గోండు రాజుల పాలనకు నిదర్శనాలు

ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజనుల సంఖ్య ఎక్కువ. అందులో గోండు జాతీయుల సంఖ్య మరీ ఎక్కువ.. ఈ జిల్లాలో వివిధ రాజవంశీయుల పాలనా కొనసాగింది. అయితే గోండు జాతి ప్రజలు ఎవరి పాలనలోఉన్నా వారి సంప్ర దాయాలను, కట్టు బాట్లను, ఆచార వ్యవహారాలను కాపాడు కున్నారు. సిర్పూర్‌(టి) కేంద్రంగా ప్రారంభమైన వారి పాలన, వివిధ ప్రాంతాల్లో విస్తరించింది. క్రీ.శ.870 నుండి 1750 శతాబ్దము వరకు గోండ్వానా రాజ్యాన్ని గోండు రాజులు పరిపాలించారు.వీళ్ళు1350 శతా బ్దము నుండి 1600 శతాబ్దము వరకు స్వతంత్ర రాజులుగాను, ఆ తరు వాత1751శతాబ్దము వరకు సామంతరాజులుగాను,గోండ్వానా ప్రాంతాన్ని పరిపాలించారు. ఈభూభాగంలో దట్టమైన అడవి సంపద, విస్తారమైన ఖనిజ సంపద, సారవంతమైన నల్లరేగడి భూములు, అనేక రకాల చిరుధాన్యాలు , వాణిజ్య పంటలకు నిలయాలు.గోండ్వానా ప్రాం తము దక్షిణాన గోదావరి,పెన్‌గంగా వరకు ప్రాణహిత నదుల పరి వాహక ప్రాంతము నుండి ఉత్తరాన నర్మదా నది పరివా హక ప్రాంతము వరకు విస్తరించిన భూ భాగము. ఇది గోండు రాజులకు గుండెకాయ లాం టిది. క్రీ.శ.1895 కాలములోనే రాజ భీమ్‌బల్లాల్‌ సింగ్‌ గోండుల సంస్కృతి సాంప్రదాయాలు, ఆచారవ్యవహారాలకు పెద్దపీఠ వేసి వారిని సమీ కరించి ‘ సిర్‌పూర్‌’ కేంద్రముగా తన రాజ్య స్థాపన చేసాడు. ఆయన తర్వాత పరిపాలించిన గోండురాజులు హీరాసింగ్‌, కేసరిసింగ్‌, ధిన్కర్‌ షా,రామ్‌సింగ్‌,సూరజ్‌ భల్లాల్‌షా వీరిలో రాజ సూరజ్‌ భల్లాల్‌షా ‘‘ఢల్లీి’’ చక్రవర్తుల మెప్పు పొంది ‘‘శేర్‌షా’’ అనే బిరుదు పొందా డు.దక్షిణ మాండ్లాలోని గోండ్వానా ప్రాం తాన్ని కూడా బహుమతిగా పొందాడు. ఈయన కుమారుడు రాజా ఖాంద్యా భల్లాల్‌ షా సిర్‌పూర్‌ రాజధానిని ప్రస్తుత భల్లా ర్‌షాకు,ఆతర్వాత చాందాకు మార్చాడు (ప్రస్తుత చంద్రాపూర్‌).చాందా రాజధానిగా రాజా ఖాం ద్యా భల్లాల్‌షా10,000 గుఱ్ఱాలు,40,000 సైన్యం,వైరాగర్‌లో వజ్రాలగనులు కలిగి16 వ శతాబ్ద ప్రారంభము వరకు పరిపాలించాడు. కాకతీయ రాజుల పతనానంతరము గోండు రాజులు పెన్‌గంగా నది పరివాహక ప్రాంతానికి ఉత్తరాణ రాంటెక్‌,నాగపూర్‌ వరకు విస్తరిం చారు. క్రీ.శ.1412లో గోండ్వానా,బేతూల్‌ ప్రాం తంలోని ఖేరళా రాజ్యాన్ని పరిపాలించిన గోండు రాజు రాజనర్సింగు పై ఫిరోజ్‌షా బహ్మని దాడి చేసి మూడువందల (300) ఏనుగులను స్వాధీన పర్చుకొని తనకు సామంతరాజుగా చేసుకు న్నాడు.క్రీ.శ.1421లోఅహ్మద్‌షా బహ్మని గోం డ్వానాలో భాగమైన మహోర్‌ కోటపై ఐదువేల (5000) మంది సైనికులతో దాడిచేసి కలామ్‌ నగరాన్నిఅక్కడి ముత్యాలగనులను వశపర్చు కున్నాడు.బహ్మని సుల్తాన్‌ల కంటే ముందు ఉట్నూర్‌,బోథ్‌, కిన్వట్‌,ఆదిలాబాద్‌,రాజురా తాలుకాలు బీదర్‌లో భాగంగా గోండురాజులచే పరిపాలిం చబడినవి.నిర్మల్‌,లక్షెటిపేట,చెన్నూర్‌ తాలుకాలు మొదట కాకతీయరాజులు తర్వాతి బహ్మని సుల్తానులు ఆతర్వాత గోల్కొండ రాజులచే పరిపాలించబడినవి. సిర్‌పూర్‌, ఆసిఫాబాద్‌ తాలుకలు చాందా కేంద్రముగా గోండురాజుల పరిపాలనలో స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నవి. క్రీ.శ.16051627 శతాబ్దములోనే మొగల్‌ చక్రవర్తి అయిన జహంగీర్‌ గోండురాజులకు వారి సరిహద్దు ప్రాంత గ్రామాలపై వారికి గల హక్కులు అధికారాలకు సంబంధించిన రాజపత్రాలు పేర సనద్‌లు జారీచేసారు. క్రీ.శ.1750లో జనగామ (ప్రస్తుత ఆసిఫాబాద్‌) గవర్నర్‌గా కొనసాగిన గోండురాజు రాజాచంద్ర అక్బర్‌షా కాలములోనే కొన్ని మోఖాసీ మరియు రాజుల కుటుంబాలు మధ్య భారత్‌ నుండి ఆదిలాబాద్‌ ప్రాంతానికి వలస వచ్చాయి. అటువంటి వారిలో ముఖ్యులు ఉట్నూర్‌ తాలుకా లక్కారం లోని ఆత్రం రాజావారి కుటుంబము, చాందా నుండి ఆసిఫాబాద్‌ తాలుకా తిర్యాణిలోని మడావి మోఖాసి వారి కుటుంబము, దేవ్‌గడ్‌ నుండి రొంపల్లిలోని పంద్ర మోఖాసీ వారి కుటుంబం నాగ్‌పూర్‌ నుండి వలస వచ్చారు. బోథ్‌ తాలుకా ఖరాత్వాడలోని దుర్వ మోఖాసీ కుటుంబము, మోవడ్‌లోమ ప్రాంతము నుండి కిన్వట్‌ తాలుకాలోని గేడాం మోఖాసీవారి కుటుంబము,మానిక్‌గడ్‌ నుండి లక్షెటిపేట్‌ తాలుకా వెంకట్రావ్‌పేటలోని ఆత్రం రాజావారి కుటుంబము,సీతాగొంది నుండి ఇంద్రవెల్లిలోని చహ్కటి రాజావారి కుటుంబము, అంకోలి నుండి అదేవిధంగా సిర్‌పూర్‌ తాలుకా తాండూర్‌కు బ్రహ్మణదేశ్‌ముఖ్‌లు మహోర్‌ ప్రాంతము నుండి వలస వచ్చి గోండుల వతన్లను స్వాదీనము చేసుకున్నారు. కాలక్రమేన గోండ్వానా ప్రాంతము 1751 నుండి 1773 వరకు మరాఠాలు ఆ తర్వాత నిజాం రాజుల ఆదీనములోనికి వచ్చాయి. గోండు రాజుల మధ్య ఐకమత్యము లేకపోవుట వారి నాయకత్వ లోపము వలన మొగలుల,మరాఠాల సైన్యము చేతిలో ఓడిపోయినారు. తర్వాత గోండు రాజులు వారి సామాజిక మరియు సాంస్కృతిక వ్యవహారాలకు సంబంధించిన సమస్యల పరిష్కా రానికి సరిపోయె మోఖాసీ గ్రామ పటేల్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. కాని రాజకీయ వ్యవహారాలను అంతగా పట్టించు కోలేదు. దీనికితోడు 18వ శతాబ్ద చివరన మరియు 19వ శతాబ్ద ప్రారంభములో ఏర్పాటు చేసిన దేశ్‌పాండే, దేశ్‌ముఖ్‌ల వ్యవస్థ వలన గోండురాజులకు, మోఖాసీలకు తీరని అన్యా యం జరిగినది. ప్రభుత్వ వ్యవస్థలోకాని పరిపాలనలోకాని భాగం కాకుండా వారి సామాజిక మరియు మతపరమైన గ్రామ పెద్దలుగా గోండుల సమస్యలను పరిష్కరించే బాధ్యతలకు మాత్రమే పరిమితమైనారు. అందుకుగాను వ్వవసాయము చేసే ప్రతి కుటుంబము నుండి సంవత్సరానికి చిన్న మొత్తంలో ధనం, ధాన్యం రూపంలో కొంత రుసుము వసూలు చేసేవారు.మొగలుల మరాఠాల కాలములో కొన్ని గ్రామాల సమూ హాన్ని ‘పరిగణ’గా గుర్తించి రెవెన్యూ వసూలు చేసే బాధ్యతను దేశ్‌ముఖ్‌లకు మరియు రెవెన్యూ పద్దులను నిర్వహించే బాధ్యతలను దేశ్‌పాండేకు అప్పగించారు. వీరికి అదనపు పారితోషికాలుగా ఆయా గ్రామాలపై పటేల్‌, సట్వారీలుగా వతన్‌ గిరి కూడా అప్పగించారు. అదే గోండురాజు లకు, మోఖాసీలకు ఎటువంటి ప్రాధాన్యము ఇవ్వకుండా వారు చెయ్యవలసిన రెవెన్యూ వసూలును మోఖాసీల ద్వారా చేపించేవారు. ఎందుకంటే దేశ్‌ముఖ్‌, దేశ్‌పాండేలు గిరజనేతర వతన్‌దార్లు, జాగిర్‌దార్లు. తమ అధికారాన్ని అమలుపర్చుటకు మోఖాసీలను గ్రామ పట్టేళ్లను ఉపయోగించేవారు. చాందా రాజధానిగా పరిపాలించిన గోండు రాజుల కాలంలో మోఖా సీలు ప్రముఖ పాత్ర పోషించారు. వారి పరిది లోని గ్రామాలలో సామాజిక, రాజకీయ, సంస్కృతి సాంప్రదాయాలలో ఆచార వ్యవహా రాలలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యము కలుగుకుండా చూసేవారు. శాంతిభద్రతలను సామరస్యంగా నిర్వహించేవారు. ఎవరైనా మోఖాసీ తీర్పు న్యాయ సమ్మతంగా లేదనుకుంటే నేరుగా రాజదర్బారుకు వెళ్ళి న్యాయము కోరే సౌకర్యము కూడా గోండు ప్రజలకు ఉండేది. రాజు తర్వాత రాజులాగ మోఖాసీలు కూడా ప్రజల ఆదరాభిమానాన్ని, గౌరవాన్ని పొందే వారు. గ్రామ స్థాయిలోని వ్యవస్థను గ్రామ పెద్దలైన పటేల్‌, మహజన్‌, దేవారి మరియు హవల్దార్‌ నిర్వహిస్తారు. కుటుంబ సమస్యలు ముఖ్యముగా భార్యాభర్తల మధ్య వచ్చే తగా దాలు, అన్నదమ్ముల మధ్య ఏర్పడే భూమి పంపకాల సమస్యలు గ్రామ పటేల్‌ ఆధ్వర్య ములో గ్రామస్తులంతా చర్చించి పరిష్కరిస్తారు. పున్నమి, అమావాస్యలప్పుడు వచ్చే గ్రామదేవ తల పండుగలు, పెండ్లిలకు సంబంధించిన తంతు జరపడానికి గ్రామదేవరి సహకారముతో పటేల్‌ నిర్వహిస్తాడు. గ్రామపెద్ద అయిన పటేల్‌ ఆదేశాలను గ్రామస్తులందరికి తెలియపర్చే బాద్యత హవల్దార్‌ది. గ్రామాల మధ్య తగా దాలు వచ్చినప్పుడు ఏ కుటుంబమైన కుల బహిష్కరణకు గురైనప్పుడు ఆ ప్రాంత మోఖాసీ ప్రవేశించి కులపెద్దల సమ్మతితో సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తాడు.ప్రొఫెసర్‌ వాన్‌ప్యూరర్‌ హెమండార్ప్‌ ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త నిజాం ప్రభుత్వ వెనుక బడిన కులాల అభివృద్ధి సలహాదారు వ్రాసిన ‘ట్రైబల్‌ హైదరాబాద్‌’ ప్రకారము ఉట్నూర్‌ కేంద్రముగా పరిపాలించిన గోండురాజులు ఆత్రం కుటుంబానికి చెందిన రాజా ఇస్రాయి జంగుబాపు, రాజా లింగాయి హన్మంతరావు, రాజా జగపతిరావు 1862 వరకు మఖ్తా, వతన్‌, జాగీరు మరియు జమీందారు హక్కులు కూడా కల్గి ఉన్నారు. రాజు నివసించే కోటకు దగ్గరి పరిసర గ్రామాలను తానే స్వయంగా తన దర్బార్‌ సిబ్బందితో వెళ్ళి అక్కడి ప్రజల సాదక బాదకాలను పర్యవేక్షించేవారు. దూరముగా ఉన్న గ్రామాలను అక్కడి గ్రామ పెద్దలైన మోఖాసీ, గ్రామపటేల్‌ల ద్వార పర్యవేక్షించే వారు. అలాంటి గ్రామాల రాజులు, మోఖాసీలు ,పటేల్లను తాలుగాల వారిగా ఇక్కడ ఉదహ రించడమైనది. ఉట్నూరు తాలుకా : ఆత్రం కుంటుంబానికి చెందిన రాజా జగపత్‌రావు, రాజాదేవుషా లక్కారాం,రాజా భీమ్‌రావుపం గిడి సిర్‌పూర్‌,రాజాభగవంతరావు కంచ నపల్లి.కుమ్ర కుటుంబానికి చెందిన లాల్‌షా మోఖాసీ పరిదిలోని గ్రామాలుఆద్మీయాన్‌, శివనార,కొత్తపల్లి, కొలామా,అర్జుని, గాదిగూడ, పిప్రీ,చిత్తగూడ,కుమ్ర జంగు మోఖాసీ పరిది లోని గ్రామాలుమాన్కపూర్‌,నాగల్‌కుండ, యేంపల్లి,బాబెజరి,గణేశ్‌పూర్‌,సాంగ్వి, ఖైర్‌ దాట్వా,లోకారీ,నర్సాపూర్‌,గుంజాల,నార్నూర్‌, గుండాల. బోథ్‌ తాలుకా : దుపార్‌పేటలోని శిడాం కుటుంబానికి చెందిన మోఖాసీ పరిది, ఇచ్చోడ నుండి కడం నది పరివాహక ప్రాంత గ్రామాలు, ఖరత్వాడలోని దుర్వ యెశ్వంత రావు మోఖాసీ అక్కడి 20 గ్రామాలకు దేశ్‌ముఖ్‌ కూడ ఈయన పూర్వీకులు ఆసిఫాబాద్‌ తాలుకాలోని మోవడ్‌ లోమ ప్రాంతానికి చెందినవారు. ఆదిలాబాద్‌ తాలుకా : మర్సుకోల కుటుంబానికి చెందిన పీప్రి లచ్చు మోఖాసీ పరిది ఆదిలాబాద్‌ పట్టణంతోపాటు పెన్‌గంగా నది పరివాహక ప్రాంత గ్రామాలు.చహ్కటి కుటుంబానికి చెందిన రాజా హన్మంతరావు పరిదిలో అంకోలి,మావాల,యాపలగూడతో పాటు ఉట్నూరు తాలుకాలోని ఇంద్రవెళ్లి, తోషం,పీప్రి,దేవాపూర్‌,ముత్నూర్‌ మరియు గిన్నెర గ్రామాలు. కొరెంగ కుటుంబానికి చెందిన యెశ్వంతరావు మోఖాసీ పరిదిలో చాంద్‌పల్లి,సర్ధాపూర్‌,ఖడ్కి,చాప్రి,సోనార్‌, రుంకుమ్‌,పాఠన్‌,సోన్‌కసా,పత్తెగామ్‌, జనోలి, కరోని మరియు వడూర్‌. భాదిలోని జుంగనక కుటుంబానికి చెందిన మోఖాసీ పరిదిలో సైద్‌ పూర్‌,బోరెగామ్‌,పాటగూడ,సాంగ్వి,గార్క గూడ మరియు జామ్ని. జైనథ్‌లోని కోవ కుటుంబానికి చెందిన పోయ్‌పటేల్‌ మోఖాసీ వీరి పూర్వికులు మానిక్‌గాడ్‌ నుండి ఆదిలా బాద్‌కు వచ్చారు. కారకాన్పలోని పెందూర్‌ కుటుంబానికి చెందిన రాజా హన్మంతరావు పరిదిలో రాజురాతాలు కాలోని యేషాపూర్‌ భరిషావతన్‌, కిన్వట్‌ తాలుకాలోని పిప్పల్‌గావ్‌కోట మరియు బోథ్‌ తాలుకాలోని రaరి ప్రాంత గ్రామాలు. లక్షెటిపేట తాలుకా : వెంకట్రావుపేటలోని ఆత్రం కుటుంబానికి చెందిన సీతాగొంది ఆత్రం రాజుగారి పరిదిలో లక్షెటిపేట నుండి రాలి గడ పూర్‌ బ్లాక్‌ వరకు గల గ్రామాలు. తాళ్లపేట లోని కోవ కుటుంబానికి చెందిన మోఖాసీ పరిదిలో గోదావరినది సరిహద్దు నుండి ఉట్నూర్‌ వెళ్ళెదారిలోని ఉడుంపూర్‌ వరకు గల గ్రామాలు. ముర్రిమడ్గులోని కుమ్ర కుటుంబానికి చెందిన రాజుకు కవ్వాల్‌ పట్టీ మరియు జన్నారం ప్రాంత గ్రామాలు. యాపల్‌గూడలోని చక్రం కుటుంబానికి చెందిన మోఖాసీ పరిదిలోని గ్రామాలు కూడా లక్షెటిపేటలోనివే.
చెన్నూర్‌ తాలుగా : మర్సుకోల కుటుంబానికి చెందిన పటేల్‌కు యేంపల్లి పరిదిలోని గ్రామాలు ఉన్నాయి. ఆసిఫాబాద్‌ తాలుగా : కొరెంగ కుటుంబానికి చెందిన మోఖాసీకి మోవడ్‌, కోట్నాక కుటుంబానికి చెందిన మోఖాసీకి సాంగ్వి మరియు ఇందాని. మడావి కుటుంబానికి చెందిన మోఖాసీకి తిర్యాణి, పంద్ర కుటుంబానికి చెందిన మోఖాసీకి రొంపల్లి మరియు రాయిశిడాం కుటుంబానికి చెందిన పోయ్‌ పటేల్‌కు మంగి ప్రాంత గ్రామాలు ఉండేవి.
కిన్వట్‌ తాలుకా : గేడాం కుటుంబానికి చెందిన దేశ్‌ముఖ్‌కి కిన్వట్‌, పెందూర్‌ కుటుంబానికి చెందిన మోఖాసీకి రaరి,భిల్‌గామ్‌, కనక మోఖాసీకి పల్సి, వెడ్మ మోఖాసీకి మిన్కి ప్రాంతాలు వీరి ఏలుబడిలో ఉండేవి. రాజురా తాలుకా : సలాం,కుమ్ర,కుర్సెంగ,కనక కుటుంబాలకు చెందిన మోఖాసీలక పరిదిలో ఇంజాపూర్‌,చినై,టెంబర్‌వాయి,శేవ్‌గామ్‌ గ్రామాలు వీరి పరిదిలో ఉండెను. సుర్పమ్‌, కోట్నాక మరియు పెందూర్‌ కుటుంబాలకు చెందిన మోఖాసీల పరిదిలో మాల్ని, బంబార, మర్కల్‌ మెట్ట గ్రామాలు వీరి ఆదీనములో ఉండెను. నిర్మల్‌ మరియు సిర్‌పూర్‌ తాలుకాల పరిదిలో మోఖాసీలు లేరు. మోఖాసీల, గ్రామపటేల్‌ల బాధ్యతలలో ప్రధానముగా వారి గ్రామాల పరిదిలోని ప్రజలకు శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూడటము, కొత్తవారెవరైన ఆ ప్రాంతానికి వస్తే వారి ఆస్తిపాస్తులను కాపాడటం, వీరు ముఖ్య మైన గ్రామపెద్దలుగా నాయకత్వము వహించి సామాజిక సాంస్కృతిక వ్యవహారాలను చక్క దిద్దటం. దసరా, దీపావళి`దండారీ లాంటి పండుగలను గొప్పగా నిర్వహిస్తూ ప్రజల గౌరవమర్యాదలు పొందటం. తమ పరిదిలో పరిష్కరించలేని క్లిష్టమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని మోఖాసీ ద్వారా తమ పరిది లోని రాజా కుటుంబము వారి ద్వారా పరిష్క రించటం. ఈ విధముగా గోండురాజుల పరి పాలన అనేక ప్రాంతాలకు విస్తరించింది. పటిష్ట మైన పరిపాలన జరిగింది. -డాక్టర్‌. తొడసం చందూ విశ్రాంత జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సెల్‌ : 9440902142,