కొత్త కొత్తగా ఎన్నికల్లో సరికొత్త అంశాలు
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఉండే బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల పేర్లు, ఇంటిపేర్లు, గుర్తులు మాత్రమే ఉండేవి. అవిఒకే విధంగా ఉండటంతో క్రాస్‌ఓటింగ్ పెరిగి విజయావకాశాలు తారుమారవుతాయని పలుపార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈనేపథ్యంలో ఎన్నికలసంఘం ఈసారి బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల పేర్లు, గుర్తుల పక్కనే అభ్యర్థుల ఫొటోలను కొత్తగా ముద్రించింది.
ఓటరు చీటీల్లో పూర్తి సమాచారం
అధికారులు గతంలో పంపిణీ చేసే పోలింగ్ చీటీల్లో కేవలం ఓటర్ల పేర్లు, తండ్రి/భర్త పేరు,ఇంటిసంఖ్య, గ్రామం తదితర వివరాలు మాత్రమే ఉండేవి. ఈసారి ఓటరు చీటీలు కొత్త రూపు సంతరించుకున్నాయి. వాటిలో గూగుల్ ఎర్త్ సహకారంతో పోలింగ్ కేంద్రాల చిరునామాను రూట్ మ్యాప్‌తో సహా ముద్రించారు. ఓటర్ల అనుమానాల నివ ృత్తికి బూత్‌స్థాయి అధికారుల సెల్ నంబర్లను, జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్, టోల్‌ఫ్రీ నంబర్లనూ ముద్రించారు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌నూ పేర్కొన్నారు.
మహిళలకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
మహిళల పోలింగ్ శాతం తగ్గుతుందని గుర్తించిన ఎన్నికల సంఘం ఈసారి కొత్తగా పింక్ పోలింగ్ కేంద్రాల పేరిట ప్రత్యేకంగా మహిళా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒకమహిళా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వీటిలో మహిళా ఉద్యోగులే విధులు నిర్వర్తిస్తారు.
దివ్యాంగులకు సదుపాయాలు
వరుసలో ఎక్కువ సమయం నిలబడలేక దివ్యాంగులు ఓటు హక్కుకు దూరమవుతున్నారు. దీంతో వారు ఓటు హక్కును వినియోగించడానికి వీలుగా ఎన్నికల సంఘం ప్రత్యేక సదుపాయాలను కల్పించింది. గ్రామంలో 70 మంది దివ్యాంగులు ఉంటే వారికి ప్రత్యేక వాహనాన్ని కేటాయించింది. దివ్యాంగులను ఈవాహనాల్లో పోలింగ్ కేంద్రం ఆవరణ వరకు తీసుకెళతారు. ఆవరణ నుంచి పోలింగ్ గదిలోకి వెళ్లడానికిగాను చక్రాల కుర్చీలు, ట్రైసైకిళ్లను ఏర్పాటు చేశారు. 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకూ ఈ సదుపాయాలు వర్తిస్తాయి.
ఓటు నమోదుపై అవగాహన
అర్హులైన యువకులను ఓటర్లుగా నమోదు చేయడానికి ఎన్నికల సంఘం ఈసారి పలు వినూత్న విధానాలను అనుసరించింది. ప్రధానంగా యువకులు సెల్ఫీలు దిగడానికి ప్రాధాన్యమిస్తారు. యువకులను ఆకర్షించడానికి పట్టణ ప్రాంతాల్లో ‘ఐ ఓట్ బికాజ్..’ పేరిట పట్టణాల్లో సెల్ఫీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఓటర్లకు చైతన్యం పెంపొందించేలా హోర్డింగులను ఏర్పాటు చేసి గాలి బెలూన్లను ఏర్పాటు చేసింది. వీటితోపాటు ఓటు హక్కును వినియోగించాలంటూ ఈసారి కళాబృందాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేపట్టింది.
అంధుల కోసం బ్రెయిలీ లిపి
ప్రతి ఎన్నికల్లో అంధులు ఓటు హక్కును వినియోగించు కోవడం ఇబ్బందికరంగా మారింది. చాలామంది అంధులు ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం అంధుల కోసం ఈవీఎంలలో బ్రెయిలీ లిపీని అందుబాటులోకి తీసుకొచ్చింది. వీరికి బెయిలీ లిపితో కూడిన ఓటరు చీటీలను పంపిణీ చేశారు.
రెండు ఓట్లను గుర్తించొచ్చు
రెండు చోట్ల ఉన్న ఓట్లను తొలగించి ఏదైనా ఒకే ప్రాంతం లో ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఎన్నికల సంఘం ‘ఈఆర్వోనెట్.వీ2.0 వర్షన్’ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది. ఎన్నికల సంఘం అధికారులు ఈ సాఫ్ట్వేర్ ఆధారంగా ఓటర్ల రెండో ఓటును తొలగించారు.
ఫిర్యాదులకు సి-విజిల్
అభ్యర్థులు పంపిణీ చేస్తున్న డబ్బు, మద్యం గురించి గతంలో సంబంధిత కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సి ఉండేది. వీటిపై ఓటర్లు ఫిర్యాదు చేస్తూ మద్యం, డబ్బు పంపిణీని అరికట్టడానికి ప్రస్తుతం ఎన్నికల సంఘం సీ-విజిల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్న వ్యక్తుల చిత్రాలు తీసి ఈయాప్‌లో నమోదు చేయగానే.. సంబంధిత అధికారులకు సమాచారం అందుతుంది. ఈఎన్నికల్లో కొత్తగా ప్రవేశపెట్టిన యాప్‌కు ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చింది.
సందేహాల నివ ృత్తికి ‘సమాధాన్’..
ఎన్నికల సమయంలో ఓటర్లు తమ సందేహాలను నివ ృత్తి చేసుకోవడానికి గతంలో అధికారులు, ఆర్డీవో, జిల్లా పాలనాధికారి కార్యాలయాల వద్దకు వెళ్లాల్సి వచ్చేంది. ఈసారి ఓటర్లు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వీలుగా ‘సమాధాన్’ యాప్‌ను ప్రవేశపెట్టింది. స్మార్ట్ చరవాణిలో సి`విజిల్ యాప్‌ను దిగుమతి చేసుకొని ఆయాప్ ద్వారా సందేహాల్ని నివ ృత్తి చేసుకోవచ్చు.
నూతన రాష్ట్రంలో తొలి ఎన్నికలు
ప్రత్యేక హోదా సాధన కోసం ఏర్పాటు చేసిన జనసేనాపార్టీ నేతృత్వంలో బీఎస్పీ, వామపక్షాలు కలసి కూటమిగా ఈఎన్నికల బరిలో ప్రధానపార్టీనేతల్లో దఢ పుట్టిస్తోంది.
నిన్నటి శత్రువులు..నేటి మిత్రులు
రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం ఉండవన్న అంశాన్ని నిజంచేస్తూ ఈసారి ప్రజాకూటమి పేరిట కాంగ్రెస్, తెదేపాలు ఒకే గొడుగు కిందకు చేరాయి. తెలుగుదేశం పార్టీ గతంలో వివిధ సందర్భాల్లో తెరాస, భాజపాలతో జట్టు కట్టిన ప్పటికీ కాంగ్రెస్‌కు స్నేహ ‘హస్తం’ చాచడం ఆసక్తి కరంగా మారింది.
ఈవీఎంలు ఎలా పనిచేస్తాయి?
80 కోట్ల మంది ఓటర్లు, 2000కు పైగా రాజకీయ పార్టీలు పాల్గొనే సాధారణ ఎన్నికలను నిర్వహించడం భారత్ వంటి దేశంలో ఓ పెద్దసవాలే. ఇంత సంక్లిష్ట ప్రక్రియలోని విశ్వసనీయత అంతా దాని పారదర్శకతపైనే ఆధారపడి ఉంటుంది. రాజకీయ పార్టీలకు చెందిన అల్లరి మూకలు పోలింగ్ కేంద్రాలను లూటీ చేయడం, బ్యాలట్ బాక్సులను ఎత్తుకెళ్లిపోవడం వంటి చర్యల కారణంగా దశాబ్దాలపాటు ఎన్నికల నిర్వహణ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) ప్రవేశంతో ఈపరిస్థితికి అడ్డుకట్ట పడిరది. కానీ వీటిపై ఎన్నో అనుమానాలు,విమర్శలు. ఈయంత్రాలను హ్యాకింగ్ చేయవచ్చని, రిగ్గింగ్‌కు పాల్పడవచ్చంటూ ఎన్నికల్లో పరాజ యం పాలైన పార్టీలు ఆరోపించడం సాధారణమైపోయింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ అనుమానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. 2014 ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్ చేశారని, అందువల్లే నరేంద్ర మోదీ నేత ృత్వంలోని బీజేపీ భారీ ఆధిక్యంతో అధికారాన్ని కైవసం చేసుకుందని అమెరికాలో నివసిస్తున్న భారత సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా చేసిన ఆరోపణలను భారత ఎన్నికల సంఘం ఖండిరచింది. కానీ, ఈవీఎంల్లో వాడే సాంకేతికతపై అనుమా నాలు మాత్రం ఇంకా తొలగిపోలేదు. కోర్టుల్లో ఈవీఎంల కచ్చిత త్వంపై కనీసం 7కేసులు నడుస్తున్నాయి. అయితే భారత్‌లో వినియో గిస్తున్న ఈవీఎంలను హ్యాకింగ్ చేయలేరని ఎన్నికల సంఘం వర్గాలు చెబుతూనే వస్తున్నాయి.
ఈవీఎంల భద్రత
భారత్‌లో వినియోగిస్తున్న 1.6 కోట్ల ఓటింగ్ యంత్రాల్లో ఒక్కోదానిలో 2000 ఓట్లు నమోదు చేయవచ్చు (ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1500 మందికి మించి ఓటర్లు ఉండరాదు). 64 మంది అభ్యర్థుల పేర్లను చూపించవచ్చు. భారత్‌లోనే తయారయ్యే ఈ మెషీన్లను బ్యాటరీ పవర్‌తో కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల కరెంటు సౌకర్యం సరిగా లేని మారుమూల గ్రామాల్లో సైతం వీటితో ఎన్నికలు నిర్వహించవచ్చు. దీనిలో ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను ఈసీఐఎల్ ఇంజనీర్ల బృందం అభివృద్ధి చేసింది. ఈ బృందానికి తప్ప వేరెవరికీ ఈ సాఫ్ట్వేర్ గురించి గానీ, ఈవీఎంలకు సంబంధిం చిన ఇతర వివరాల గురించి గానీ తెలిసే అవకాశం లేదని ఈసీఐఎల్ వర్గాలు స్పష్టం చేశాయి. ఎవరైనా బలవంతంగా, నిబంధనలకు విరుద్ధంగా ఓట్లు వేయాలని ప్రయత్నిస్తే, మెషీన్ పనిచేయకుండా చేసేలా ఈవీఎంపై ఓబటన్ కూడా ఉంది. పోలింగ్ స్టేషన్‌లోని సిబ్బంది అవసరమైన సమయంలో దీన్ని నొక్కవచ్చు. పోలింగ్ ముగి సిన తర్వాత దీనికి పాతపద్ధతిలోనే లక్కతో సీల్ వేసి, దానిపై ఓ స్టిక్కర్ అతికించి, స్టాంప్ వేస్తారు. దీంతోఎలాంటి మార్పులకూ అవకా శం ఉండదు. ఇప్పటి వరకూ మూడు సాధారణ ఎన్నికలు, 113 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరిగినప్పుడు ఒక్కో పార్లమెంటరీ నియోజక వర్గంలో ఫలితం తేలాలంటే కనీసం 40 గంటలు పట్టేది. ఈవీఎంల వినియోగంతో అది 5 గంటలకు తగ్గిపోయింది. ఎలాంటి అవకతవ కలకు, మానవ తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎన్నికలు నిర్వహిం చేందుకు వీలు కలిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈవీఎంల ప్రభావం అనే అంశంపై పరిశోధనలు చేసిన శిశిర్ దేవ్నాథ్, ముదిత్ కపూర్, షమికా రవి తమ పరిశీలనలను 2017లో సమర్పించారు. ఈవీఎంల ప్రవేశం కారణంగా అందరూ తమ ఓటు హక్కు నిర్భ యంగా వినియోగించుకునే అవకాశం కలిగిందని, ఎన్నికల్లో అక్రమా లకు అడ్డుకట్ట పడిరదని, ఎన్నికలను మరింత సమర్థంగా నిర్వహించే వెసులుబాటు కలిగిందని తమ నివేదికలో వీరు పేర్కొన్నారు.
వీఎంల హ్యాకింగ్ సాధ్యమేనా?
ఈవీఎంలకు ఓ చిన్న పరికరం అమర్చి, మొబైల్ ద్వారా ఎస్ఎంఎస్ పంపించడం ద్వారా ఓట్లను తారుమారు చేయవచ్చని ఎనిమిదేళ్ల క్రితం మిచిగాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. కానీ ఈసీ అధికారులు ఇదిఅసాధ్యమంటూ ఆఆరోపణలను కొట్టి పారేశారు. ఇన్నివేల ఈవీఎంలను హ్యాక్ చేయాలంటే చాలా డబ్బు అవసరమని, ఒకవేళ చేయాలనుకున్నా దానికి ఈవీఎంల తయారీలో భాగమైన ఇంజినీర్ల సాయం అవసరమని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కు చెందిన నిపుణుడు ధీరజ్ సిన్హా అభిప్రాయ పడ్డారు. దీనికి ఓ చిన్న రిసీవర్ సర్క్యూట్, మానవ కంటికి కనబడని ఓ యాంటెన్నా అవసరమని ఆయన అన్నారు. అయితే భారత్‌లో వినియోగిస్తున్న ఈవీఎంలకు ఎలాంటి యాంటెన్నాలు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు లేవని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. ఇంత భారీస్థాయిలో హ్యాకింగ్ అసాధ్యమని అన్నారు.
ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది?
దాదాపు 33దేశాల్లో ఈవీఎంల ద్వారా ఓటింగ్ జరుగు తోంది. కొన్ని దేశాల్లో వీటి విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈవీఎంల ద్వారా జరిగిన 2017 వెనెజ్వేలా ఎన్నికల్లో నమోదైన ఓట్లకన్నా దాదాపు 10 లక్షల అదనపు ఓట్లు ఎక్కువ పడ్డాయని వచ్చిన ఆరోపణలను అక్కడి ప్రభుత్వం తోసిపుచ్చింది. బ్యాలట్ల గోప్యత, ఫలితాల తారుమారు వంటి సమస్యలను ప్రస్తావిస్తూ అర్జెంటీనా కూడా 2017లో ఈ-ఓటింగ్ ప్రతిపాదనలను తిరస్కరిం చింది. 2018 ఇరాక్ పార్లమెంటు ఎన్నికల్లో ఈవీఎంలలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయంటూ కొన్ని చోట్ల రీకౌంటింగ్ నిర్వహించాల్సి వచ్చింది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో గత డిసెంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికలు పెద్ద వివాదాన్నే రేపాయి. ఈవీఎంలను సరిగ్గా పరీక్షించకుండానే పోలింగ్‌లో వినియోగించారనే ఆరోపణలు వచ్చాయి. అమెరికాలో 15 ఏళ్ల క్రితం ఓటింగ్ యంత్రాల వినియోగం ప్రారంభమైంది. ఇప్పుడు అక్కడ దాదాపు 35 వేల మెషీన్లు ఉన్నాయి. అయితే అక్కడా కొన్ని ఆరోపణలున్నాయి.
వీవీప్యాట్లతో సందేహాలు తొలగుతాయా?
‘‘టెక్నాలజీ వినియోగాన్ని ఎంతగా వీలైతే అంతగా తగ్గిం చాలి. ఏ ఓటరు ఏఅభ్యర్థికి ఓటేశాడో తెలియకూడదని అంటు న్నారు, అసలు సాఫ్ట్వేర్ అనుకున్న విధంగానే పనిచేస్తోందో లేదో తెలుసుకు నేందుకు కూడా సరైన మార్గం లేదు’’ అని ఈ-ఓటింగ్‌పై అధ్యయనం చేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినా ప్రొఫెసర్ డంకన్ బ్యూల్ వ్యాఖ్యానించారు. భారత్‌లో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిం చేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. అన్ని ఈవీఎంలకు వీవీప్యాట్లను ఏర్పాటు చేయాలని ఐదేళ్ల క్రితం సుప్రీం కోర్టు ఆదేశించింది. ఒక ఓటు నమోదుకాగానే, సీరియల్ నంబరు, పోటీలో ఉన్న అభ్యర్థి పేరు, పార్టీ గుర్తుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. 7 సెకండ్ల తర్వాత ఈవివరాలతో ప్రింట్ అయిన రసీదు ఓసీల్డు బాక్సులో పడిపోతుంది. వీవీప్యాట్ల ద్వారా వచ్చే పేపర్ స్లిప్‌లను మెషీన్లలో నమోద య్యే ఓట్ల సంఖ్యతో పోల్చి చూడాలని అధికారులు నిర్ణయిం చారు. ప్రతి అసెంబ్లీ స్థానంలో కనీసం 5%కేంద్రాల్లో ఇలా చేయాలని భావిస్తు న్నారు. ఓటర్ల మనసుల్లో ఉన్న అనుమానాలు వీవీప్యాట్ల ద్వారా తొలగవచ్చని మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ అభిప్రాయపడ్డారు.‘‘2015 నుంచి అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో వీవీ ప్యాట్లను ఉపయోగిస్తున్నారు. వీటిలో దాదాపు1500 మెషీన్లకు ఉన్న పేపర్ స్లిప్‌లను పోలైన ఓట్లతో కలిపి లెక్కించారు. ఒక్కటి కూడా తేడా రాలేదు’’ అని ఆయన అన్నారు. ఈవీఎంలో ఓట్లు ఎలా లెక్కిస్తారు? వీవీ ప్యాట్లు అంటే ఏంటి? ఈవీఎం మెషీన్లలో నిక్షిప్తమై ఉన్న ఓట్లు ఎవరికి అధికారం కట్టబెడ తాయో అన్న ఉత్కంఠతో అందరూ ఎదురు చూస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా రాజకీయపార్టీలు, ఏజెంట్ల సమక్షంలో జరుగుతుంది. ప్రతి రౌండ్లోనూ వారు సంతృప్తి చెందిన తర్వాతే ఫలితాలను అధికారులు వెల్లడిస్తారు. ఈనేపథ్యంలో అసలు ఈవీఎం మెషీన్లలో ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుం దో చూద్దాం. ఆసమయంలో లెక్కింపు సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూద్దాం. ఓట్లను లెక్కించేందుకు ముందుగా ఈవీఎంలోని ఫలితాల విభాగానికి ఉన్న సీల్‌ను తొలగిస్తారు. ఈవీఎం బయటి కప్పు మాత్రమే తెరుస్తారు. లోపలి భాగాన్ని తెరవకుండా అలాగే ఉంచు తారు. తర్వాత ఈవీఎం పవర్ ఆన్ చేస్తారు. బ్యాటరీలో ఛార్జింగ్ తక్కువగా ఉంటే ఆ మెషీన్‌కి ఉండే డిజిటల్ తెర మిణుకు మిణుకుమని వెలుగుతుంది. లేదంటే ఖాళీగా కనిపిస్తుంది. అప్పుడు కొత్త బ్యాటరీ అమర్చాలి. అనంతరం లోపల బటన్ మాదిరిగా కనిపిం చే సీల్‌ను తొలగిస్తే లోపల రిజల్ట్స్ మీట కనిపిస్తుంది. ఆమీట నొక్కగానే ఏఅభ్యర్థికి ఎన్నిఓట్లు పోలయ్యాయో తెరపై కనిపిస్తుంది.ఆ వివరాలను జాగ్రత్తగా నోట్ చేసుకుంటారు.
వీవీపాట్ అంటే ఏమిటి? అదెలా పనిచేస్తుంది?
ఎన్నికల సంఘం ఓటింగ్ విషయంలో అనేక సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూనే ఉంది. బ్యాలెట్ బాక్స్‌ల నుంచి ఈవీఎంల వరకు కొత్త సాంకేతికతను వినియోగిస్తూనే ఉంది. అయితే, ఓటింగ్‌లో మరింత పాదర్శకతకు పేపర్ బ్యాలెట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని 16 రాజకీయ పార్టీలు గతంలో ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం వీవీపాట్‌ను తీసుకొచ్చింది. వీవీపా ట్.. ఇకమై మీ ఓటును ప్రింట్ తీసుకోవచ్చు. ఓటర్ వెరిఫైడ్ పేపర్ అడిట్ ట్రయిల్‌కు సంక్షిప్త రూపమే వీవీపాట్. ఇది ఒక చిన్న ప్రింటిర్ లాంటిది. వీవీపాట్‌ను ఈవీఎంలకు అనుసంధానిస్తారు. తాము వేసిన ఓటు ఎవరికి పడిరదో ఓటర్లు చూసుకునేందుకు వీలుగా ఎన్నికల సంఘం దీన్ని తీసుకొచ్చింది. మనంఏపార్టీకి ఓటు వేశామనదే వీవీ పాట్‌లద్వారా వెంటనే తెలుసుకునే అవకాశం ఉంది. ఈవీఎంలో మనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసిన తర్వాత వీవీపాట్ ఒక స్లిప్‌లో ఆఅభ్యర్థి పేరు, గుర్తు వచ్చేలా ప్రింట్ తీసి సీల్డ్ బాక్స్‌లో పడేస్తుంది. ఓటు వేసిన ఏడు సెకన్ల తర్వాత వీవీపాట్ బీప్ శబ్దం చేస్తూ ప్రింట్‌ను చూపిస్తుంది. 2013లో నాగాలాండ్‌లోని నొక్సెన్ అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో తొలిసారి వీవీపాట్లను ఎన్నికల సంఘం ఉపయోగించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2014 సాధారణ ఎన్నికల్లో కొన్ని పోలింగ్ బూత్‌లలో వీవీపాట్లను ఎన్నికల సంఘం ఉపయోగించింది.-కందుకూరి సతీష్‌కుమార్