కొత్త బిల్లుతో అడవులకు ముప్పు
అటవీ సంరక్షణపై ప్రస్తుతం ఉన్న నిబంధన లను మార్చే లక్ష్యంతో తీసుకొచ్చిన ‘అటవీ (సంరక్షణ) సవరణ బిల్లు’ను లోక్‌సభలో ఇటీవల ప్రవేశపెట్టినప్పుడు విపక్షాలు నిరసన తెలిపాయి. జాతీయ స్థాయి ప్రాధాన్యం ఉన్న వ్యూహాత్మక ప్రాజెక్టులకు అనుమతులను ఫాస్ట్‌ట్రాక్ లో అందించే పేరుతో నిబంధనలను మార్చనున్న ఈ బిల్లు వల్ల దేశానికి తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనలో ఉంది. ఈ వివాదాస్పద బిల్లుకు సంబం ధించి ప్రజలు తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి.
పర్యావరణ,అటవీమంత్రిత్వశాఖ నుం చి ముందస్తు అనుమతులు లేకుండా అటవీ ప్రాం తంలో అటవీయేతర కార్యకలాపాలు జరుపకుండా అటవీ సంరక్షణ చట్టం-1980 నిషేధిస్తుంది. ఈచట్టంలో మార్పులను తాజా బిల్లు ప్రతిపాది స్తున్నది. అటవీ ప్రాంతానికి చట్టం ఇస్తున్న నిర్వచ నంలో మార్పు తేవటం ద్వారా, కొన్ని ప్రాజెక్టులకు చట్టం నుంచి మినహాయింపును ఇవ్వటం ద్వారా ఈ మార్పులను బిల్లు ప్రతిపాదిస్తున్నది. దీనిపై 19 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్న జేపీసీ అధ్యయనం చేయనుంది. అయితే,ఈబిల్లువల్ల అటవీసంరక్షణచట్టం బలహీన పడుతుందని నిపుణులు ఇప్పటికే ఆందోళన వెలి బుచ్చుతున్నారు. మొత్తమ్మీద అటవీ సంరక్షణ చట్టంలో మార్పులు తీసుకొచ్చే కేంద్రం ప్రతిపాదన వివాదాస్పదమవుతున్నది.
చట్టం సుస్పష్టం
అటవీ ప్రాంతాన్ని అటవీయేతర పను ల కోసం వాడుకోవటంపై ‘అటవీ సంరక్షణ చ ట్టం-1980’ ఆంక్షలను విధించింది. 1927 నాటి భారత అటవీచట్టం ప్రకారం నోటిఫై చేసిన అడవు లకు 1996 వరకూ ఈచట్టం వర్తించింది. కానీ, ఆ ఏడాది డిసెంబరులో సుప్రీంకోర్టు టీఎన్ గోద వర్మన్ కేసులో తీర్పునిస్తూ.. నిఘంటు అర్థం ప్రకారం అడవులను పోలిఉండే అన్ని రకాల భూములకు ఈ చట్టం వర్తిస్తుందని పేర్కొంది. యాజమాన్యంతో సంబంధం లేకుండా,ఏప్రభుత్వ రికార్డుల్లో ఉన్న వాటికైనా ఇది వర్తిస్తుందని తెలిపింది.
అటవీ సంరక్షణ చట్టం ప్రకారం..
అటవీ ప్రాంతాలను ఉపయోగించుకునే ఏ ప్రాజెక్టుకైనా అటవీశాఖ అనుమతులు తప్పనిసరి. అయితే, తాజాగా తీసుకొచ్చిన బిల్లు అటవీ చట్టం వర్తింపుపై ఉన్న ‘అస్పష్టతలను’ తొలగించి, 1996 కు ముందున్న స్థితిని తీసుకొస్తుందని చెబుతున్నారు. 25అక్టోబర్ 1980 తర్వాత రికార్డయిన డీమ్డ్ అడవులకు కూడా ఈ బిల్లు రక్షణ కల్పిస్తుందని అంటున్నారు.డీమ్డ్ అటవీ ప్రాంతాల్లో భూ విని యోగం, అభివృద్ధి పనులు చేపట్టకుండా అధికారు లను సుప్రీంకోర్టుతీర్పు నియంత్రిస్తున్నందున చట్టం లో మార్పులు అవసరం అవుతున్నాయని కేంద్ర అటవీ,పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. అందుకే ఈ బిల్లును తీసుకొచ్చామన్నా రు.కానీ,పర్యావరణ నిపుణుల అభిప్రాయం వేరుగా ఉంది.
దేశంలోని అటవీ ప్రాంతాలకు
ఈ బిల్లు తీసుకొచ్చే మార్పులు విఘాతంగా మారుతాయని, ముఖ్యంగా 1850ల నుంచి 1970ల వరకు ప్రభుత్వ రికార్డుల్లో నమో దైన అడవుల విషయంలో ఈ ప్రమాదం ఉందని ‘విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ’ అనే మేధోసంస్థకు చెందిన దేబదిత్యో సిన్హా తెలిపారు. సరైన విధంగా సరిహద్దులను నిర్ణయించకపోవటం వల్ల, అవినీతి కారణంగా భారీ ఎత్తున అటవీ ప్రాంతాలు అటవీ చట్టం కింద నమోదు కాలేదని,ఈ నష్టాన్ని అక్కడి తో నిలిపివేయటానికి, మరింత నష్టం జరుగకుండా చూడటానికి సుప్రీంకోర్టు తీర్పు ఉపయోగపడిరదని పేర్కొన్నారు.
‘వ్యూహాత్మక ప్రాజెక్టులకు’ మినహాయింపులు
తాజా బిల్లు ప్రకారం..రైల్వే లైన్లు, రోడ్ల వెంబడి ఉండే అటవీ భూముల్లో 0.1హెక్టార్ల వరకు అటవీ అనుమతుల నుంచి మినహాయింపు లభిస్తుంది.నియంత్రణ రేఖకు,వాస్తవాధీన రేఖకు 100 కిలోమీటర్ల లోపు చేపట్టే ప్రాజెక్టులకు (ఉదాహరణకు రోడ్ల నిర్మాణం వంటి వాటికి) కూడా జాతీయ భద్రత కోణంలో మినహాయింపు ఉం టుంది. రక్షణశాఖకు సంబంధించిన ప్రాజెక్టులు, క్యాంపులకు 10 హెక్టార్ల వరకు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 5హెక్టార్ల వరకు మినహా యింపు ఉంటుంది. అటవీయేతర భూముల్లో ఉన్న వృక్షాల తొలగింపునకు కూడా బిల్లు మార్గం సుగమం చేస్తుంది.
విపక్షాల స్పందన
బిల్లును ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన తర్వాత రాజ్యసభ ఎంపీ, ‘సైన్స్ అండ్ టెక్నాలజీ,పర్యావరణం,అడవులపై ఏర్పాటైన స్థాయీసంఘం’ చైర్మన్ జైరాం రమేశ్ రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్‌కు ఒక లేఖ రాశారు. ‘ఈ బిల్లు పూర్తిగా మాస్థాయీ సంఘం పరిధిలోకి వచ్చే అంశం. ఈ బిల్లును సంబంధిత భాగస్వామ్య పక్షాలన్నింటితో కలిసి సమగ్రంగా, అన్ని కోణాల్లో పరిశీలించే వాళ్లం.కానీ, కావాలనే మాకు ఆ అవకాశం ఇవ్వకుండా కేంద్రప్రభుత్వం బిల్లును జేపీసీకి సిఫార్సు చేసింది. ప్రతిపక్ష సభ్యులే లేని జేపీసీ పూర్తిగా ఏకపక్షంగా ఉంటుందనటంలో సందేహం లేదు’ అంటూ ఆ లేఖలో నిరసన వ్యక్తం చేశారు. ఈ విధంగా అటవీ సంరక్షణ చట్టంలో మార్పులు తేనున్న బిల్లుతో అటవీ ప్రాంతాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. తదుపరి పార్లమెంటు సమావేశాల తొలివారంలోపు జేపీసీ తన నివేదికను సమర్పిం చాలని గడువు విధించారు. అప్పటికి ఈ అంశంపై మరింత రగడ నెలకొనే అవకాశమే కనిపిస్తున్నది. రిజర్వ్ ఫారెస్ట్‌లలోని వన్యప్రాణుల ఆవాసాలు మరియు జీవవైవిధ్యం రక్షిత ప్రాంతాలకే పరిమితం కావు. స్థానిక సమాజాలకు పర్యావరణ మరియు జీవనోపాధి సేవలను కూడా అందజే స్తాయని గమనించడం ముఖ్యం.
విమర్శ
వర్గీకరణ అస్పష్టంగా ఉంది మరియు పర్యావరణవేత్తల ప్రకారం అడవులు మరియు వన్యప్రాణులను దెబ్బతీసే కార్యకలాపాలకు మినహాయింపు ఇవ్వవచ్చు. ప్రతిపాదిత మినహా యింపులు 2006అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘి స్తున్నాయని పేర్కొంటూ అటవీ హక్కుల సంఘాలు కూడా బిల్లును వ్యతిరేకించాయి.ఈ మినహాయిం పులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఏజెన్సీల కోసం అటవీ మళ్లింపులను సులభతరం చేస్తాయని మరియు అటవీ సంరక్షణ చట్టం మరియు అటవీ హక్కుల చట్టం రెండిరటినీ ఉల్లంఘిస్తున్నాయని వారు పేర్కొన్నారు.
కొత్త బిల్లు అడవికి, ప్రజలకు ముప్పు
అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు (ఖీజAదీ)లోక్‌సభలో ప్రవేశపెట్టబడిరది. ఇది 1980 అటవీ సంరక్షణ చట్టాన్ని సవరించాలని లక్ష్యంగా పెట్టు కుంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం కఠినమైన మార్గదర్శకాలను అందిస్తుంది..ఏర్పాటు చేసిన విధానాల ప్రకారం, బిల్లులు స్టాండిరగ్ కమి టీకి పంపబడ తాయి. ప్రస్తుత సందర్భంలో,దీనిని సైన్స్,టెక్నాలజీ, పర్యావ రణం మరియు అడవు లపై పార్లమెంటరీ స్టాం డిరగ్ కమిటీకి పంపాలి.బదులుగా,ఇది సూచించ బడిరది.
నష్టాల పాలవుతున్న పేదలు
ప్రభుత్వాలు ప్రజలకు చట్టబద్ధ పాల న అందించడమంటే ఏంటి?రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు, పరిపాలనకు మార్గదర్శకంగా రూపొందించిన ఆదేశిక సూత్రాలు సంక్షేమ రాజ్యభావనకు ప్రాతిపదికలు. వీటి ఆధా రంగా చట్ట సభల్లో ఆమోదించే చట్టాలు, ప్రభుత్వా లు ఎప్పటికప్పుడు విడుదల చేసే జీవోలు, వాటి అమలుకు అవసరమైన మార్గదర్శకాల రూపకల్పన, ప్రభుత్వాలు అందుకు అవసరమైన నిధులను బడ్జెట్ లో కేటాయించడం, ఆయా శాఖల మెరుగైన పని తీరుకు మానవ వనరులను, మౌలిక సదుపా యాలను సమకూర్చడంఇవన్నీ సుపరిపాలన కిందకు వస్తాయి. పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా, సమాజంలో ప్రజలందరినీ సమా నంగా చూసే వైఖరిని పాలకులు కలిగి ఉండటం అత్యంత ముఖ్యం. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ కార్యనిర్వాహక సిబ్బంది పథకాల అమలులో అవినీతికి, లంచగొండితనానికి పాల్పడ కుండా పారదర్శకత కలిగి ఉండటం వల్ల ప్రజల కు ఎక్కువ మేలు జరుగుతుంది. ఈ సాధారణ సూత్రాలను ఇప్పుడు తెలంగాణాలో ఆశించడం ఎంతో కష్టమైపోయింది.
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పాలన..
పరిపాలనా వికేంద్రీకరణ గురించి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, ఆచరణలో పరిపాలన అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల్లో కేంద్రీకృతమై పోయింది. రాష్ట్ర సచివాలయం, వివిధ స్థాయిల్లో వందలాది ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రమై పోయి కేవలం ‘ప్రగతి భవన్’ మాత్రమే పరిపా లనా కేంద్రంగా మిగిలింది. ఈ లక్షణం మెజారిటీ రాష్ట్రాల్లోనూ, కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో కూడా కనిపిస్తున్నది. నిజానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈ పరిపాలనా ధోరణి ప్రజాస్వామ్యానికి వ్యతి రేకం.రాజ్యాంగం 7వ షెడ్యూల్ లో నిర్దేశిం చిన కేంద్ర,రాష్ట్రాల మధ్య బాధ్యతల,హక్కుల విభజ నకు కూడా వ్యతిరేకం. స్థానిక సంస్థలకు విస్తృత అధికారాలను కట్టబెట్టిన 73,74రాజ్యాంగ సవర ణలకు వ్యతిరేకం. షెడ్యూల్ ప్రాంతాలకు ప్రత్యేక అధికారాలను ఇచ్చిన షెడ్యూల్ 5కు వ్యతిరేకం. ఆదివాసీల గ్రామ సభలకు అత్యున్నత అధికా రాలను ఇచ్చిన పీసా, అటవీ హక్కుల చట్టాలకు వ్యతిరేకం.
అడవుల నరికివేతతో భవితకు ప్రమాదం!
అడవుల పరిరక్షణ విషయంలో ప్రపం చ దేశాల వేదికలపై భారతదేశ ప్రతినిధులు ఇచ్చే హామీలు ఆశాజనకంగా కనిపిస్తున్నా.. దశాబ్దా లుగా క్షేత్రస్థాయిలో విధానాలు, చట్టాల అమలు తీరు అందుకు విరుద్ధంగా ఉంటోంది. పాలనా వ్యవస్థలు అడవిని ఒక ఆర్థిక వనరుగా పరిగణించి పరిరక్షణ, వాణిజ్య లాభాలపై గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్నాయి. ఫలితంగా దశాబ్దాలుగా వనాల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం నామమాత్రం అవుతోంది.అదే రకంగా కొన్ని దశాబ్దాలుగా వేగంగా క్షీనిస్తున్న అడువులతో మానవాళి భవిత ప్రమాదంలో పడిరది. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వనాలు వినాశానానికి గురవుతున్నాయని అంచనా. అడవులు క్షీణించడం మూలంగా జీవనోపాధులు,జలవనరులుతోపాటు వాతావరణంపై తీవ్ర ప్రభావం పడుతోంది. తుపాన్లుఉ,భారీ వర్షాలు,వరదలు వంటి విఫత్తులు ముప్పేట దాడి చేస్తున్నాయి. అడవుల పరిరక్షణకు నడుం కడుతున్నామంటూ ప్రపంచ దేశాలు పదేపదే చెబుతున్నా,విధానాల అమలు మాత్రం లోపభూయిష్టంగా ఉంటోంది.
వ్యాసకర్త : సామాజిక కార్యకర్త,అటవీపరిరక్షణ నిపుణులు`న్యూఢల్లీి- (సిమ్రిన్ సిరుర్)