కొలువు దీరిన కొత్త ప్రభుత్వాలు

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన కొత్తప్రభుత్వాలు కొలువు దీరాయి.ఇటు ఆంధ్రప్రదేశ్‌,అటు కేంద్రంలోను బలమైన జట్టుతో కూటమి ప్రభుత్వాలు కొలువు దీరాయి.బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 72 మందితో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది.వీరిలో 30మంది క్యాబినెట్‌,ఐదుగురు స్వతంత్ర, 36సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.పదేళ్ల అనుభవాలు 140కోట్లమంది ప్రజల ఆకాంక్షల మధ్య కొలువుదీరింది మోదీ సర్కారు 3.0. మూడవసారి దేశ నాయకత్వ బాధ్యతలను స్వీకరించారు. ఆఅరుదైన ఘనత ఒకవైపు,పదేళ్ల తర్వాత సంకీర్ణ బలంపై ఆధారపడిన సమీకరణాలు మరోవైపు నేపథ్యంలో ఈ దఫా ఎన్డీయే పాలన ఎలా సాగనుంది?రాజకీయంగా,ప్రభుత్వ పరం గా వారి ముందున్న ప్రాధాన్యాలు,సవాళ్లు ఏంటి?ఎన్డీయే తొలి వంద రోజుల ప్రణాళిక లో ఏ ఏ అంశాలున్నాయి? ఉమ్మడి పౌరస్మృతి, ఒకటేదేశం-ఒకటే ఎన్నికలతో పాటు దేశాన్ని పట్టిపీడిస్తోన్న సవాళ్లకు ఇకనైనా పరిష్కారం చూపగలరా ?ఇవే అంశాలపై సర్వత్ర చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం లో కొలువు దీరిన ఎన్డీఏ3.0సర్కార్‌ కేబినెట్‌ లో బీజేపీకి 61,ఎన్‌డీఏ మిత్రపక్షాలకు11 బెర్తు లు లభించాయి. మొత్తం 72మందితో మోదీ కేంద్ర కేబినెట్‌ కొలువుదీరింది. ఎన్‌డీఏ ప్రధాన మిత్రపక్షాలైన తెలుగుదేశం,జేడీయూకి చెరో రెండు కేబినెట్‌ బెర్తులు దక్కాయి.ఎల్‌జేపీ(ఆర్‌ వీ),జేడీఎస్‌,శివసేన,రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండి యా,రాష్ట్రీయలోక్‌దళ,అప్నాదళ్‌,హిందూ అవా మీ మోర్చాచెరో ఒక్కకేబినెట్‌ స్థానాన్ని దక్కించు కున్నాయి.
ఏనీలో కూటమి కొత్త కొలువు
ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజల ఆనందోత్సాహాలు, అభివాదాల మధ్య నారా చంద్రబాబునాయుడు అనే నేను అంటూ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేశారు.ప్రధాని మోదీ సమక్షంలో రాష్ట్ర గవ ర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ చంద్రబాబుతో ప్రమాణం చేయిం చారు.ప్రమాణస్వీకారం అనంతరం పవన్‌ కల్యాణ్‌ తన సోదరుడు చిరంజీవికి పాదాభి వందనం చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాటు మరో 24మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో రెండుసార్లు,విభజన తర్వాత నవ్యాంధ్రó ప్రదేశ్‌కు రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌,కూటమి నేతలు, టీడీపీ శ్రేణులు తమ స్థానాల్లోనే నిలుచుని చప్పట్లతో అభినందనలు పలికారు. అనంతరం వేదిక వద్ద ఉన్న ప్రముఖులంతా చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలియ జేశారు.ఆ తర్వాత వరు సగా 24మంది కొత్త మంత్రులచే గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయిం చారు. జనసేన అధినేత కొణిదెల పవన్‌ కల్యాణ్‌,టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌,టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నా యుడు, కొల్లు రవీంద్ర,నాదెండ్ల మనోహర్‌ (జనసేన), పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకు మార్‌యాదవ్‌(బీజేపీ),నిమ్మల రామా నాయుడు, మహ్మద్‌ ఫరూఖ్‌,ఆనం రాంనారా యణరెడ్డి, పయ్యావుల కేశవ్‌,అనగాని సత్య ప్రసాద్‌, కొలుసు పార్థసారథి,బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌,కందుల దుర్గేష్‌ (జన సేన),గుమ్మడి సంధ్యారాణి,బీసీ జనార్ధన్‌ రెడ్డి, టీజీభరత్‌, ఎస్‌ సవిత,వాసంశెట్టి సుభాష్‌, కొండపల్లి శ్రీనివాస్‌,మండిపల్లి రాం ప్రసాద్‌రెడ్డి ఒకరి తర్వాత ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రు లందరూ ప్రమా ణంచేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ,రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌లతో చంద్ర బాబు కొత్త కేబినెట్‌ గ్రూప్‌ ఫొటోదిగారు. ప్రమాణ స్వీకార కార్యక్ర మానికి కేంద్ర మంత్రులు అమిత్‌షా,నితిన్‌ గడ్కరీ,జేపీనడ్డా,చిరాగ్‌పాశ్వాన్‌,అనుప్రియా పాటిల్‌,కింజారపురామ్మోహన్‌నాయుడు, శ్రీనివాస వర్మ,పెమ్మ సాని చంద్రశేఖర్‌, మహా రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే,మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,(గవర్నర్‌,ఈస్ట్రన్‌ ప్రావిన్స్‌, శ్రీలంక) తదితరులున్నారు.
-గునపర్తి సైమన్‌