కల్వకుంట్ల చంద్రశేఖర్ అనునేను
తెలంగాణలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ నేతృ త్వంలోని కేసీఆర్‌కే మళ్లీ పట్టం కట్టారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నిక లను కూడా యావత్ దేశం ఆసక్తిగా పరిశీలించింది. కాంగ్రెస్, టీడీపీ తమ మధ్య ఉన్న వైరాన్ని పక్కనబెట్టి సీపీఐ, టీజేఎస్‌తో కలిసి ప్రజా కూటమిగా ఏర్పాటుకావడం ఒకటి కాగా..రెండోది గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు భారీ మొత్తంలో ధన ప్రవాహాన్ని పారించడం ఈఎన్నికల ప్రత్యేకతలు. ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు టీఆర్ఎస్కు భారీ మెజార్టీ ఇచ్చారు. మొత్తం 119 స్థానాలకు 88 సీట్లలో టీఆర్ఎస్ గెలిచింది. గత నాలుగున్నరేండ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలు, సబ్సిడీలు కొనసాగించాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే సాధ్యమవుతుందనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు పట్టం కట్టారు. -ఎన్.వేణుగోపాల్
ప్రజలు ఇచ్చిన తీర్పును ఏరాజకీయ పార్టీ అయినా గౌరవించాల్సిందే. తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఈ గొప్ప విజయంతో రెట్టింపు ఉత్సాహంతో ప్రభుత్వం పనిచేయాల్సిన బాధ్యత ఉంది. గత పర్యాయంలో ఇచ్చి నెరవేర్చలేకపోయిన హామీలను సైతం అమలు చేయడమే కాకుండా కొత్తగా మరిన్ని అభివ ృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడితే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది. ప్రభుత్వ పనితీరును బట్టే ప్రజా తీర్పు ఉంటుందనే విషయాన్ని ఈఎన్నికలు స్పష్టంచేసినట్టు కనబడుతోంది. మిగతా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు చాలా మెరుగైన ఫలితాలు వచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా చెప్పుకొనే ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీచింది. ఎన్డీయే సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీతో పాటు నిత్యావసర ధరల పెంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వీటితో పాటు సీబీఐ, సుప్రీంకోర్టు, ఈడీ,ఐటీ తదితర స్వతంత్ర వ్యవస్థల్లో జోక్యం చేసు కుంటూ వాటిని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తోందనే విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఇచ్చిన తీర్పు ఆయా రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పేదే.
రెండోసారి గెలిచిన వెంటనే.. కోటిఎకరాల మాగాణికి సాగునీరందించడం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనే తమ తక్షణ కర్తవ్య మని ప్రకటించిన కేసీఆర్.. ఆదిశగా సత్వరమే చర్యలు తీసుకోవాలి. విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేయాలి. ప్రజల మౌలిక అవస రాలకు సంబంధించిన అంశాల్లో కార్పొరేట్ వ్యవస్థల గుత్తాధిపత్యానికి చరమగీతం పాడే లా విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తే యావత్ సమాజం హర్షిస్తుంది. ప్రజలు ఇచ్చి న ఈ గొప్ప అవకాశంతో రాష్ట్ర ప్రతిష్ఠను, ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం పనిచేయాలి. అలాగే, ప్రతిపక్ష పార్టీలు ఈ ఓటమితో నిరాశలో కూరుకుపో కుండా నిత్యం జనంలో తిరుగుతూ వారితో మమేకమవ్వాలి. ఓటమికి కారణాలను ఆత్మ పరిశీలన చేసుకుంటూ ప్రజలకు దగ్గరయ్యేం దుకు మరింత చొరవతో పనిచేయాలి. పాల నలో ప్రభుత్వానికి సహకరిస్తూ నిర్మాణాత్మక సూచనలు, సలహాలుఇస్తూ ముందుకెళ్లే దిశ గా ప్రయత్నం చేయాలి. ఎన్నికల్లో గెలుపోట ములు సహజం. సమైక్య రాష్ట్రంలో ప్రభు త్వాల పాలనలో తెలంగాణ గ్రామీణ ప్రజలు చాలా బలహీనపడిపోయారు. తెలంగాణ రాష్ట్రం కల సాకారమయ్యాక ఏర్పడిన ప్రభు త్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, సబ్సిడీలు కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించి.. వాటితో ప్రజలకు ఉపశమనం కలిగించింది. ఈతరు ణంలో తెలంగాణ ఓటరు ఇచ్చిన ఈగొప్ప విజయాన్నిస్ఫూర్తిగా తీసుకొని మరిన్ని సంక్షే మ కార్యక్రమాలు, సబ్సిడీలను కొనసాగించే దిశగా చర్యలు తీసుకుంటూనే ప్రజాకాం క్షలకు అద్దంపట్టేలా పాలన కొనసాగించాలి. దేశంలో ప్రతీ ఒక్కరూ తమ గురించి తామే ఆలోచించు కుంటున్నారు. సామూహిక పోరా టాలపై క్రమంగా విశ్వాసం సడలిపోతోంది. ఏప్రాంతం వారు ఆ ప్రాంతం గురించే ఆలో చించుకొనే ధోరణులు కనబడుతున్నాయి. ఇలాంటి పరిణామం ప్రజాస్వామ్య మను గడకు మంచిది కాదు. ఓవిశాలమైన దృక్ప థంతో ప్రతిఒక్కరూ ముందుకెళ్లాలి. రాజకీయ పార్టీలు కూడా సామూహికమైన అంశాలను తీసుకొని రాజకీయ ఉద్యమాలు చేపట్టాలి. అప్పుడే సామూహిక చైతన్యం వస్తుంది. సామూహిక ఉద్యమాలపై ప్రజల్లో నమ్మకం పెంచాలి. గెలుపు అనేది మనిషిలో కొత్త మార్పులను తీసుకొస్తుంది. దాంతో వచ్చిన పరిణామాలను సమతుల్యం చేసుకుంటూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవ గలిగే వాడే గొప్ప నాయకుడు కాగలుగుతాడు. ఇప్పటి వరకు కేసీఆర్ సర్కార్ చేసిన అభి వృద్ధి పనులకు అభినందనలు. వచ్చే ఐదేండ్ల లో అభివృద్ధిపై కేంద్రీకరించండి. ఏయే అం శాలు ఆర్థిక రంగాన్ని పురోగమింప జేస్తాయో వాటిపై దృష్టి పెట్టండి. తెలంగాణ సమాజ శ్రేయస్సు కోసం ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్ర మంలోనైనా ప్రజాస్వామికవాదుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది.
కొత్త ప్రభుత్వానివి పాతవిధానాలేనా.. మార్పుంటుందా?
కారణాలు ఏవైనాగానీ, కారకులు ఎవరైనాగానీ, తెలంగాణ రాష్ట్ర సమితి మరొ కసారి పూర్ణ బహుమతి పొంది, ప్రభు త్వాన్ని ఏర్ప రచనున్నది. తెలంగాణ ప్రజా ఆకాంక్ష లలో, ఉద్యమ నినాదాల్లో అత్యధిక భాగాన్ని నెరవేర్చని పాలనానుభవంతో ఈ విజయం ఎలా సాధ్యమయిందని ప్రశ్నలు రావచ్చు. కౌలురైతులు, ఉద్యోగులు, కార్మి కులు, నిరు ద్యోగులు, ఆదివాసులు, ప్రజాఉద్యమ కార్య కర్తలు వంటి వివిధ ప్రజాసమూహాల అసం తృప్తిని మూట గట్టుకున్న తర్వాత కూడ ఈ విజయం ఎలా సాధ్యమయిందని సందేహాలు మిగలవచ్చు. ఎన్నికల ప్రచార సమయంలో మరొకసారి వినియోగించిన, రెచ్చగొట్టిన తెలంగాణ సెంటిమెంట్ ఈ విజయానికి కార ణం అనుకోవచ్చు. ప్రత్యర్థులకు విశ్వసనీయత లేకపోవడం, తప్పుడు వ్యూహాలు కారణమను కోవచ్చు. లేదా, పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాల లబ్ధిదా రులు పూర్తిగానూ, రైతుబంధు, రైతుబీమా లబ్ధిదారులు, నీటిపారుదల పథకాల కలలు కంటున్నవారు కొంతవరకు టీఆర్ఎస్కు వోటు వేశారనుకోవచ్చు. ఈఎన్నికల ఫలి తాలు ఎలా ఉన్నా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నంతవరకు రానున్న ప్రభుత్వం ముందున్న సవాళ్లు, అవకాశాలు, కర్తవ్యాలు ఏమిటో చర్చించుకోవలసి ఉన్నది. ఇదేదో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కోసం కాదు. అది ఈవిజయానికి తప్పనిసరిగా తనవిధానా లకు ప్రజల సంపూర్ణ ఆమోదం అనే తప్పుడు అర్థం చెపుతుంది. గత నాలు గున్నరేండ్ల పాల నలో అమలు చేసిన విధానా లనే యథాత థంగా కొనసాగిస్తుంది. కాని నిరంతర జాగ రూకతే ప్రజాస్వామ్యానికి చెల్లించవలసిన మూల్యం అనే విలువను నమ్మితే ప్రజానీకం నిరం తర జాగరూకంగా ఉండవలసిన అంశాలు ఇవి.
పెరిగిపోయిన రుణభారాన్ని తగ్గిం చడం, ప్రభుత్వవ్యయం పెరుగుదలను అరిక ట్టడం, విద్యారంగ అభివృద్ధి, పారిశ్రామి కాభి వృద్ధి, తద్వారానూ ఇతరంగానూ నిరు ద్యోగ సమస్య తగ్గింపు, అసంతృప్త వర్గాల సమ్మతిని చూరగొనడం వంటి ప్రధానమైన సవాళ్లు కొత్త టీఆర్ఎస్ ప్రభుత్వం ముందున్నాయి. తెలం గాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రుణభారంలో తనవంతు వాటా గా రూ.61,711కోట్ల అప్పుతో ప్రారంభమ యింది. నాలుగేండ్లలో ఆ అప్పు రెండు లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో నిష్పత్తిగా చూస్తే చట్టం అనుమ తించిన పరిధిలోపలే ఉన్నదనో, ఆఅప్పులను అభివృద్ధి పథకాలకే ఖర్చు పెడుతు న్నామనో టీఆర్ఎస్ చెప్పుకున్నది గాని బహుశా దేశం మొత్తంలోనే ఇంత తక్కువ కాలంలో ఇంత ఎక్కువ అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరొకటి లేదు. ఈఅప్పును కేంద్ర ప్రభుత్వ ఎఫ్ ఆర్‌బిఎం చట్టపు నిబంధనలకు లోబడే చేస్తు న్నామని ప్రభుత్వం పదే పదే చెప్పుకున్నది. అలా అది చట్టబద్ధంగా కనిపించి నప్పటికీ న్యాయబ ద్ధమైనది మాత్రం కాదు. ఎందుకంటే కాలం గడిచిన కొద్దీ తెచ్చిన అప్పంతా పాతఅప్పుల అసలు, వడ్డీల చెల్లింపుల కోసం మాత్రమే వెచ్చించవలసిన రుణభారపు విషవలయంలోకి రాష్ట్రం చేరుతుంది. ఆ అనుభవం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల, రాష్ట్రాల ప్రభుత్వాలకు ఉన్నదే. చివరికి స్వయంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన 2018 నివేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాత అప్పులు తీర్చడానికే కొత్త అప్పులు చేస్తున్నదని కూడ నిర్ధారిం చింది. కనుక కొత్త ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిశీలించవలసిన సవాల్ తన అప్పుల విధానాన్ని సమీక్షించుకోవడం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో అంతర్గత వనరుల సేకరణ సాధ్యం కాని అనివార్య పరిస్థితి లో మాత్రమే అప్పుకు వెళ్లాలని, అలా అప్పుకు వెళ్లేప్పుడైనా తక్కువ వడ్డీ అప్పులకే ప్రాధాన్యం ఇవ్వాలని తనకు తాను ముందస్తు జాగ్రత్త విధించు కోకపోతే, గత అనుభవాన్ని యథాతథంగా కొనసాగిస్తే రానున్న పదవీకాలంలో రాష్ట్ర ప్రజల మీద రుణభారం ఏనాలుగైదు లక్షల కోట్ల రూపాయలకో చేరి, రాష్ట్ర ఆర్థికవ్యవస్థ ఎన్నటికీ కోలుకోలేని స్థితికి చేరుకుంటుంది.
అలాగే ప్రభుత్వ వ్యయం పెరుగుదలను అరికట్టడం, ఇప్పటి వరకూ సాగుతున్న ప్రభుత్వ వ్యయాన్ని నిర్మొహమాటంగా సమీక్షించి, అనవసర, దుబారా వ్యయాన్ని తగ్గించడం, అవసరమైన రంగాలలో వ్యయాన్ని పెంచడం అనే ప్రక్రియ నిరంతరం జరగవలసి ఉంది. గత నాలుగున్నరేండ్ల టీఆర్ఎస్ పాలనానుభవంలో అటువంటి సమీక్ష జరిగిందో లేదో తెలియదు. కాని ప్రభుత్వ వ్యయం మాత్రం నానాటికీ పెరిగిపోయింది. అది కూడ ప్రజావసరాల మీద, ఉపాధి అవకా శాలను, ఆదాయ వనరులను పెంచే ఉత్పాదక పథకాల మీద కాకుండా వథా వ్యయంగా సాగింది. ఆడంబరాల కోసం, రక్షణ పేరు మీద పటాటోపాల కోసం సాగింది. ఎన్నికల సమయంలో ప్రజలను ఆకర్షిం చడానికి ఇచ్చే ప్రలోభాలకూ తాయిలాలకూ మరొక రూపుగా సంక్షేమ పథకాలను తయారు చేసి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుబారా చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల నుంచి చూసినా ఎన్నడూ లేనంత ఎక్కువగా పోలీసు వ్యవస్థను దగ్గరికి తీసి, వారు అడిగినవీ, అడగనివీ కూడ ఇచ్చి వేలకోట్ల రూపాయలు దుబారా చేయడం జరిగింది.
ఇలా గత నాలుగున్నరేండ్లలో చేసిన ప్రభుత్వ వ్యయాన్నంతా ఒక్కసారి సమీక్షించి, వాటిలో ఏపద్దుల మీద కోత విధించవచ్చు, ఏ పద్దులను రద్దు చేయవచ్చు, ఏపద్దుల మీద వ్యయాన్ని పెంచవలసిన అవసరం ఉంది అని ఒకవివరమైన మదింపు అవసరం ఉంది. అది జరిగినప్పుడే, ప్రజలు చెల్లిస్తున్న పన్నులు, ప్రభుత్వానికి ఒనగూరు తున్న నిధులు సక్రమ వినియోగంలోకి వస్తాయి. అలా కాక, గతంలో కొనసాగిన విధానాలనే కొనసాగించవచ్చునని అనుకుంటే ఈ పదవీ కాలం ముగిసి, తర్వాతి పదవీకాలానికి వారే అధికారానికి వచ్చినా, మరొకరు అధికారానికి వచ్చినా ఆర్థిక వ్యవస్థను నిర్వహించలేని దుస్థితి ఏర్పడుతుంది. ఐదేండ్ల కొరకు ప్రజాధనానికి ధర్మకర్తగా ఉండవలసిన ప్రభుత్వానికి దాన్ని దుర్వినియోగం చేసే హక్కు లేదు. విద్యారంగ అభివృద్ధి విషయంలో గత నాలుగున్న రేండ్లలో కొన్ని గురుకులాలు ఏర్పాటు చేయడం మినహా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినది చాల తక్కువ. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అనే నినాదం నాలుగున్నరేండ్లలో అటకెక్కింది. ఈపదవీకాలంలోనైనా ఆనినాదాన్ని సాకారం చేసే చర్యలు తీసుకోవలసి ఉంది. ఉపాధ్యాయుల నియామకం, పాఠశాలల మౌలిక సౌకర్యాలు మెరుగుపరచడం, ఎక్కువమంది పిల్లలను ప్రభుత్వ పాఠశా లలకు పంపేలా తల్లిదండ్రులను ప్రోత్సహించడం, సమాజంలో ప్రభు త్వ విద్యపట్ల ఆదరణ పెంచడం, ప్రభుత్వ పాఠశాలల పనితీరును మెరుగుపరచడం వంటి ఎన్నో చర్యలు తీసుకోవలసి ఉంది. విద్యా పరంగానూ, ఆర్థికంగానూ, సామాజికంగానూ, సాంస్కృతికంగానూ దుష్పరిణామాలకు దారి తీస్తున్న కార్పొరేట్ విద్యావ్యాపార సంస్థల ఉక్కు పిడికిలి నుంచి ఇంటర్మీడియట్ వ్యవస్థకు విముక్తి కలిగించడం, డిగ్రీ కళాశాలలను, యూనివర్సిటీలను బలోపే తం చేసి, ఎక్కువ నిధు లు కేటాయించి, మొత్తంగా ఉన్నత విద్యావ్యవస్థను తెలంగాణ అవస రాలు తీర్చేలా మెరుగు పరచడం ఈప్రభుత్వం ముందున్న సవాళ్లు. ఈ సవాళ్లను పరిష్కరించకుండా, గతనాలుగున్నరేండ్లలో అమలు చేసిన విధానాలనే కొనసాగిస్తే ఈ పదవీకాలం ముగిసేనాటికి తెలం గాణ రాష్ట్రం ప్రయివేట్ విద్యా వ్యాపారుల ఇష్టారాజ్యపు క్రీడాస్థలిగా మారిపోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏవిద్యావకాశాలు కోల్పోయామని తెలంగాణ ప్రజానీకం తపన పడి ప్రత్యేక రాష్ట్రం కోరుకు న్నారో, అంతకు మించిన దుస్థితి తలెత్తు తుంది. టీఆర్ఎస్ మొదటి పదవీకాలంలో నాలుగున్నరేండ్ల పాటు పారిశ్రామికాభివృద్ధికి చేసినదేమీ లేదనే చెప్పాలి. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో మూసివేసిన తెలంగాణ పరిశ్రమలను పునరుద్ధరి స్తామని ఉద్యమకాలంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదు. కొన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలను ఆహ్వానించడం, వారికి రాయితీలు, సౌకర్యాలు ఇవ్వడం మినహా నిజంగా పారిశ్రామికాభివృద్ధి అని చెప్పదగిన పనులేవీ జరగలేదు. ఐటీ పరిశ్రమ స్వాభావికంగానే తెలంగాణ నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగకల్పన చేసే శక్తి ఉన్నది కాదు. రాయితీల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒరిగినదేమీ లేదు. పారిశ్రామిక ఉత్పత్తులను తయారుచేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దోహదం చేయడం, విరివిగా ఉద్యోగకల్పనకు అవకాశం ఇవ్వడం, నెలకొన్న ప్రాంతంలో మరెన్నో అనుబంధ పరిశ్రమలకు, చిన్న తరహా పరిశ్రమలకు, సేవా రంగ సంస్థలకు అవకాశం ఇవ్వడం పారిశ్రామికాభివృద్ధి ఫలితాలు కావాలి. అటువంటి పరిశ్రమలకు అవసరమైన ఖనిజ, అటవీ, వ్యవసాయ, జల, విద్యుత్,రవాణా వనరులన్నీ తెలంగాణలో విస్తారంగా ఉన్నాయి. మానవశక్తికైతే కొదవలేదు. కాని గత నాలుగున్నరేండ్లలో ఇటువంటి సమగ్ర విస్తత అభివ ృద్ధికి దారితీసే ఒక్క పరిశ్రమ ఏర్పాటు కూడా జరగలేదు. రానున్న పదవీకాలంలో ప్రభుత్వ రంగంలోనైనా, సంయుక్త రంగంలోనైనా, తప్పదనుకుంటే ప్రయివేటు రంగంలోనైనా ఇటువంటి పారిశ్రామికాభివృద్ధికి పూనుకోక పోతే, నిరుద్యోగం పెరుగుతుంది. రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు ఆదాయం, పన్ను ఆదాయం పెరిగే వనరులు తగ్గిపోతాయి. నిరుద్యోగ సమస్యను తగ్గించడంలో పారిశ్రామికాభివృద్ధి ఒక కోణమైతే, అంతకు మించి ప్రభుత్వం చేయదగిన పనులు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వోద్యోగాల ఖాళీలను భర్తీ చేయడం, జిల్లాల విభజన వల్ల అవసరమైన కొత్త ఉద్యోగాలను నింపడం, పదవీ విరమణ వల్ల ఏర్పడుతున్న ఖాళీలను వెంటవెంటనే భర్తీ చేయడం, ఉద్యోగ కల్పనా సంస్థలను ప్రోత్సహించడం, స్వయం ఉపాధి పథకాలు ఇబ్బడి ముబ్బడిగా రూపొందించడం తెలంగాణ ప్రభుత్వం చేయ వలసిన పనులు. కాని తన మొదటి పదవీకాలంలో టీఆర్ ఎస్ ప్రభుత్వం ఉద్యోగ కల్పనకు ఇవ్వవలసిన కనీస ప్రాధాన్యత కూడ ఇవ్వలేదు. ఉద్యమ కాలంలో ప్రధాన ఆకాంక్షగా ఉండిన ఉద్యోగకల్పన కోరికను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించు కోలేదు. రెండు, రెండున్నర లక్షల ఉద్యోగాలు రావచ్చునని ఉద్యమ సమ యంలో కన్న కలలను, ఒక లక్షా ఏడు వేలకు కుదించి, నాలుగున్న రేండ్లలో ఇరవై వేలఖాళీలు కూడా నింపని ఘనచరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఉన్న ఖాళీలన్నిటికి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, చివరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరిరోజుల్లో వెలువడబోతున్న నోటిఫికేషన్‌ను ఆపు చేయించి, మేము రాగానే ఇస్తాము అని బీరాలు పలికి, నాలుగున్నరేండ్లు గడిచినా కనీసం ఆనోటిఫికేషన్ కూడా ఇవ్వని చరిత్ర టీఆర్ఎస్ పాలనది. కొత్త ప్రభుత్వం ఆ పాతవిధానాన్నే కొనసాగిస్తే నిరు ద్యోగుల నుంచి, ప్రజల నుంచి మరింత అసంతృప్తి మూటగ ట్టుకోవడం మాత్రమే అవుతుంది.
ఇవాళ సెంటిమెంటును రెచ్చగొట్టిఓట్లు, స్థానాలు సంపాంచ గలిగినా, గత పాలన ఎన్నోప్రజా సమూహాలను అసంతృప్తికి గురి చేసింది. ఆ అసంతృప్తి ఇవాళ వోట్లుగా మారి ఉండక పోవచ్చుగాని, రానున్న పాలనాకాలంలో ఆఅసంతృప్త సమూహాలను బుజ్జగించడా నికి, వారి ఆకాంక్షలను తీర్చడానికి ప్రయత్నించకపోతే ఆ అసంతృప్తి ఇతర రూపాల్లో విస్ఫోటనమవుతుంది. మరొకపక్క వారి ఆకాంక్షలను తీర్చడ మంటే తాయిలాలు ఇవ్వడమనో, ప్రభుత్వ వ్యయం పెంచడమనో అర్థం చెప్పుకుంటే అది మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది. ఈప్రత్యక్ష ఆర్థిక సవాళ్లతో పాటు పరోక్షంగా ప్రభావం చూపే ఆర్థిక సవాళ్లు, అవి జనచైతన్యం మీద చూపే ప్రభావాలు ఉంటాయి. ఆప్రభావాలు ఎప్పటికప్పుడు వ్యక్త మయ్యే అవకాశాలు ఇవ్వకపోతే, అంటే వాక్సభాస్వాతంత్య్రాల మీద ఆంక్షలు విధిస్తే, గత పాలనాకాలంలో ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తే, ఈ గెలుపు ఓటమికి సోపానమవుతుంది.