం సహజమైన హక్కు ఉంటుం దని, అందుకే అందరూ చదవాలి.అందరూ సమానంగా బ్రతకాలి అని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి. నాటి, నేటి సమాజంలో సావిత్రిబాయి ప్రాము ఖ్యత గొప్పది. 1831 జనవరి 3న మహా రాష్ట్రలోని సతారా జిల్లా నమ్గావ్లో సావిత్రి బాయి జన్మించింది. 1847నాటికి భర్తతో కలిసి బాలికలకోసం పూనేలో మొదటి పాఠశాల ప్రారంభించారు.ఈ పాఠశాల నడపటం కొంద రికి నచ్చలేదు.దీంతో సావిత్రీ బాయిపై వేధిం పులకు, భౌతికదాడులకు పూనుకున్నారు. పాఠ శాలకు నడిచేదారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం,అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకుని, మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా ‘నా విధిని నేను నిర్వహిస్తున్నాను’ అని చెప్పేది. పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం గుర్తింపు లభించాయి. ఒకరు తమ ఇంటి ఆవరణను బడి కోసం ఇస్తే, కొంత మంది పుస్తకాలు సేకరించారు. మోరోవిఠల్, వాల్వేకర్, దియోరావ్ వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు. 1851లో మరల పాఠశాల ప్రారంభించారు. బాలికల చదువు కోసం, విద్యాభివృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. 1852లోనే మహిళాసేవ మండల్ పేరిట మహిళా సంఘాన్ని స్థాపించారు. వితంతువుల పట్ల వివక్ష, అక్రమ సంతానం పేరిట శిశువుల హత్యలకు వ్యతిరేకంగా వివిధ పోరాటాలు నడిపారు. అనాధ బాలలు,బాలికలు అందరూ తమ బిడ్డలేనని భావించారు.1874లో ఒక వితంతువు బిడ్డను పూలే దంపతులు దత్త పుత్రుడిగా స్వీకరించారు. ఆబిడ్డకు యశ్వంత్ అనే పేరుపెట్టి పెద్దవాడిని చేసి డాక్టర్ను చేశారు.1873లోనే సత్యశోధక్ సమాజం మహిళా విభాగం పేరిట కులాంతర వివా హాలు అనేకం జరిపించారు. భార్యను కోల్పో యిన ఒక యువకుడికి తన స్నేహితురాలి బిడ్డతో పెండ్లి చేశారు సావిత్రిబాయి భర్తతోపాటు తాను కూడా అన్ని కష్టాల్ని అవమానాల్ని సహించింది. సావిత్రీబాయి ప్రపంచచరిత్రలోనే భర్తతోపాటు ఉద్యమ జీవితంలో కలిని నడిచిన ఆదర్శ సహచరిగా ఆమె నిలిచిపోయింది. సావిత్రిబాయి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి విద్యాబోధనకు, బాలికలకు అంకిత మైంది. సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పెద్దలతో ఘర్షణ పడవలసివచ్చినా బెదరలేదు.అనాథ స్త్రీలకు, పిల్లలకు శరణాలయాలు, ఆశ్రమాలు ఏర్పాటు చేయించింది. సత్యశోధక సమాజంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి కులాంతర వితంతు వివాహాలు జరిపించింది. 1890లో భర్త జ్యోతిరావు ఫూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు, దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే తానే చితికి నిప్పు అంటించి అంత్యక్రియలు పూర్తి చేసింది. ఆమె తెగువకు యావత్ భారతదేశం దిగ్భ్రాంతి చెందింది.
1896-97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలా కుతలం చేశాయి. ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని పేదలకు జోలెపట్టి విరాళాలు సేకరించి అందించారు. ప్లేగువ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు. 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారినపడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది. దుర్భ రమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2 వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది. 1897వ సంవత్సరం,మార్చి 10న ఒక పిల్ల వాడికి సేవ చేస్తుండగా ఆమెకు ఆ వ్యాధే సోకి మరణించింది. సావిత్రిబాయి పూలే గొప్ప కవి, రచియిత్రి, చక్కటి ఆలోచనలు, త్యాగం, సేవ, నిబద్ధత కలిగిన మహిళ. 1854లో కావ్యపూలే అనే ఒక కవితా సంపుటి రచించారు. అభంగ్ అనే రచన ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండేది. సూటిగా, సరళంగా ప్రకృతి వర్ణన జానపద కళలు, ప్రతిబింబించే కావ్య రచనలు చేశారామె.1891లో ప్వాన్కాశీ సుభోధ్ రత్నాకర్ 11పేరిట కవితా సంపుటిని ప్రచు రించారు. క్రాంతి బాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రీబాయి ఫూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగొం దుతూనే ఉంటుంది. భారతదేశంలో కేవలం పురుషులకు మినహా మరెవ్వరికీ చదువుకునే హక్కు, అవకాశాలు లేకుండా సనాతన ధర్మం పేరుతో ఆంక్షలు కొనసాగాయి. నాగరికత పెరిగేకొద్దీ అక్కడక్కడ కొంతమంది ఉన్నత భావాలుగల పురుషులు అనుమతితో, మద్దతుతో,స్త్రీల ఘాడమైన అభిలాషతో అభ్య సించినటికి అది నామమాత్రమే. ముస్లింల పాలనలో కూడా మహిళల దుస్థితిలో మార్పు ఏమాత్రం లేదు. ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చిన వందేళ్ళకు కూడా ఎటువంటి కృషి చేయలేదు. కేవలం ఆంగ్లేయ స్త్రీలు విధ్యావంతులుగా ఉండటం, వారు విధ్యాసంస్థల్లో విధ్యను అభ్యసించడం వంటివాటిని ప్రత్యక్షంగా గమనించిన భారతీయ స్త్రీలలో విధ్య జిజ్ఞాస పెరిగింది. మహిళలే కాకుండా విదేశీ వనితల విద్యనభ్యసించడాన్ని పరిశీలించిన భారతీయ పురుషుల్లో కూడా స్త్రీ విధ్య తప్పుకాదనే అభిప్రాయాన్ని కలుగజేసింది. ఇది కూడా చాలా పరిమితంగానే. చదువుల తల్లి సావిత్రిభాయి ఫూలే చిన్న వయస్సులో చిరుతిండి కొనుక్కుతినడానికి వెళ్లినప్పుడు ఓ క్రైస్తవ మత బోధకుడు ఆమెతో…. ‘‘ఇలా దుకాణాల్లో కొనుక్కు తినరాదు, అవి శుబ్రంగా ఉండవు, అనారోగ్యాన్ని కలుగజేస్తాయి’’ అని చెప్పి. తీరిక వేళలో ఈ పుస్తకాన్ని చదువు అని బైబిల్ చేతిలో పెట్టాడు. ఇంటికి తీసుకెళ్లిన సావిత్రిబాయి బైబిల్ చదవాలని కోరిక ఉన్న ప్పటికి పాఠశాల విధ్య లేనందువల్ల చదవలేక పోయింది.కానీ చదవాలనే కోరిక మాత్రం పెరిగింది. సావిత్రిబాయి తండ్రి ఆ బైబిల్ బయట విసిరేశాడు కానీ సావిత్రిబాయి ఆశయాన్ని మాత్రం విసిరేయలేకపోయాడు. అందరు మహిళలు గమినించినట్లే సావిత్రిబాయి కూడా విదేశీ వనితలు విద్యాభ్యాసం చేయడం గమనించి చదువుపై ఆసక్తిని బలపరచు కొన్నారు. ఎన్నో ఏళ్లుగా సాంప్రదాయాలు, ఆచారాల పేరిట మహిళలకు, శూద్రులకు, అతి శూద్రులకు విద్యను నిరాకరించిన బ్రాహ్మణ మతం ( ప్రస్తుత హిందూ మతం ) కనీసం చదువుకోవాలనే కోరిక కూడా కలుగనీ యకుండా చేసింది. విద్య బ్రాహ్మణ సొత్తు, ఇంకెవరికి ఆ అర్హత లేదనే ముద్ర ప్రతి మెదడులో పేరుకుపోయింది. ఒకవేళ ఎవరైనా చదువులను ప్రోత్శహించినా చదువుకోవాల్సిన వారు సైతం అది తప్పని వ్యతిరేకించే మూఢ నమ్మకాల్లో మునిగిపోయారు. ఆంగ్లేయుల రాకతో ఇలాంటి మూఢనమ్మకాలు ఒక్కొకటి తొలగిపోసాగాయి. మత వ్యాప్తి కొరకే అయినప్పటికి క్రైస్తవ మిషనరీలు బైబిళ్ళు ఉచితంగా పంచడం ఒకగొప్ప విప్లవంగా చెప్పక తప్పదు. ఎందుకంటే …బలహీన వర్గాల చేతిలో ఒక మత గ్రంధం అనేది బైబిల్ తోనే మొదలైంది. పురాణాలు వేదాలు స్త్రీలు, శూద్రులు, అతిసూద్రులు తెలుసుకోగూడదు అనే కఠిన ఆంక్షలున్నప్పుడు ఒక మత గ్రంధం చేతి లోకి వస్తే ఆసంతోషాన్ని ఎలా చెప్పగలం? వేధాలు వింటే (చాటుగా విన్నా సరే) చెవుల్లో సీసం పోసే సంస్కృతి అమల్లో ఉన్నప్పుడు వెతుక్కుంటూ వచ్చి బైబిల్ వినిపిస్తుంటే తబ్బిబ్బి అవ్వక ఎలా ఉండగలరు ? విద్య ఉన్నత వర్గాలకే అని మిగిలినవారికి నిషేదించినప్పుడు, కాదు ఎవ్వరైనా చదువుకోవచ్చు కాదు కాదు అందరూ చదవాలి అని విద్యాలయాలు స్థాపించి విద్యాదానం చేసింది క్రైస్తవం. దీనిమీద రెండు ప్రధాన ఆరోపణలు లేకపో లేదు. ఆంగ్లేయులు క్రైస్తవ మత వ్యాప్తి కోసం మరియు దుబాసీల కోసం మనకు విద్యను నేర్పింది అనేది మొదటి ఆరోపణ అయితే, రెండ వది ఆంగ్లేయుల కార్యాలయాల నిర్వహణ కోసం మాత్రమే విద్యను అందించింది కానీ పరోపకారం ఏమీ లేదు అనేది. ఈ ఆరోపణలు నిజమే అనుకున్నా, అదే కార్యాలయాల నిర్వ హణ కోసం సనాతన హైందవం ఎందుకు ప్రోత్సహించలేదు ?అదే మత ప్రచారం కోసం హైందవం ఎందుకు అక్షరాస్యతకు కృషిచేయ లేదనేవి సమాదానం లేక దాటవేసే ప్రశ్నలు. అయినప్పటికి ఆంగ్లేయులు కూడా ఎకా ఎకీనా బలహీనవర్గాలకు మాత్రమే విద్యను అందించ లేదు, ఆ మాటకొస్తే ఆంగ్లేయులు స్థాపించిన సంస్థల్లోనూ ముందుగా ప్రవేశాలు ఆధిపత్య వర్గాలకేగాని బలహీనవర్గాలకు కాదు. ఈ సంధర్భంలో మనం మహాత్మా జ్యోతిభా ఫూలే, చదువులతల్లి సావిత్రిభాయి ఫూలే లాంటి విజ్ఞాన విప్లవకారుల గురించి తెలుసు కోవాల్సిన అవసరం ఉంది. క్రైస్తవ మత ప్రభావం కావొచ్చు,ఆంగ్లేయ మహిళలను పరిశీలించడం వలన కావొచ్చు స్త్రీ విధ్య పాపం కాదు అవస రం అని గుర్తించి కులాలలకు మతాలకు,లింగ బేధాలకు అతీతంగా పాఠ శాలలు స్థాపించి విధ్యావ్యాప్తికి ఆధ్యులుగా నిలుస్తారు.ముఖ్యంగా చదువుల తల్లి సావిత్రి భాయి అటు అత్త మామలచేత, ఇటు తల్లిదం డ్రులచేత మాత్రమే కాకుండా సమా జంచేత ఎన్నో ఛీత్కారాలు, దాడులు ఎదుర్కొని సమా జంలో సగభాగమైన మహిళా విద్యకొరకు చేసిన కృషిని ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆధర్శ పురుషుల్లో మహాత్మా ఫూలే, ఆధర్శ స్త్రీలలో సావిత్రిభాయి ఫూలే ముందువరుసలో ఉన్నారు.
ఆమె చరిత్ర పాఠాలుగా పెట్టాలి..
సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఫూలేకు సంబంధించిన చరిత్రను పాఠ్యాంశాలలో అంతర్భాగం చేసి భవిష్యత్తు తరాలకు తెలియ జేయాలి.ఫూలే జీవితాలు,రచనలు, కార్య చరణ తదితర అంశాలపై వివిధ విశ్వవిద్యాల యాల్లో పరిశోధనలు జరపడానికి అధ్యయన కేంద్రాలు ఏర్పరచవలసిన అవసరం ఉంది. సావిత్ర బాయి రచనలు, ఆమె జరిపిన కృషి సమకాలీన సమాజానికి ఇప్పటికీ చాలా అనుగణమైనవే.
సంస్కరణ వాది..
సావిత్రి బాయి ఏర్పరుచుకున్న బోధనా పద్ధతి సమ్మిళిత స్వభావంగా,విద్యార్థిని భాగస్వామిని చేసేలా వినూత్నంగా ఉండేది. విద్య ద్వారా విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించడాన్ని ఆమె ప్రోత్సహించేది.11 ఏండ్ల ముక్తా బాయ్ అనే సావిత్రి బాయ్ దళిత శిష్యురాలు మాంగ్ లు, మహర్లు సమాజంలో ఎదుర్కొంటున్న కష్టనష్టాలు-బాధలపై1855లో ధ్యానోదయ అనే వార్తాపత్రికలో ఒక వ్యాసం రాసింది. వివిధ అంశాలపై దళిత మహిళలు రాసిన రచనల్లో బహుశా దీన్ని తొలిరచనల్లో ఒకటిగా పేర్కొనవచ్చు. సావిత్రి బాయి సామాజిక మార్పును అట్టడుగు స్థాయి నుంచి తీసుకురా వడానికి ప్రయత్నించారు. దీనికి అనుగుణంగా ఆమె ఆ కాలంలో అమల్లో ఉన్న సాంఘిక కట్టుబాట్లను, సంప్రదాయాలను నిశితంగా విమర్శించేవారు. శూద్రులకు ఆమె స్వయంగా బావులను ఏర్పరిచింది. సంస్కరణవాది అయిన జ్యోతిరావ్ ఫూలేతో కలిసి కులవ్యవస్థపై సమూ లంగా పోరాటం చేసింది. కులాంతర వివాహా లను ప్రోత్సహించి,ఆ విధంగా పెళ్లి చేసుకున్న దంపతులకు ఆశ్రయం కల్పించేవారు.సావిత్రి బాయి సాహిత్య గ్రంథాల్లో కావ్య ఫూల్(కవిత్వ నవవికాసం),బావన్ కాషీ సుబోధ్ రత్నాకర్ (రత్నాల సంద్రం) తదితర రచనలు ఆమెలోని సృజనాత్మక ఆలోచనలు, సామాజిక చింతనలను మేళవింపుగా ప్రతిబింబిస్తాయి. అణగారిన వర్గాలకు, మహిళలకు విద్యను అందించడం, తద్వారా వారి విమోచనకు పాటుపడటం, ఆంగ్లవిద్య ప్రాముఖ్యాన్ని పేర్కొనడం, సంప్రదా య దురాచారాలు,అహేతుక విలువలను సవాలు చేయడం, వితంతువులకు పునర్వి వాహాలను,కులాంతర వివాహాలను ప్రోత్సహిం చడం,దళితులకు మంచినీటి బావులు అందు బాటులో ఉంచడం, మహిళలకు అను కూలం గా ప్రజాజీవనంలోని వ్యక్తిగత-బహిరంగ సంద ర్భాల్లో తనగొంతు వినిపించడం, ఇతర మతా లకు చెందిన అల్పసంఖ్యాక వర్గాలతో సౌహార్ద్ర సంబంధాలు కలిగి ఉండటం సావిత్రిబాయి దృ క్పథం. – (చదువుల తల్లి సావిత్రిభాయి ఫూలే మహాపరినిర్వాణ దినం మార్చి 10)
-మహళా హక్కుల ఉద్యమ కెరటం సావిత్రిభాయి ఫూలే.మహిళా లోకానికి చదువులు నేర్పించిన చదువుల తల్లి. గొప్ప సంస్కర్త సావిత్రిభాయి ఫూలే.అట్టడుగు వర్గాలు,మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులునిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, సాంప్ర దాయాలను, ఆదిపత్యవర్గాలనుధిక్కరించి భారత దేశపు మొట్టమొదటి ఉపాధ్యాయు రాలుగా పాఠశాలలు ప్రారంభించి 1848లో దేశంలో బహుజనులకు మొట్టమొదటి పాఠశాల ప్రారంభించారు.సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె. కేవలం నాలుగు సంవత్సరాల్లోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందిం చారు. 1848లోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యా యురాలు. దళితుల,మహిళల విద్యావ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్లు మాత్రమే. వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశా లలు ప్రారంభించిన ఘనత సావిత్రిభాయి ఫూలేదే. ఆమో 126వ వర్ధింతి సందర్భంగా ప్రత్యేక కథనం.!
ఉద్యమశీలి సావిత్రిబాయి ఫూలే
సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు..స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి.. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచ యిత్రి. స్త్రీపురుషులు కులమతాలకతీతంగా విద్యనభ్యసించడం సహజమైన హక్కు ఉంటుం దని, అందుకే అందరూ చదవాలి.అందరూ సమానంగా బ్రతకాలి అని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి. నాటి, నేటి సమాజంలో సావిత్రిబాయి ప్రాము ఖ్యత గొప్పది. 1831 జనవరి 3న మహా రాష్ట్రలోని సతారా జిల్లా నమ్గావ్లో సావిత్రి బాయి జన్మించింది. 1847నాటికి భర్తతో కలిసి బాలికలకోసం పూనేలో మొదటి పాఠశాల ప్రారంభించారు.ఈ పాఠశాల నడపటం కొంద రికి నచ్చలేదు.దీంతో సావిత్రీ బాయిపై వేధిం పులకు, భౌతికదాడులకు పూనుకున్నారు. పాఠ శాలకు నడిచేదారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం,అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకుని, మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా ‘నా విధిని నేను నిర్వహిస్తున్నాను’ అని చెప్పేది. పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం గుర్తింపు లభించాయి. ఒకరు తమ ఇంటి ఆవరణను బడి కోసం ఇస్తే, కొంత మంది పుస్తకాలు సేకరించారు. మోరోవిఠల్, వాల్వేకర్, దియోరావ్ వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు. 1851లో మరల పాఠశాల ప్రారంభించారు. బాలికల చదువు కోసం, విద్యాభివృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. 1852లోనే మహిళాసేవ మండల్ పేరిట మహిళా సంఘాన్ని స్థాపించారు. వితంతువుల పట్ల వివక్ష, అక్రమ సంతానం పేరిట శిశువుల హత్యలకు వ్యతిరేకంగా వివిధ పోరాటాలు నడిపారు. అనాధ బాలలు,బాలికలు అందరూ తమ బిడ్డలేనని భావించారు.1874లో ఒక వితంతువు బిడ్డను పూలే దంపతులు దత్త పుత్రుడిగా స్వీకరించారు. ఆబిడ్డకు యశ్వంత్ అనే పేరుపెట్టి పెద్దవాడిని చేసి డాక్టర్ను చేశారు.1873లోనే సత్యశోధక్ సమాజం మహిళా విభాగం పేరిట కులాంతర వివా హాలు అనేకం జరిపించారు. భార్యను కోల్పో యిన ఒక యువకుడికి తన స్నేహితురాలి బిడ్డతో పెండ్లి చేశారు సావిత్రిబాయి భర్తతోపాటు తాను కూడా అన్ని కష్టాల్ని అవమానాల్ని సహించింది. సావిత్రీబాయి ప్రపంచచరిత్రలోనే భర్తతోపాటు ఉద్యమ జీవితంలో కలిని నడిచిన ఆదర్శ సహచరిగా ఆమె నిలిచిపోయింది. సావిత్రిబాయి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి విద్యాబోధనకు, బాలికలకు అంకిత మైంది. సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పెద్దలతో ఘర్షణ పడవలసివచ్చినా బెదరలేదు.అనాథ స్త్రీలకు, పిల్లలకు శరణాలయాలు, ఆశ్రమాలు ఏర్పాటు చేయించింది. సత్యశోధక సమాజంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి కులాంతర వితంతు వివాహాలు జరిపించింది. 1890లో భర్త జ్యోతిరావు ఫూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు, దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే తానే చితికి నిప్పు అంటించి అంత్యక్రియలు పూర్తి చేసింది. ఆమె తెగువకు యావత్ భారతదేశం దిగ్భ్రాంతి చెందింది.
1896-97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలా కుతలం చేశాయి. ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని పేదలకు జోలెపట్టి విరాళాలు సేకరించి అందించారు. ప్లేగువ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు. 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారినపడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది. దుర్భ రమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2 వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది. 1897వ సంవత్సరం,మార్చి 10న ఒక పిల్ల వాడికి సేవ చేస్తుండగా ఆమెకు ఆ వ్యాధే సోకి మరణించింది. సావిత్రిబాయి పూలే గొప్ప కవి, రచియిత్రి, చక్కటి ఆలోచనలు, త్యాగం, సేవ, నిబద్ధత కలిగిన మహిళ. 1854లో కావ్యపూలే అనే ఒక కవితా సంపుటి రచించారు. అభంగ్ అనే రచన ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండేది. సూటిగా, సరళంగా ప్రకృతి వర్ణన జానపద కళలు, ప్రతిబింబించే కావ్య రచనలు చేశారామె.1891లో ప్వాన్కాశీ సుభోధ్ రత్నాకర్ 11పేరిట కవితా సంపుటిని ప్రచు రించారు. క్రాంతి బాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రీబాయి ఫూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగొం దుతూనే ఉంటుంది. భారతదేశంలో కేవలం పురుషులకు మినహా మరెవ్వరికీ చదువుకునే హక్కు, అవకాశాలు లేకుండా సనాతన ధర్మం పేరుతో ఆంక్షలు కొనసాగాయి. నాగరికత పెరిగేకొద్దీ అక్కడక్కడ కొంతమంది ఉన్నత భావాలుగల పురుషులు అనుమతితో, మద్దతుతో,స్త్రీల ఘాడమైన అభిలాషతో అభ్య సించినటికి అది నామమాత్రమే. ముస్లింల పాలనలో కూడా మహిళల దుస్థితిలో మార్పు ఏమాత్రం లేదు. ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చిన వందేళ్ళకు కూడా ఎటువంటి కృషి చేయలేదు. కేవలం ఆంగ్లేయ స్త్రీలు విధ్యావంతులుగా ఉండటం, వారు విధ్యాసంస్థల్లో విధ్యను అభ్యసించడం వంటివాటిని ప్రత్యక్షంగా గమనించిన భారతీయ స్త్రీలలో విధ్య జిజ్ఞాస పెరిగింది. మహిళలే కాకుండా విదేశీ వనితల విద్యనభ్యసించడాన్ని పరిశీలించిన భారతీయ పురుషుల్లో కూడా స్త్రీ విధ్య తప్పుకాదనే అభిప్రాయాన్ని కలుగజేసింది. ఇది కూడా చాలా పరిమితంగానే. చదువుల తల్లి సావిత్రిభాయి ఫూలే చిన్న వయస్సులో చిరుతిండి కొనుక్కుతినడానికి వెళ్లినప్పుడు ఓ క్రైస్తవ మత బోధకుడు ఆమెతో…. ‘‘ఇలా దుకాణాల్లో కొనుక్కు తినరాదు, అవి శుబ్రంగా ఉండవు, అనారోగ్యాన్ని కలుగజేస్తాయి’’ అని చెప్పి. తీరిక వేళలో ఈ పుస్తకాన్ని చదువు అని బైబిల్ చేతిలో పెట్టాడు. ఇంటికి తీసుకెళ్లిన సావిత్రిబాయి బైబిల్ చదవాలని కోరిక ఉన్న ప్పటికి పాఠశాల విధ్య లేనందువల్ల చదవలేక పోయింది.కానీ చదవాలనే కోరిక మాత్రం పెరిగింది. సావిత్రిబాయి తండ్రి ఆ బైబిల్ బయట విసిరేశాడు కానీ సావిత్రిబాయి ఆశయాన్ని మాత్రం విసిరేయలేకపోయాడు. అందరు మహిళలు గమినించినట్లే సావిత్రిబాయి కూడా విదేశీ వనితలు విద్యాభ్యాసం చేయడం గమనించి చదువుపై ఆసక్తిని బలపరచు కొన్నారు. ఎన్నో ఏళ్లుగా సాంప్రదాయాలు, ఆచారాల పేరిట మహిళలకు, శూద్రులకు, అతి శూద్రులకు విద్యను నిరాకరించిన బ్రాహ్మణ మతం ( ప్రస్తుత హిందూ మతం ) కనీసం చదువుకోవాలనే కోరిక కూడా కలుగనీ యకుండా చేసింది. విద్య బ్రాహ్మణ సొత్తు, ఇంకెవరికి ఆ అర్హత లేదనే ముద్ర ప్రతి మెదడులో పేరుకుపోయింది. ఒకవేళ ఎవరైనా చదువులను ప్రోత్శహించినా చదువుకోవాల్సిన వారు సైతం అది తప్పని వ్యతిరేకించే మూఢ నమ్మకాల్లో మునిగిపోయారు. ఆంగ్లేయుల రాకతో ఇలాంటి మూఢనమ్మకాలు ఒక్కొకటి తొలగిపోసాగాయి. మత వ్యాప్తి కొరకే అయినప్పటికి క్రైస్తవ మిషనరీలు బైబిళ్ళు ఉచితంగా పంచడం ఒకగొప్ప విప్లవంగా చెప్పక తప్పదు. ఎందుకంటే …బలహీన వర్గాల చేతిలో ఒక మత గ్రంధం అనేది బైబిల్ తోనే మొదలైంది. పురాణాలు వేదాలు స్త్రీలు, శూద్రులు, అతిసూద్రులు తెలుసుకోగూడదు అనే కఠిన ఆంక్షలున్నప్పుడు ఒక మత గ్రంధం చేతి లోకి వస్తే ఆసంతోషాన్ని ఎలా చెప్పగలం? వేధాలు వింటే (చాటుగా విన్నా సరే) చెవుల్లో సీసం పోసే సంస్కృతి అమల్లో ఉన్నప్పుడు వెతుక్కుంటూ వచ్చి బైబిల్ వినిపిస్తుంటే తబ్బిబ్బి అవ్వక ఎలా ఉండగలరు ? విద్య ఉన్నత వర్గాలకే అని మిగిలినవారికి నిషేదించినప్పుడు, కాదు ఎవ్వరైనా చదువుకోవచ్చు కాదు కాదు అందరూ చదవాలి అని విద్యాలయాలు స్థాపించి విద్యాదానం చేసింది క్రైస్తవం. దీనిమీద రెండు ప్రధాన ఆరోపణలు లేకపో లేదు. ఆంగ్లేయులు క్రైస్తవ మత వ్యాప్తి కోసం మరియు దుబాసీల కోసం మనకు విద్యను నేర్పింది అనేది మొదటి ఆరోపణ అయితే, రెండ వది ఆంగ్లేయుల కార్యాలయాల నిర్వహణ కోసం మాత్రమే విద్యను అందించింది కానీ పరోపకారం ఏమీ లేదు అనేది. ఈ ఆరోపణలు నిజమే అనుకున్నా, అదే కార్యాలయాల నిర్వ హణ కోసం సనాతన హైందవం ఎందుకు ప్రోత్సహించలేదు ?అదే మత ప్రచారం కోసం హైందవం ఎందుకు అక్షరాస్యతకు కృషిచేయ లేదనేవి సమాదానం లేక దాటవేసే ప్రశ్నలు. అయినప్పటికి ఆంగ్లేయులు కూడా ఎకా ఎకీనా బలహీనవర్గాలకు మాత్రమే విద్యను అందించ లేదు, ఆ మాటకొస్తే ఆంగ్లేయులు స్థాపించిన సంస్థల్లోనూ ముందుగా ప్రవేశాలు ఆధిపత్య వర్గాలకేగాని బలహీనవర్గాలకు కాదు. ఈ సంధర్భంలో మనం మహాత్మా జ్యోతిభా ఫూలే, చదువులతల్లి సావిత్రిభాయి ఫూలే లాంటి విజ్ఞాన విప్లవకారుల గురించి తెలుసు కోవాల్సిన అవసరం ఉంది. క్రైస్తవ మత ప్రభావం కావొచ్చు,ఆంగ్లేయ మహిళలను పరిశీలించడం వలన కావొచ్చు స్త్రీ విధ్య పాపం కాదు అవస రం అని గుర్తించి కులాలలకు మతాలకు,లింగ బేధాలకు అతీతంగా పాఠ శాలలు స్థాపించి విధ్యావ్యాప్తికి ఆధ్యులుగా నిలుస్తారు.ముఖ్యంగా చదువుల తల్లి సావిత్రి భాయి అటు అత్త మామలచేత, ఇటు తల్లిదం డ్రులచేత మాత్రమే కాకుండా సమా జంచేత ఎన్నో ఛీత్కారాలు, దాడులు ఎదుర్కొని సమా జంలో సగభాగమైన మహిళా విద్యకొరకు చేసిన కృషిని ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆధర్శ పురుషుల్లో మహాత్మా ఫూలే, ఆధర్శ స్త్రీలలో సావిత్రిభాయి ఫూలే ముందువరుసలో ఉన్నారు.
ఆమె చరిత్ర పాఠాలుగా పెట్టాలి..
సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఫూలేకు సంబంధించిన చరిత్రను పాఠ్యాంశాలలో అంతర్భాగం చేసి భవిష్యత్తు తరాలకు తెలియ జేయాలి.ఫూలే జీవితాలు,రచనలు, కార్య చరణ తదితర అంశాలపై వివిధ విశ్వవిద్యాల యాల్లో పరిశోధనలు జరపడానికి అధ్యయన కేంద్రాలు ఏర్పరచవలసిన అవసరం ఉంది. సావిత్ర బాయి రచనలు, ఆమె జరిపిన కృషి సమకాలీన సమాజానికి ఇప్పటికీ చాలా అనుగణమైనవే. –(శామ్యూల్ రాజ్)