కాలుష్యకోరల్లో ఢల్లీి..
ఇప్పటికే చుట్టుముట్టిన వాయు కాలుష్యం, ఇంతలోనే దీపావళి పండుగ, సుప్రీంకోర్టు వద్దని చెప్పిన వినకుండా స్థానికులు భారీ స్థాయిలో పటాసులు పేల్చారు. ఇంకేముంది ఢల్లీి వ్యాప్తంగా తీవ్ర వాయు కాలుష్యం అలుముకుంది. పండుగ మరుసటి రోజు, మంగళవారం ఉదయం కాలుష్యం తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. మంగళవారం ఉదయమైతే విషపూరిత పొగమంచు దేశ రాజధానిని పూర్తిగా కమ్మేసింది. దీపావళి రోజున సుప్రీంకోర్టు విధించిన పటాకుల నిషేధాన్ని నివాసితులు ఉల్లంఘించిన రెండు రోజుల తర్వాత ఢల్లీిలో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (%జజదీ%) తెలిపిన వివరాల ప్రకారం దేశ రాజధానిని విషపూరి పొగమంచు చుట్టుముట్టింది. చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక తీవ్రమైన కేటగిరీగా నమోదైంది. చాలా చోట్ల ఏక్యూఐ 400 దాటింది. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో బవానాలో గాలి నాణ్యత సూచిక(ఏక్యూఐ) 434, ద్వారకా సెక్టార్ 8లో 404, ఐటీఓలో 430, ముండ్కాలో 418, నరేలాలో 418, ఓఖ్లాలో 402, రోహిణి, ఆర్కేపురంలలో 417గా నమోదైంది.
ఢల్లీిలో పెరిగిన విషవాయువుల తీవ్రత
ఢల్లీిని కాలుష్యం వెంటాడుతూనే ఉంది. అసలే చలికాలం దట్టమైన పొగమంచు కమ్మేస్తుంది. దీనికి తోడూ చుట్టు పక్కల నుంచి వస్తున్న విషవాయువులు ఢల్లీి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరో మూడు, నాలుగు రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు. మన్నటి వరకూ వాయువుల వేగంతో పాటూ గాలి దిశ మార్పుతో కొంత వరకూ ఉపశ మనం లభించింది. దీంతో కాలుష్యతీవ్రత కొంత మేర తగ్గిందని భావించారు స్థానికులు. దీంతో అధికారులు కొన్నింటిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు.
ప్రస్తుతం గాలిలో ఉధృతి ఏర్పడి అది కాలుష్యానికి కారణం అవుతోంది. తద్వారా విజిబులిటీ సమస్య తీవ్రంగా మారింది. మంగళవారం ఢల్లీిలోని ఐదు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400కు పైగా నమోదైంది. మధ్యాహ్నం 2గంటలకే రహదారులు కనిపించకుండా మసగగా మారిపోయాయి. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో సూర్యరశ్మి బలహీనంగా మారింది. సాధారణంగా 2వేల మీటర్ల వరకూ కనిపించే రహదారి.. ప్రస్తుతం 1000 నుంచి 1500 మీటర్ల పరిధిలోనే కనిపిస్తోంది. దీనిపై స్పందించిన సెంట్రల్ పొల్యూషన్ బోర్డు కొన్ని కీలక అంశాలను వెల్లడిరచింది. సాధారణం కంటే ఒకడిగ్రీ ఉష్ణోగ్రత తక్కువగా నమోదైనట్లు ప్రకటించింది. నిన్న దేశ రాజధాని ఢల్లీిలో గరిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీలు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 11.5గా నమోదైనట్లు వెల్లడిర చింది. గాలిలో తేమ భారీగా పడిపోయింది. రెండు రోజుల క్రితం 95శాతం ఉండగా నిన్న 56శాతం ఉన్నట్లు పేర్కొంది. చుట్టు పక్కల నెలకొన్న పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం, దట్టమైన పొగ కారణంగా మరిన్ని రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచిస్తు న్నారు. అప్పుడప్పుడూ వేడి నీళ్లతో ఆవిరి పట్టుకొవడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు తలెత్తకుండా కాపాడు కోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఎన్సీఆర్‌లో చలి పంజా..
దేశ రాజధాని ఢల్లీి సహా ఉత్తరభారతదేశాన్ని చలి వణికిస్తున్నది. పలు రాష్ట్రాల్లో భారీగా చలిగాలులు వీస్తున్నాయి. దీంతో కొన్ని రోజుల నుంచి ఢల్లీిలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపో తున్నాయి. చలిగాలులు మరో రెండు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం సైతం ఢల్లీిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే ఆరు డిగ్రీలు తక్కువగా 15.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు తగ్గి.. 5 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 16.2, కనిష్ట ఉష్ణోగ్రత 5.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రెండు మూడు రోజుల పాటు చలిగాలులు, చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.పొగ మంచు కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జమ్మూ కశ్మీర్‌లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకంటే తక్కువగా నమోదవుతున్నాయి. పర్వతాల నుంచి వీస్తున్న చలిగాలుల కారణంగా ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల ప్రజలు చలితో వణుకుతున్నారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లో ఢల్లీిలోని చాలా ప్రాంతాలు, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజ స్థాన్‌లోని చాలా చోట్ల చలితీవ్రత పెరిగింది. ఢల్లీి నగర శివారుల్లోని ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలోని సెక్టార్ 62,సెక్టార్ 1,సెక్టార్ 116వద్దగాలి నాణ్యత పరిస్థితి తీవ్రంగా ఉన్న ట్లు అధికారులు వ్లెడిరచారు. అనవసరమైన నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.‘శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడే వారి సంఖ్య గణనీ యంగా పెరిగింది.చాలా మంది దగ్గు, జలు బు, కళ్లనుంచి నీరు కారడం,కళ్లు మండడం వంటి సమస్యలతో బాధపడతున్నారు’ అని ఓ వైద్యుడు చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాజధానిలో అయిదు రోజుల పాటు నిర్మాణ కార్యక లాపాలు చేపట్టరాదని ఢల్లీి పర్యావ రణ మంత్రి గోపాల్ రాయ్ ఆదేశాలు జారీ చేశారు. వాహనాలనుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించేందుకు నగరంలో రెడ్ సిగ్నల్ పడగానే వాహనాల ఇంజిన్‌ను అపేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే కాలుష్యాన్ని వెదజల్లే పాతకాలపు వాహనాలు, కమర్షియల్ వాహ నాలపైనా నిషేధం విధించారు. దీంతో పాటు గా వెయ్యి సిఎన్‌జి బస్పులను ప్రవేశ పెట్టేం దుకు యత్నాలు చేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలకు ఇదివరకే రెండు రోజులు సెలవులు ప్రకటిం చారు.అయితే వాయుకాలుష్యం బెడద ఒక్క ఢల్లీి నగరానికి పరిమితం కాలేదు. పొరుగు రాష్ట్రాలయిన హర్యానా, రాజస్థాన్, యుపిల లోని పలు నగరాల్లో పరిస్థితి కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి.
తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఢల్లీి వాసులు
దేశ రాజధానిని మంచు దుప్పటి కప్పేసింది. ఢల్లీిలో దట్టమైన పొగమంచు అలుముకుంది. పట్టపగలే రహదారులన్నీ రాత్రిని తలపిస్తుం డటంతో లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు వాహనదారులు.దేశ రాజధానిలో 7డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఒకవైపు పొగమంచు..మరోవైపు కాలుష్యంతో ఢల్లీి వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
-(బి.సూర్య ప్రకాష్ యాదవ్)