ఉన్నత విద్యకు దూరవుతున్న దళిత,బహుజనులు
2024-25 విద్యా సంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలలో పీహెచ్‌డీ ప్రవేశాలకు జాతీయ అర్హత పరీక్ష (నెట్) నిర్వహించాలనడం యూనివ ర్సిటీల స్వయంప్రతిపత్తిని ధ్వంసం చేయడమే. ఆయా వర్శిటీలు సొంతంగా నిర్వహించే ప్రవేశ పరీక్ష స్థానంలో నెట్‌ను నిర్వహించాలంటూ దళిత, బహుజన విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కులోన్మాద కుట్రలను విద్యార్థి లోకం తిప్పి కొట్టాలి.
మార్చి 13వతేదీన న్యూఢల్లీిలో యూని వర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ యూనివర్సి టీలు సొంతంగా నిర్వహించే పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష స్థానంలో జాతీయస్థాయిలో ఏక పరీక్ష (నెట్) ను ప్రవేశపెట్టారు. ఈ నూతన పరీక్ష విధా నంలో నెట్‌ను మూడు కేటగిరీలుగా విభజించారు. అందు లోని 1వకేటగిరీలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత ఇచ్చారు. 2వ కేటగిరిలో ఫెలోషిప్ ఇవ్వకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికే అర్హత ఇచ్చారు. ఇక 3వ కేటగిరిలో ఫెలోషిప్ గాని, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత ఇవ్వకుండా పీహెచ్‌డీ కోర్సుల్లో చేరేందుకు మాత్రమే అర్హత ఇచ్చారు. దాన్ని కూడా ఏడాదికే పరిమితం చేశారు. నెట్ పరీక్ష ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉండటంతో దక్షిణ భారతదేశ విద్యార్థులు పరీక్షల్లో అధిక మార్కులు సాధించలేరు. దీంతో కేటగిరి-1లో వీరు ఫెలోషిప్ పొందలేరు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత కూడా కోల్పోతారు. వివిధ యూనివర్సిటీల్లో ఏటా పీహెచ్‌డీ ఖాళీలు భర్తీ చేసేందుకు తప్పనిసరి గా పరీక్షలు నిర్వహించాలనే విధానం లేకపోవడం వల్ల యూజీ నెట్‌లోని 3వ కేటగిరి సాధించినప్ప టికీ విద్యార్థులు ఏడాది కాల పరిమితి నిబంధన వల్ల కనీసం అడ్మిషన్ కూడా పొందలేని పరిస్థితి ఏర్పడనున్నది.
గ్రామీణ ప్రాంత విద్యార్థులు,రాష్ట్ర భాషలు, మాతృభాషలలో చదువుకున్న విద్యార్థులు, పేద, దళిత, బహుజన విద్యార్థులు పట్టణాల్లోని ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలో ఇంగ్లీష్ భాషలో చదివే విద్యార్థులకు పోటీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడు తున్నది. అనేక కష్టనష్టాలు, అణచివేతకు, అవమా నాలకు గురై పీజీ వరకు చదువుకున్న దళిత, బహుజన విద్యార్థులు ఈనిర్ణయంతో ఉన్నత విద్యా సంస్థల నుంచి గెంటివేయబడుతారనేది నూటికి నూరుపాళ్లు వాస్తవం. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ విషయాన్ని బహిర్గతం చేసిన యూజీసీ సంస్థ విద్యార్థుల ఆందోళనలను ఎలక్షన్ కోడ్ పేరుతో అణచివేసే ఉద్దేశంతోనే చేసింది. కొత్త విద్యా విధానం-2020 అమలులో భాగం గానే ఈ ఏకపరీక్ష విధానాన్ని ప్రవేశపెడుతున్నా మని ఈసందర్భంగా ప్రకటించిన యూజీసీ తొందరలోనే తన అస్తిత్వాన్ని కోల్పోయి రద్దయ్యే పరిస్థితి కూడా ఉన్నది. కొత్త విద్యా విధానంలోనే యూజీసీని రద్దు చేయాలని, ఆస్థానంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఈసీఐ) ఏర్పాటు చేయాలని ఉంది.గత కొన్నేండ్లుగా ఎంతో మంది పేదవిద్యార్థులకు ఉపకార వేతనాలు అందించిన యూజీసీని కూడా కనుమరుగు చేసే పరిస్థితి నేడు నెలకొన్నది.ఈ దేశ పాలకులు అనుస రించిన విధానాలతో ఇప్పటికే భారత విద్యా విధా నంలో కొందరికే విద్య అనే పరిస్థితికి నెట్టివేయ బడిరది. విద్య కాషాయీకరణ, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణతో పూర్తి కేంద్రీకరణకు పూను కున్నది. ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ పదేండ్ల కాలంలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది. ఏక పరీక్ష విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పోరాడేందుకు విద్యార్థులు ముందుకురావాలి.పీజీపూర్తి చేసి ఎంఫిల్, పీహెచ్ ఎ ప్రవేశాలు పొందిన మైనారిటీ విద్యార్థులకు ఆర్థిక వెసులుబాటులేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఈఆటంకాన్ని తొలగించడానికి 2009 లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ‘మౌలానా అబుల్ కలాంఆజాద్ జాతీయ ఫెలోషిప్’పేరిట ఉపకార వేతనాలను ప్రవేశ పెట్టింది. వీటితో లబ్ధిపొందు తున్నవారు ఇతర ఉపకార వేతనాలు కూడాఅందు కుంటున్నారనే నెపంతో మోదీ ప్రభుత్వంవీటిని ఈ మధ్య రద్దు చేసేసింది. దేశానికి తొలివిద్యా శాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ ముస్లిం కావడం, అల్పసంఖ్యాక వర్గాలలో సహజంగా ముస్లింలే అధికంగా ఉంటారు కనకే మోదీ ప్రభుత్వం వీటిని రద్దు చేసినట్టుకనిపిస్తోంది. దేశ జనాభాలో14.2శాతం మంది ముస్లింలు ఉంటే,కళాశాలలు,విశ్వవిద్యాలయాలలో చేరే ముస్లిం విద్యార్థులు 5.5శాతం మాత్రమే ఉన్నారు. దేశ జనాభాలో16.5శాతం ఉన్న షెడ్యూల్డ్ కులాల వారిలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నవారు 14.7 శాతం ఉన్నారు.2019లో ఉన్నత విద్య గురించి నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
అదే కారణమా?..
ప్రభుత్వ గణాంకాల ప్రకారం2018-19లో మౌలానా ఆజాద్ పేరిట నెలకొల్పిన ఉపకార వేత నాలలో1000మంది వినియోగించుకుంటే అందు లో 733 మంది ముస్లింలే కావడం సహజంగానే మోదీ సర్కారుకు అభ్యంతరకరమై ఉండొచ్చు.ఈ ఉపకార వేతనాలను రద్దు చేసినందుకు విద్యా సంస్థల లోపల,వెలుపల తీవ్ర నిరసన వ్యక్తం అవు తోంది.ప్రభుత్వ నిర్ణయం అల్పసంఖ్యాక వర్గాల, ముఖ్యంగా ముస్లింల విద్యావకాశాలను దెబ్బ తీయడానికేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పని గట్టుకుని బీజేపీ ప్రభుత్వం ఈనిర్ణయం తీసు కుందని నిర్ధారణకు రావడానికి ప్రత్యేక పరిశోధన అనవసరం.12వ తేదీన వందలాది మంది విద్యా ర్థులు దిల్లీలో నిరసనకు దిగారు. పోలీసులు వారం దరినీ స్టేషను తీసుకెళ్లి కొన్ని గంటల తరవాత వదిలేశారు. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ,బహుజన సమాజ్ పార్టీకి చెందిన డానీష్ అలీ, మజ్లిస్కు చెందిన ఇంతియాజ్ జలీల్ ఈ అంశాన్ని లేవనెత్తారు. అల్పసంఖ్యాక వర్గాలవారి వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికి 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రాజీం దర్ సచార్ నేతృత్వంలో ఓకమిటీ ఏర్పాటు చేసిం ది.ఈ కమిటీ 2006లో సమర్పించిన నివేదికలో ముస్లింలు సామాజికంగా,విద్యాపరంగా, ఆర్థికం గా ఇతర మతాలవారితో పోలిస్తే బాగా వెనుకబడి ఉన్నారని తేలింది. కొందరు ముస్లింల పరిస్థితి దళితుల కన్నా హీనంగా ఉందని సచార్ కమిటీ పేర్కొంది.మైనారిటీల పరిస్థితి అధ్వానం 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 20 యేండ్లకు పైబడినవారిలో ఏడు శాతం మంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.ముస్లింలలో నాలుగు శాతం మాత్రమే ఉన్నారని సచార్ కమిటీ నివేదిక ఆందోళ న వ్యక్తం చేసింది. అవకాశాలు తక్కువగా ఉన్న ఇతర వర్గాలవారితో పోల్చి చూసినా ముస్లింల పరిస్థితి అధ్వానంగా ఉందనివివరించింది.ఆ కమి టీ సిఫారసుల పర్యవసానంగానే మౌలానా ఆజాద్ జాతీయ ఉపకార వేతనాల పథకం అమలులోకి వచ్చింది.ఇది ముస్లింలకేకాక అల్పసంఖ్యాక మతా లవారందరికీ వర్తిస్తుంది. మైనారిటీ విద్యార్థులు ఒకటికన్నా ఎక్కువ ఉపకార వేతనాలు అందు కుంటున్నందున మౌలానా ఆజాద్ పథకాన్ని రద్దు చేస్తున్నామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రకటిం చారు.విద్యార్థులకు వివిధ పథకాల కింద ప్రయో జనం పొందే అవకాశంఉన్నా ఒక ఉపకార వేత నం మాత్రమే అందిస్తున్నారు. మౌలానా ఆజాద్ పథకాన్ని ఎక్కువగా వినియోగించుకుంటున్నది పీహెచ్‌ఎ పరిశోధక విద్యార్థులే. వారికి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే, ఇది ప్రతిభ ఉన్నవారికే వర్తిస్తుంది. మౌలానా ఆజాద్‌పథకం రద్దు చేశారు గనక ఇతర మైనారిటీ వర్గాలవారు పరిశోధనలు కొనసాగించే అవకాశం మందగిస్తుంది. పరిశోధన మీద ఆసక్తి ఉన్నవారికి ఉపకార వేతనాలు అందితే ఉద్యోగావ కాశాలను కూడా వదులుకుని ఉన్నత విద్య కొనసా గించగలుగుతారు.లేకపోతే ఉన్నత విద్య కొన సాగించగలుగుతారు. లేకపోతే ఉన్నత విద్య ఆర్థిక స్థోమత ఉన్నవారికే పరిమితం అవుతుంది. క్రమక్రమంగా అమలు చేసిమౌలానా ఆజాద్ పథకం రద్దుచేయక ముందుకూడా యూజీసీ ఈ పథకం కింద దరఖాస్తులు ఆహ్వానించడాన్ని తగ్గించింది.ఈ పథకం కింద ఆఖరుసారి దరఖా స్తులు ఆహ్వానించింది 2018లోనే. 2020 మార్చి లోక్సభలో ప్రశ్న అడిగితే అప్పటి మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖార్ అబ్బాస్ నఖ్వీ ‘మార్గదర్శకాలు ఖరారు చేస్తున్నాం’అని చెప్పి తప్పించుకున్నారు.‘జాతినిర్మాణం’ ‘జాతీయ భద్రత’ పేర పౌరసత్వ సవరణచట్టం (సీఏఏ) లాంటి వాటి ద్వారా ఇదివరకే ముస్లింలను అణగదొక్కడం కొనసాగుతూనే ఉంది. విద్యారంగంలో, ముఖ్యం గా ఉన్నత విద్యారంగంలో అనేక కారణాలతో ముస్లింలు ఇప్పటికే షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు జాతుల వారికన్నా ఎక్కువగా వెనుకబడి పోయారు. అలాంటప్పుడు ఉన్న పథకాలను కూడా రద్దు చేస్తుంటే ముస్లిం వెనుకబాటుతనం మరింత పెరు గక తప్పదు.2.76శాతం మంది ముస్లింలే ఉన్నత విద్యఅభ్యసించగలుగుతున్నారు. ఇప్పటికే పరాయి వారుగా మారిపోయిన వారిని మిగతా సమాజా నికి మరింత దూరంచేసే కుట్ర జరగడం దురదృష్ట కరం.(వ్యాసకర్త : ఓయూ, హైదరాబాద్)
సంక్షోభంలో వసతి గృహాలు
‘సిబ్బంది కొరత, అధికారుల పర్యవేక్షణ లోపం, శిధిలావస్థలో ఉన్న భవనాలు అనేక చోట్ల దర్శన మిచ్చాయి. సిబ్బంది లేకపోవడంతో అధ్యాపకులే అన్ని పనులు చేయాల్సిన దుస్థితి. ప్రభుత్వం ఒక విద్యార్థికి ఇచ్చే 30 రూపాయలలో గ్యాస్, మ్యాన్ పవర్ కోసం 8 రూపాయలు ఖర్చవుతున్నాయి. మిగిలిన 22 రూపాయలతో టిఫిన్, లంచ్, స్నాక్స్, డిన్నర్,రెండుసార్లు టీ, వారానికి రెండుసార్లు నాన్ వెజ్,ఐదు రోజులు ఎగ్ ఇవ్వాలి.ఇది సాధ్యం కాక నిర్వాహకులు తక్కువ రేటు ఉన్న కూరగాయలతో చేసిన కూరలు,నీళ్లపప్పు,పురుగుల అన్నం పెడుతు న్నారు.పరిశుభ్రత లేనికిచెన్,రాత్రి మిగిలిన పదా ర్థాలు పొద్దున వాడుతున్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం సంక్షేమహాస్టళ్లలో సమూల మార్పులు చేయాలి.’ పేద బడుగు బలహీనవర్గాల విద్యార్థులు ఆర్థిక వెనుకబాటు కారణంగా విద్యకు దూరం కాకూడదనే ఉన్నత ఆలోచనతో రూపొందించిన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు నిర్లక్ష్యానికి గురవు తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వాటిని నరకకూ పాలుగా మారుస్తోంది. గ్రామీణ విద్యార్థుల బంగా రు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, గురుకుల, మైనారిటీ వసతి గృహాలు సంక్షేమానికి దూరమై సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలే ఇందుకు నిదర్శనం. స్వరా ష్ట్రంలో విద్యా రంగానికి పెద్దపీట వేస్తారని కేజీ నుంచి పీజీ వరకు అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తారని తెలంగాణ సమాజం ఆశించినా అది కార్యరూపం దాల్చకపోగా, మరిం త నిర్వీర్యమైంది. పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందక, కనీస మౌలిక సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వసతిగృహలకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం, వార్డెన్, వంట మనుషులు,ఇతర సిబ్బంది నియామకాలు చేపట్టక పోవడం,సరైన సమయంలో దుప్పట్లు,బట్టలు ఇతర వస్తువులు అందించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
హామీని విస్మరించి..
కేజీ టూ పీజీ మిషన్లో భాగంగా దళిత, గిరిజన, బహుజన విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందించడానికి గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటనలు గుప్పించారు. ప్రచార అర్బాటాలతో గురుకులాల ఏర్పాటు చేశారు. వాటి అభివృద్ధిని మాత్రం అటకెక్కించారు. సరిపడా నిధులను కేటాయించలేదు. పక్కా భవనాలు నిర్మిం చలేదు. ఖాయిలా పడిన ఇంజనీరింగ్ కళాశాలు, ఇతర కళాశాల భవనాలను కోట్ల రూపాయలతో అద్దెకు తీసుకుని గురుకులాలను నడిపిస్తున్నారు. హైదరాబాద్ మహా నగరంలో సరూర్ నగర్, ఇతర అనేక ప్రాంతాలలో అపార్ట్మెంట్లలో నిర్వహి స్తున్నారంటే పరిస్థితి గురుకులాలు ఎలా ఉందో అవగతమవు తుంది.అద్దెచెల్లింపులలోనూ ఎలాంటి ప్రామాణికత, నియమ నిబంధనలు లేకపోవడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేమి, సిబ్బంది తప్పిదాలు, నాణ్యతలేని,గడువు ముగిసిన సరుకులతో తయారు చేసిన ఆహారం విషపూరితం కావడం వంటి ఘట నలు జరిగి విద్యార్థులు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రులలోచేరుతున్నారు. అయినా ప్రభుత్వం బాధ్యులపై చర్యలకు ఉపక్రమించడం లేదు.
ఇప్పటికీ దొడ్డు బియ్యమే..
వసతిగృహాలతో పాటు,పాఠశాల మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం అందిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి మనువడు తినే భోజనానికి సమంగా హాస్టల్ విద్యార్థుల భోజనం ఉంటుందని ఊకదంపుడుఉపన్యాసలిచ్చారు. కొద్ది రోజులే సన్న బియ్యం పంపించి, తరువాత పురుగులతో కూడినముక్క పట్టిన దొడ్డు బియ్యమే సరఫరా చేస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆదిలాబాద్ సరూర్నగర్,సిదిపేట,వరంగల్. నిర్మల్,గద్వాల సహా పలు జిల్లాలలో కలుషిత నీరు తాగలేమని,పురుగులతో కూడిన భోజనం తినలే మని బాలికలు రోదిస్తూ రోడ్లపైకి వచ్చారు. జగి త్యాల, సిద్ధిపేట, భూపాలపల్లి సహా పలు హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.గౌలిదొడ్డి గురుకులంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం, బాసర ట్రిపుల్ ఐటీ సహా పలు వసతిగృహాల భవనాల పెచ్చులూడి విద్యార్థు లకు గాయాలవ్వడం, ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ కిచెన్లో పాము కాటుతో సిబ్బంది మృతి చెందడం, ఆలేరు మైనారిటీ హాస్టల్లో విద్యార్థి నులపై లైంగిక వేధింపులు ఇలా అనేక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. హాస్టల్స్ అంటేనే విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన చెందే పరిస్థితి దాపురించింది.
ఎందుకీ నిర్లక్ష్యం?…
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 2,500 గురుకుల సంక్షేమ వసతి గృహాలలో ఐదు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న పేద విద్యార్థుల విషయంలో ప్రభు త్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందనేది అంతు చిక్కనిప్రశ్న.ఈ నేపథ్యంలో ఏబీవీపీ బృం దం వసతిగృహాల సందర్శించింది. సిబ్బంది కొరత,అధికారుల పర్యవేక్షణ లోపం,శిధిలా వస్థలో ఉన్న భవనాలు అనేకచోట్ల దర్శన మిచ్చాయి. సిబ్బంది లేకపోవడంతో అధ్యాపకులే అన్ని పనులు చేయాల్సిన దుస్థితి. ప్రభుత్వం ఒక విద్యార్థికి ఇచ్చే 30రూపాయలలో గ్యాస్, మ్యాన్ పవర్ కోసం 8 రూపాయలు ఖర్చవుతున్నాయి.మిగిలిన 22 రూపాయలతో టిఫిన్,లంచ్, స్నాక్స్, డిన్నర్, రెండు సార్లు టీ,వారానికి రెండుసార్లు నాన్ వెజ్, ఐదు రోజులుఎగ్ ఇవ్వాలి. ఇది సాధ్యం కాక నిర్వాహ కులు తక్కువ రేటు ఉన్న కూరగాయలతో చేసిన కూరలు, నీళ్ల పప్పు, పురుగుల అన్నం పెడుతు న్నారు. పరిశుభ్రత లేని కిచెన్, రాత్రి మిగిలిన పదార్థాలు పొద్దున వాడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలో సమూల మార్పులు చేయాలి. ఖాళీగా ఉన్న సిబ్బంది నియామకాలు చేపట్టాలి. తగిన వసతుల కోసం సరిపడా నిధులు కేటాయించాలి.శానిటరీ అధికారులు నిత్యం పర్య వేక్షించాలి.పక్కా భవనాలు నిర్మించాలి.మెస్ చార్జీలు పెంచాలి.
`(వ్యాసకర్త: పీడీఎస్‌ఎఫ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు)-(ఎం.వి.బాబు)