ఒరిశా రైలు ప్రమాదానికి బాధ్యులెవరు?

దేశంలో మనుషుల ప్రాణాలంటే ప్రభుత్వాలకు లెక్కలేదు.రైలు,రోడ్డు,ఆకాశమార్గాల్లో ప్రమాదాలు జరుగుతున్నా ప్రజల భద్రత పరిరక్షణ చేపట్టడంలేదు. మానవ తప్పిదం కారణంగా ఒడిశా బాలేశ్వర్‌ రైలు ప్రమాదదుర్ఘటనలో దేశవ్యాప్తంగా పెనువిషాదాన్ని నింపింది.గూడ్స్‌,ట్రైన్‌ నిలిచివున్న ట్రాక్‌లోకి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రవేశించిందని,మూడు రైళ్ల ఢీకొట్టుకోవడానికి ఇదే కారణమని రైల్వే అధికారులు చెబుతున్నారు.ఇది మొత్తం ఎలక్ట్రికల్‌ ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థ తప్పిదాలు వల్లనే ఇంత ఘోరం జరిగిందని అధికారులు తేలిగ్గా చెప్పడం వారి భాద్యతారాహిత్యానికి, భద్రతచర్యల లోపాలకు నిదర్శనం.
రైలు ప్రమాద దుర్ఘాటనలో తన ఇద్దరు సోదరులను కోల్పోయిన ఒరిశా వాసి మనోజ్‌ దాస్‌ సోషల్‌ మీడియాలో తన ఆవేదన వ్యక్తపరిచారు.‘‘ఈ రకమైన తప్పిదాలు రైల్వేశాఖలో చాలావరకు జరుగుతున్నాయి. మొత్తం సంఘటనలో చాలా తప్పించుకోదగిన తప్పులు ఉన్నాయి. దీంట్లో ఎవరినీ నిందించడం లేదు కానీ మన దేశంలోని సో కాల్డ్‌ సిస్టమ్‌ యొక్క అజాగ్రత్త కారణంగా దేశంలో బహుజనుల సమస్యల పట్ల అజ్ఞానం,ఉదాసీనత స్పష్టంగా కన్పిస్తోంది. విషాదానికి దారితీసిన కొన్ని ‘‘సాంకేతిక లోపాలు’’ ఇక్కడ ఉన్నాయి.వీటిలో ఏవీ పూర్తిగా యాదృచ్ఛికంగా కనిపించవు.
ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌లో మార్పుకారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ అనేది సిగ్నల్‌లను సరికాని క్రమంలో మార్చకుండా నిరోధించడానికి ఒక భద్రతా చర్య. మార్గం సురక్షితమని నిరూపించబడినంత వరకు ఇది రైలును కొనసాగించడానికి అనుమతించదు. ఇనుప ఖనిజంతో కూడిన గూడ్స్‌ రైలు అప్పటికే ఆగిపోతున్న లూప్‌ లైన్‌ గుండా వెళ్లడానికి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు మొదట గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వబడిరది.ఈ మార్గంలో ఇలాంటి సిగ్నలింగ్‌ వైఫల్యాలు కొత్త కాదు.కానీ అన్ని తెలిసిన గతంలో ఈ వైఫల్యాల నుండి నేర్చుకోవడానికి నిరాకరించారు.
దాదాపు 1400మంది ప్రయాణికులతో యశ్వంత్‌పూర్‌-హౌరా ఎక్స్‌ప్రెస్‌ షెడ్యూల్‌ సమ యం కంటే 3గంటలు ఆలస్యంగా బయలుదేరింది.సరైన సమయంలో,సాయంత్రం4గంటలకు బాలాసోర్‌ గుండా వెళితే,ఢీకొనడాన్ని సులభంగా నివారించవచ్చు.ఆలస్యానికి హంతకులు కాకపోతే మరెవరు బాధ్యులు?ప్రాణాలతో బయటపడిన కొద్దిమందితో ఫోన్‌లో మాట్లాడి,చాలా మంది రైళ్లలో కూర్చున్న వారి కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేసుకున్నారు.72సిట్టింగ్‌ కెపాసిటీ ఉన్న జనరల్‌ బోగీల్లో రెండు రైళ్లలోఒక్కొక్కరికి 200మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఘర్షణ జరిగినప్పుడు నిలబడి ఉన్నారు.ఈ రైళ్ల రద్దీకి జవాబుదారీ ఎవరు? అవును,ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలు తీసుకోని నాటి ప్రభుత్వమే..నా సోదరుల మృతిపై రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలు కూడా..వాస్తవాలను దాచిపెడుతున్న పెయిడ్‌ మీడియా.తమరాజకీయ నాయకుల ముఖాన్ని కాపాడండి. కానీ దేశంలోని మతిమరుపు పౌరులమైన మనమే ఈసంఘటనను మరచిపోయి ప్రశ్నించడాన్ని జాతీయ వ్యతిరేకతగా పరిగణిస్తాము.’’అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చిన్నచిన్న భద్రత లోపాలు కారణంగా విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు.ఉదాహరణకు హెల్మేట్‌,సీటుబెల్టు,పెట్టుకొని ప్రయాణించక పోవడం ప్రమాదాలకు మరో కారణం.రహదారిపై ప్రయా ణించేటప్పుడు లైప్ట్‌ సైడ్‌ వెళ్లాల్సిన వాహనచోదకులు రైట్‌సైడ్‌ వెళ్తూ ప్రమాదాలకు గురవు తున్నా రు.దీంతోపాటు అతివేగం నియంత్రణ లేకపోవడం.వాహనాలను ఓవర్‌ టేక్‌ చేస్తూ అతివేగంగా ప్రయాణించడంతో ప్రమాదాలకు పిలుపులుగా మారుతున్నాయి.ఇవన్నీ యాధృచ్ఛకంగా జరుగుతున్న చిన్నచిన్న భద్రత లోపాలే.దేశంలో భద్రతకు ప్రధమ ప్రాధాన్యతమివ్వడం లేదు. రోడ్డు,రైలు మార్గాల భద్రతపట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి.అతివేగం,మానవ తప్పిదాల వల్ల కారణంగా జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ భద్రతను పాటించాలి.- రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్