ఏడాది గడిచిన మూడు రాజధాను ప్రకటన

‘‘ మూడు రాజధానుపై అసెంబ్లీలో తీర్మానం చేసి సంవత్సరం గడిచిపోయింది. అమరావతి రైతు, ప్రజానీకం చేపట్టిన ఉద్యమం ప్రారంభమై సంవత్సరం నిండిరది. ప్రభుత్వం సంక్షేమ పథకాు చేపట్టినా ఎక్కువ భాగం వివాదాస్పద నిర్ణయాు, కక్ష రాజకీయాు, వ్యతిరేక చర్యతో కాం గడిచిపోయింది. పాన కూడా కుంటుపడుతోంది. ముఖ్యమైన అంశాపై లిటిగేషన్లతో ప్రభుత్వం కోర్టు చుట్టూ తిరుగుతోంది. ఈ కాంలో రాజధాని అభివృద్ధి స్తంభించింది. సంక్షేమం కొంతలో కొంత మెరుగైనా రాష్ట్రమంతా అభివృద్ధి అస్తవ్యస్తంగా మారింది’’


ఆనాడు ప్రపంచ స్థాయి, అద్భుత రాజధాని అంటూ టిడిపి ప్రభుత్వం ఆశు రేకెత్తించింది. పరిమిత పనుతో సరిపెట్టింది. నేడు రాజధానిని ముక్కు చేసే పేరుతో ప్రాంతీయ వైషమ్యాను రెచ్చ గొట్టి బ్ధి పొందాని వైసిపి ప్రయత్నిస్తోంది.ఆరున్నర సంవత్సరా నుండి కేంద్రంలో బిజెపినే అధి కారంలో కొనసాగుతోంది. ఈకామంతా రాజధానికి, రాష్ట్రానికి బిజెపి, కేంద్రంతీరని ద్రోహం చేసింది. బిజెపి నేత వీర్రాజు గారికి అమరావతి అకస్మాత్తుగా గుర్తొచ్చింది. 2024లో రాష్ట్రంలో అధికారం లోకి తీసుకు వస్తే రాజధానిని 5 వేకోట్ల రూపాయతో అభివృద్ధి పరుస్తామని సెవిచ్చారు. మాట మార్చ డం,మడమ తిప్పడం తమకు అవాటు లేదని నమ్మబుకుతున్నారు. ఆరున్నరేళ్ల నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న విషయం మర్చిపోయినట్లున్నారు. గత ఐదుసంవత్సరాు రాష్ట్రంలో టిడిపితో కలిసి బిజెపి అధికారంలో కొనసాగిన సంగతి గుర్తున్నట్లు లేదు. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం బాధ్యత కేంద్రానిదే. రాజధాని శంకుస్థాపన సందర్భంలో మోడీ చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి తెచ్చి రాజధానికి నిధు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రజనోట్లో మట్టికొట్టారు. గత రెండుసంవత్సరా నుండి కేంద్ర బడ్జెట్లో అమరావతి ప్రస్తావనే లేదు. విజయవాడ మెట్రో గాలికొదిలేశారు. అమరావతికి రౖుె ప్రాజెక్టు ఏనాడో మర్చిపోయారు. ప్రత్యేక హోదా మాట ఇచ్చి నమ్మించి మోసం చేసింది బిజెపి కాదా? వెనుకబడిన ప్రాంతాకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఏమైంది? పోవరం నిధు కోత పెడుతున్నారు. కడప ఉక్కుఊసే లేదు. ‘అమరావతిలోనే బిజెపి ఆఫీస్‌ నిర్మించుకున్నాం. మమ్మల్ని నమ్మండి’ అని వీర్రా జు పదేపదే చెబుతున్నారు. ఆఫీసునిర్మించుకుంటున్నారు కానీ రాజధాని నిర్మించడం లేదు. రాష్ట్రంలో అధికారం ఇస్తే తప్ప రాజధాని నిర్మాణం చేయమని పరోక్షంగా ప్రజను బెదిరిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో బిజెపికి ఓట్లు రాలేదనే కక్షతోనే హోదా ఇవ్వలేదా? రాజధానికి నిధు ఇవ్వటం లేదా? ఈ కామంతా రాజధానిపై పరస్పర భిన్నమైన ప్రకటనతో బిజెపి నేతు ప్రజను గందరగోళ పరుస్తూ వచ్చారు.మూడు రాజధాను కాకపోతే 30 రాజధాను ఉంటాయని ఒక నేత, మూడు రాజ ధాను కాదు మూడు సచివాయాు ఉండాని మరోనేత ఇలా పురకా వ్యాఖ్యు చేశారు. రాజ ధానితో తమకు సంబంధమే లేదనీ కేంద్రంలోని బిజెపి సర్కార్‌హైకోర్టులో అఫిడవిట్లు దాఖు చేసింది. అమరావతి అంగుళం కూడా కదదని చెప్పిననేతు ఇప్పుడు ఎక్కడున్నారు? ఢల్లీిని తదన్నిన రాజధాని నిర్మిస్తామని 2014లో మోడీ ఇచ్చిన మాట ఏమైంది? బిజెపి నేతతో తేడా వ్ల ఇలా మాట్లాడుతున్నారని కొందరు అమాయకంగా అనుకుంటున్నారు. బిజెపి నేతు ఈ నాటకంలో ఎవరి పాత్ర వారు పోషిస్తున్నారు. అంతే తప్ప బిజెపి విధానంలో గందరగోళం లేదు. ప్రజను గందరగోళపరిచి, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడమే వారి విధానం. అమరావతి రైతుపై కేసు పెడితే సహించం, దౌర్జన్యం చేస్తే ఊరు కోమని వీర్రాజు ఫీుంకరించారు. దేశంలో రైతు మీద నిర్బంధం, పౌర హక్కు ఉద్యమ నేతను ఏళ్ల తరబడి జైులో పెట్టడం, దళితు, మైనారి టీపై దాడు…చేస్తున్న బిజెపి దుర్మార్గాన్ని అంద రూ గమనించాలి. మోడీ దేవదూత అని ఓబడా నేత ఆనాడే పొగడ్తు కురిపించారు.నేను ఆ మోడీ దూతనని నేడు వీర్రాజు చెప్పుకుంటు న్నారు. మోడీ రైతు పక్షమని చిక పుకు పుకు తున్నారు. మోడీ రైతు పక్షమో అంబానీ, అదానీ పక్షమో దేశం కోడై కూస్తోంది. ఢల్లీిలో పోరాడుతున్న రైతాంగానికి ఖలిస్తాన్‌ ఉగ్రవాదు ముద్ర వేసిన బిజెపి అమరావతి రైతుపై ప్రేమ కురిపిస్తూ కపట నాటకం ఆడుతోంది. రాజధానిని, రాష్ట్రాన్ని నిండా ముంచిన బిజెపి ని నమ్ముకుంటే ఆత్మహత్యా సదశ్యమే అవుతుంది. అధికారం కోసం పావు కదుపుతోంది. బిజెపి ప్రమాదాన్ని రాష్ట్ర ప్రజు ఇప్పటికే గమనిస్తున్నారు. కానీ కొత్త రూపాలో ప్రజను నమ్మించడానికి కొత్త కుట్రకు బిజెపి తెర లేపుతోంది. అందుకే రాష్ట్ర రాజధానిని నాశ నం చేయడంలో ప్రధాన ముద్దాయి బిజెపి. తోడు ముద్దాయిు వైసిపి, టిడిపిు.
బిజెపి, టిడిపి, వైసిపిది ఒకటే వైఖరి
వైఎస్‌ఆర్‌ పార్టీ, ప్రభుత్వం రాజధానిపై పునరాలోచన చేయాలి. వివాదాను కట్టిపెట్టాలి. ఉన్న పరిమిత వనరుతోనైనా రాజధాని నమూనా మార్చాలి తప్ప, స్థలాన్ని మార్చానుకోవటం వృధా ప్రయాసే. పోటీ ఉద్యమాతో, అణిచివేతతో రాజ ధాని ప్రజ గొంతు నొక్కానుకోవటం తగదు. గతంలో రాజధానిలో జరిగిన అవినీతిపై విచారణ చేయవచ్చు. దోషులైన అధికారును గత పా కును శిక్షించవచ్చు. కానీ ప్రజను బలి చేయడం తగదు. బిజెపి కేంద్ర ప్రభుత్వ అండతో రాజధానిని ముక్కు చేయవచ్చని వైసిపి, ముఖ్యమంత్రి జగన్‌ భ్రమ పడుతున్నారు.మోడీ,అమిత్‌షాను వేడుకుంటే జరిగేది ఏమీ లేదు. రాష్ట్ర ప్రజను నమ్ముకుంటే మంచిది. అన్నీ ఒకే చోట కేంద్రీకరించానే చంద్ర బాబు మోడల్‌ రాజధాని విఫమయ్యింది. ప్రపం చానికే ఆదర్శం అని చెప్పిన భూ సమీకరణ ఎదురు కొట్టింది. రైతుల్ని, పేదను నట్టేట ముంచింది. ఇప్పటికీ ఈ వాస్తవాన్ని గమనించకుండా సింగపూర్‌ మోడల్‌ గురించి గొప్పు చెప్పుకోవడం టిడిపి కి తగదు. ఇప్పుడైనా తప్పు గుర్తించి సరిదిద్దు కోవ టం తదనుగుణంగా వ్యవహరించడం మం చిది. అమరావతి ప్రాంత రైతు ఈ దుస్థితిలో వుండ డం వెనుక తన బాధ్యత నుండి టిడిపి తప్పించు కోలేదు. అప్పుడు ఇప్పుడు రాష్ట్రానికి, రాజధానికి ద్రోహం చేసిన బిజెపిపై పల్లెత్తు మాట మాట్లాడ కుండా మోడీ భజన చేస్తే అమరావతి నిబడు తుందా? కేంద్రంపై పోరాడకుండా అమరావతి రైతును కాపాడతాం అంటే ఎలా నమ్ముతారు? అమరావతి ఉద్యమం విశాంగా,విస్తృతంగా నడ పాల్సింది పోయి అందులోనూ టిడిపి తన రాజకీ య ప్రయోజనాన్ని చూసుకుంటే రాజధాని రైతుకు జరిగే ప్రయోజనం కంటేనష్టమే ఎక్కువగా ఉంటుం ది.బిజెపి,టిడిపి,వైసిపిది అనేక విధానాలో ఒకటే వైఖరి. ఆనాడు బిజెపి, టిడిపి కలిసి భూస మీకరణ చేపట్టాయి. పూర్తిగా విఫం అయింది. కేంద్రంపై ఒత్తిడి చేయ డంలో టిడిపి, వైసిపి ది మెతక వైఖరే. ఇరుపార్టీది లోపాయికారి కుమ్మక్కే. రాజ ధానిలోను,రాష్ట్రంలోనూ పౌరహక్కును,ఉద్య మాను అణచి వేతలో ఎవరికి ఎవరు తక్కువ తినలేదు. రాజధాని ప్రాంతంలోని దళిత, అసైన్డ్‌ రైతు, భూమి లేని పేదు, కార్మికు బాగోగు ను గాలికొదిలేశాయి. ఆనాడు సింగపూర్‌, ఈనా డు దక్షిణాఫ్రికా నమూ నాు, విదేశీ కన్సల్టెన్సీు, దుబారా ఖర్చు, వృధా ఖర్చు షరా మామూలే. రాజధాని, రాష్ట్ర అభి వృద్ధి విషయంలో సూత్రబద్ధ వైఖరికి సిపిఎం అన్ని వేళలా కట్టుబడి ఉంది. అమరావతి రాజధానిపై అసెంబ్లీలో అన్ని పక్షాు ఏకాభిప్రాయానికి వచ్చి నందున రాజధాని స్థం మార్పుపై వివాదం చేయడం తగదని ముందు నుండి చెబుతూనే ఉంది. రాష్ట్ర ప్రజందరికీ అమరావతి సమదూరంలో ఉంది కాబట్టి రాజధాని రైతుకే కాదు, రాష్ట్రప్రజందరికీ ఇది మేని వైఖరి తీసుకుంది. శాసన సభ, సచివాయం ఒక దగ్గర ఉంటే పరిపాన సౌభ్యం, ప్రజకు మేని సిపిఎంభావించింది. హైకోర్టు కర్నూులో పెట్టా న్న ప్రభుత్వ ప్రతి పాదనపట్ల అభ్యంతరం లేదని సిపిఎం తెలిపింది. రాజధాని ఒకేచోట ఉన్నా అబి óవృద్ధి రాష్ట్రమంతా జరగాని విద్యా, వైద్య సంస్థ ు, పరిశ్రము అన్ని ప్రాంతాకు విస్తరిం చాని, అదే నిజమైన వికేంద్రీ కరణ అన్న వైఖరికి ఎప్పుడూ కట్టుబడి ఉంది. దానికోసం నిరంతర పోరాటం సాగిస్తూనే ఉంది. ఇప్పటికే అమరావతిలో ప్రజా ధనం ఖర్చుపెట్టారు, కాబట్టి వృధాచేయడం సరికా దని, ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిలో మార్చ టం రాష్ట్రాభివృద్ధికి గొడ్డలిపెట్టు అని భావించింది. ఆనాడు రాజధానిపూలింగ్‌ విధానం తప్పని,పరి మిత స్థంలో రాజధాని నిర్మాణం చేసుకో వచ్చని చెప్పింది. పూలింగ్‌నువ్యతిరేకించి నందుకు ఆనాడు టిడిపి అభివృద్ధి నిరోధకుగా ముద్రవేసింది. ఈనాడు వైఎస్సార్‌ ప్రభుత్వం రాజధాని, ఇళ్ల స్థలా ుపేరుతో విశాఖలో భూ సమీకరణపేరు చెప్పి దళితు అసైన్డ్‌ భూము లాక్కుంటే తప్పని చెప్పింది, పోరాడిరది. హైకోర్టు లో కేసు వేసింది. దళితు పక్షాన నిబడి పోరాడి నందుకు ముఖ్య మంత్రి జగన్‌అసెంబ్లీ లోనే సిపిఎం పైన నిందు వేయడం చూశాం.రాజధాని అభివృద్ధి అంటే రాజ ధానిలో ఉన్న అన్నివర్గా ప్రజకు అభివృద్ధి ఫలాు అందాని దానికై నిరంతర కృషి సిపిఎం సాగిస్తోంది. టిడిపి ప్రభుత్వ హయాంలో అసైన్డ్‌ రైతుకు కౌు, సమానమైన ప్యాకేజీ అందించాని, పేదకు రాజధాని పెన్షన్‌ ఇవ్వాని, హామీు అము చేయాని అనేక ఉద్యమాు సాగిం చింది. పాక్షిక విజయాు సాధించింది. ఆనాడు టిడిపి అడ్డంకు పెట్టినా నిర్బంధాు ప్రయోగిం చినా ప్రజ మద్దతుతో తన కృషి సాగించింది. నేడు వైసీపీ ప్రభుత్వంలో రాజధాని లోని పారిశుధ్య కార్మికుకు7నెలు జీతాు ఇవ్వక పోతే కార్మి కుకు అండగా సిఐటియు పోరాటం కొనసాగి స్తోంది. హైకోర్టు, రాష్ట్రసచివాయం కాంట్రాక్టు సిబ్బంది వేతనాు, భద్రతపై కార్మిక సంఘాు చేస్తున్న పోరాటానికి అండగా సిపిఎం నిుస్తోంది. పేదకు రాజధాని పెన్షన్‌ పెంపు, అసైన్డ్‌ భూము కు సమానమైన ప్యాకేజీపై ఎన్నిక ముందు తర్వాత వైసిపి ప్రభుత్వ నేతు మాటు తప్ప చేతులేవు. రాజధాని ప్రాంతంలో ప్రజా సమస్య పై జరుగుతున్న కృషి, పోరాటం కొన్ని వర్గా మీడియాకు పట్టదు. రాజధాని ఉద్యమంతో గొంతు కుపుతోంది. వారికి అండగా నిుస్తోంది. అదే సందర్భంలో గతప్రభుత్వాు విధానా విషయం లో తనస్వతంత్ర వైఖరిని ప్రదర్శి స్తోంది.ఉమ్మడి ఉద్యమాకు మద్దతు ఇస్తోంది.ఢల్లీిలో రైతుఉద్య మం జరుగుతున్న తరహాలోనే రాజధాని లోనూ విశా ఉద్యమం సాగాలి.
-సి.బాబూరావు