ఇక నుంచి దేశవ్యాప్తంగా ఒకే బ్రాండ్‌ ఎరువులు

వన్‌ నేషన్‌-వన్‌ ఫెర్టిలైజర్‌ విధానంలో భాగంగా అక్టోబర్‌ నుంచి దేశం మొత్తం ఒకే రకమైన బ్రాండ్‌ ఎరువులను కేంద్రం సరఫరా చేయనున్నది. ఈ మేరకు వచ్చేనెల 15 నుంచి పాత బ్రాండ్స్‌ సంచులకు ఆర్డర్‌ ఇవ్వొద్దని ఎరువుల కంపెనీలను ఆదేశించింది. ఇప్పటికే ఉన్న పాత సంచులను డిసెంబర్‌ 31 లోపు మార్కెట్ల నుంచి ఉపసంహరించుకోవాలని ఆదేశించింది.
ప్రస్తుతం యూరియా,డీఏపీ, ఎం వోపీ,ఎన్‌పీకే తదితర ఎరువులను వేరువేరు కంపెనీలు వేరువేరు పేర్లతో విక్రయిస్తున్నాయి. ఈనేపథ్యంలో వన్‌నేషన్‌-వన్‌ఫెర్టిలైజర్‌ విధా నంలో భాగంగా దేశం మొత్తం ‘ప్రధాన మంత్రి భారతీయ జన్‌ ఉర్వారక్‌ పరియోజన’ బ్రాండ్‌ పేరుతో విక్రయించాలని నిర్ణయించింది. అన్ని ఎరువులు కూడా ఇదే బ్రాండ్‌పై మార్కెట్లో అందు బాటులో ఉంటాయి. ఇక ప్రధానమంత్రి కిసాన్‌ సమృద్ధి కేంద్ర పేరుతో ఎరువుల షాపుల రూపు రేఖలు మారుస్తున్నారు..
బ్రాండ్‌…భారత్‌ .. ఒకే దేశం.. ఒకటే ఎరువు..
ఒకే దేశం-ఒకటే ఎరువు నినాదంతో కేంద్రసర్కార్‌?రసాయన ఎరువులు అమ్మే ప్రైవేటు కంపెనీల ఆగడాలకు అడ్డుకట్ట వేయబో తోంది.డీఏపీ,యూరియా వంటి ఎరువులను భారత్‌ డీఏపీ, భారత్‌ యూరియా పేరుతో విక్రయించాలని నిబంధన పెట్టింది. ఈపథకాన్ని ఆగస్టు 15 నుంచి దేశంలోని కొన్నిప్రాంతాల్లో అమల్లోకి తీసు కొచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. రసాయన ఎరువుల అమ్మకాల్లో ప్రైవేటు కంపెనీల గుత్తాధి పత్యానికి అడ్డుకట్ట పడబోతోంది. కృత్రిమ కొరత సృష్టించే సంస్థల ఎత్తుగడలను అడ్డుకునేందుకు కేంద్రం కొత్త పథకానికి రూపకల్పన చేసింది. దీనిని ప్రాథమికంగా ‘ప్రధానమంత్రి భారతీయ జనఉర్వారిక్‌ పరియోజన’ అనే పేరుతో పిలుస్తున్నారు. ఇకపై ‘ఒక దేశం-ఒకటే ఎరువు’ నినాదంతో డీఏపీ, యూరియాలను ఒకే బ్రాండ్‌ పేరుతో అమ్మాలని కేంద్రం అన్ని కంపెనీలకు నిబంధన పెట్టనుంది. భారత్‌ డీఏపీ, భారత్‌ యూరియా పేరుతో ఈ రెండు ఎరువులను కంపెనీలు మార్కెట్‌లో రైతులకు విక్రయించాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని ఆగస్టు 15 నుంచి దేశంలో కొన్ని ప్రాంతాల్లో అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అమలు ఇలా..
కేంద్ర ఎరువుల శాఖ సూచనల ప్రకా రం ఇకపై అన్ని కంపెనీలు తయారుచేసే బస్తాలపై ఒకటే లోగో ఉంటుంది. పక్కన ‘ప్రధానమంత్రి భారతీయ జనఉర్వారిక్‌ పరియోజన’ అని పథకం పేరు ఉంటుంది. దానికింద ‘భారత్‌ యూరియా’ అనే బ్రాండు పేరు,దాని తయారీ,మార్కెటింగ్‌ కంపెనీ పేరు ముద్రిస్తారు.మొత్తం 16 భారతీయ భాషల్లో‘భారత్‌ యూరియా’అనే పేరు ఉం టుంది. కేంద్రం ఇచ్చే రాయితీ వివరాలూ బస్తా లపై ఉంటాయి. ఈ పథకం అమలుకు చేపట్టా ల్సిన చర్యలపైఈనెల నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఎరువులకంపెనీలు,రాష్ట్రవ్యవసాయ శాఖల అధి కారులతో ఆన్‌లైన్‌లో చర్చించాలని కేంద్ర ఎరు వుల శాఖ నిర్ణయించింది. అనంతరం ఎరువుల నియంత్రణచట్టంకింద నోటిఫికేషన్‌జారీ చేస్తారు. దీని అమలుకు కంపెనీలు,వ్యాపారులు,కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతుల్లో అవగాహన కల్పిస్తారు. సోషల్‌ మీడియాలో ఈ పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని కేంద్రం నిర్ణ యించింది.ఇవీ ప్రయోజనాలు..కొత్త పథకం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని కేంద్రం అంచనా వేస్తోంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 కంపెనీలు 31 ప్లాంట్లలో యూరియాను ఉత్పత్తి చేస్తూ వివిధ బ్రాండ్ల పేర్లతో రైతులకు అమ్ముతున్నాయి. మరో 3 ప్రభుత్వ వాణిజ్య సంస్థలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి.15కంపెనీలు డీఏపీ,ఇతర కాంప్లెక్స్‌ ఎరువులను తయారు చేస్తున్నాయి. దేశీయంగా 45 కిలోల యూరియా బస్తా ఉత్పత్తి వ్యయం రూ.1,350 కాగా రైతుకు రూ.266.50కి విక్రయిస్తున్నారు.మిగిలిన రూ. 1083.50 కేంద్రం రాయితీగా భరించి ఎరువుల కంపెనీలకు చెల్లిస్తోంది. విదేశాల నుంచి దిగు మతి చేసుకున్న యూరియా బస్తా రూ.2,433 కాగా అందులో రూ.2166.50 కేంద్రం రాయి తీగా భరిస్తోంది. ఏకంగా 90శాతం సొమ్మును కేంద్రం రాయితీ రూపంలో భరిస్తుంటే కంపెనీలు సొంత బ్రాండ్‌ పేరుతో అమ్ముకోవడం ఏంటన్నది కేంద్రం వాదన. పైగా యూరియాలో ఉండే రసా యనం నత్రజని ఒకటే అయితే తమ కంపెనీ యూరియా వాడితే అధికదిగుబడి వస్తుందని కొన్ని కంపెనీలు రైతులను పక్కదారిపట్టిస్తున్నాయి. దీనివల్ల ఆబ్రాండ్‌ మార్కెట్‌లో లేకపోతే యూరి యా కొరత ఉందని రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నా లు చేస్తున్నారు. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ‘భారత్‌ యూరియా, భారత్‌ డీఏపీ’ అంటూ ఒకటే బ్రాండు పేరుతో అమ్మాలనేది ఈ పథకం లక్ష్యం. దీనివల్ల రూ.3వేల కోట్ల వరకూ రవాణా వ్యయం ఆదా అవుతుందని కేంద్రం భావిస్తోంది.
నూతన ఎరువుల విధానం ఎందుకోసం ?
కేంద్ర ప్రభుత్వం ఆగష్టు 24న నూతన ఎరువుల విధానం ప్రకటించింది. ‘’ఒకే దేశం-ఒకే ఎరువు’’నినాదంతో2.10.2022 నుండి మార్కెట్‌లో భారత్‌ బ్రాండ్‌ ఒక్కటే ఉండాలని నిర్ణయించింది. దీనిని ‘ప్రధానమంత్రి భారతీయ జన్‌ ఉర్వరక్‌ పరి యోజన’ పథకంగా ప్రకటిం చింది.ఈ పథకం ప్రకారం దేశంలోని ఏ ఎరువుల కంపెనీ అయినా భారత్‌ యూరియా,భారత్‌ డి.ఎ. పి,భారత్‌ యం.ఓ.పి భారత్‌ ఎన్‌.పి.కె పేర్లతో అమ్మాలి. ఎరువుల సంచులపై మూడిరట రెండు వంతుల భాగంలో ఎరువుల పేరుతో పాటు పథ కంపేరు ప్రముఖంగా ముద్రించాలి. కంపెనీ పేరు మిగిలిన వివరాలన్నీ మూడిరట ఒకవంతు భాగం లోనే ఉండాలి. 15.9.2022 నుండి కొత్త సంచు లు వినియోగించాలని, పాత సంచులు డిసెంబరు 31 అనంతరం వాడరాదని ఎరువుల కంపెనీలకు మెమో ఇచ్చింది. ఈ పథకం వల్ల రైతులకు గాని, కంపెనీలకుగాని ఒనగూడే ప్రయోజనం ఏమీ లేదు. గత ఏడాది సకాలంలో ఎరువులు సరఫరా కాలేదు. రైతులు బ్లాక్‌ మార్కెట్‌లో కొనుగోలు చేసుకోవాల్సి వచ్చింది. రైతులకు ఎరువులు అందని విషయాన్ని పార్లమెంటరీస్థాయీ సంఘమే చెప్పిం ది. రూ.267 అమ్మాల్సిన యూరియా రూ.430కు అమ్మినట్లు వార్తలువచ్చాయి.హెచ్చు ధరతో అమ్మ డంతోపాటు ఎరువుల వ్యాపారులు రైతులకు అవసరమైన ఎరువు ఇవ్వాలంటే …తక్షణం అవస రం లేని ఇతర ఎరువులను లేదా క్రిమిసంహారక మందులను కొంటేనే అవసరమైన ఎరువులు ఇచ్చారనిస్థాయీ సంఘం దృష్టికి వచ్చినట్లు పేర్కొం ది. 2021-22బడ్జెట్‌ కన్నా 2022-23 బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీ కేటాయింపులను భారీగా తగ్గిం చడంపై స్థాయీసంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఫెర్టిలైజర్‌ కంట్రోల్‌ ఆర్డర్‌-1985 ప్రకారం ఎరు వుల సరఫరాలో, అమ్మకాలలో జరుగుతున్న అవక తవకలను అరికట్టాలి. సంబంధించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అయిన ప్పటికీ ఫెర్టిలైజర్‌ కంట్రోల్‌ ఆర్డర్‌ నిబంధనలకు విరుద్ధంగా ఎరువుల నిల్వలన్నీ ఎన్నికలు జరుగు తున్న ఉత్తరప్రదేశ్‌కు తరలి వెళ్ళాయని పత్రికలలో వార్తలు వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విధా నంలో…’ఫెర్టిలైజర్‌ కంట్రోల్‌ ఆర్డర్‌-85’ను సక్ర మంగా అమలు చేయడం గురించిగాని, బ్లాక్‌ మార్కెట్టును అరికట్టేచర్యల గురించి గాని, అవస రానికి అనుగుణంగా బడ్జెట్‌లో నిధులు కేటాయిం చే అంశం గాని లేకుండా…’ఒకే దేశం ఒకే ఎరువు’ నినాదం ఎవరి ప్రయోజనం కోసమో ఏలిన వారికే తెలియాలి. మన దేశం స్వాతంత్య్రం పొందేనాటికి తీవ్రమైన ఆహార కొరత ఉంది. ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునే స్థితిలో ఉంది. ఆహారధాన్యాలు పండిరచడానికి భూమితో పాటు నీరు, ఎరువులు, విత్తనం అవసరం. ఆనాటికి దేశంలో ఒకే ఒక్క ఎరువుల కంపెనీ ఉన్నది. ప్రభుత్వ రంగంలో ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఎసిటి) మాత్రమే ఉన్నది. స్వాతంత్య్రం అనం తరం ప్రణాళికా విధానంలో భాగంగా ప్రభుత్వ రంగం లోనూ సహకార రంగంలోనూ పది ఎరు వుల కర్మాగారాలు నెలకొన్నాయి. ప్రభుత్వ రంగం లోని రాష్ట్రీయ ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ‘’మణి రత్నం’’గా ప్రఖ్యాతి గాంచింది. ఎరువుల తయారికీ అవసరమైన నైట్రోజన్‌, ఫాస్పరస్‌, పొటాష్‌ మూడు ప్రధానమైన ముడి పదార్థాలు. ఈ మూడూ నేటికీ 90శాతం దిగుమతి చేసుకోవాల్సిన స్థితిలోనే ఉన్నాయి. ఈకాలంలో క్రమంగా ఎరువుల రంగం లో ప్రయివేటు పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. కాంప్లెక్స్‌ ఎరువులకు మిక్సింగ్‌ ప్లాంట్లు వచ్చాయి. ఈ ప్లాంట్లు దిగుమతి చేసుకున్న సందర్భంలోనూ మిక్సింగ్‌ చేసిన సందర్భంలోనూ రెండుసార్లు సబ్సి డీ పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కాలం లో ఎరువులకు అవసరమైన ముడి సరుకుల దిగు మతి,ఎరువుల తయారీ,పంపిణీ,ఎరువుల ధరలు వంటి సమస్యలు ముందుకు వచ్చాయి. ఈ సమ స్యల పరిష్కారానికి సూచనలు చేయడం కోసం డజనుకు పైగా ఎక్స్‌పర్ట్‌ కమిటీలను వేశారు. ఈ క్రమంలోనే ఫెర్టిలైజర్‌ కంట్రోలు ఆర్డరు, ఎరువుల ధరల నియంత్రణచట్టం,ఎరువుల పంపిణీ విధా నం,సబ్సిడీల విధానాలు రూపొందాయి.సరళీకరణ విధానాల నేపథ్యంలోద్వంద్వధరల విధానం, కం ట్రోలు సడలింపులు వంటి ప్రయోగాలు బాగా జరిగాయి. సరళీకరణవిధానాలు అన్ని రంగా లలో వచ్చినా ఆంక్షలు తొలగించని రంగం ఎరు వుల రంగంగా ఉందని పేర్కొన్నారు. అయినా ఎరువుల కొరత సృష్టించడం, బ్లాక్‌ మార్కెట్‌ వంటి సమస్యలు తరచూ వస్తూనే ఉన్నాయి. ఎరువుల రంగంలో ప్రయివేటు రంగం ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వరంగం చిన్నచూపుకు గురవుతూనే ఉన్నది. ఈ కాలంలో ముడి కెమికల్స్‌ కన్నా, శుద్ధి చేసిన కెమికల్స్‌ దిగుమతి లాభసాటిగా మారింది. ప్రయి వేటు కంపెనీల వారు, మిక్సింగ్‌ ప్లాంట్ల వారు, శుద్ధిచేసిన కెమికల్స్‌ను దిగుమతి చేసుకోవడం ప్రారంభించడంతో ఎగుమతి చేసే దేశాలు ఎక్కువ లాభాలు పోగేసుకున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్ధలు అనేక వడిదుడుకులకు గురయ్యాయి. 1997-98 నాటికి ఉత్పత్తి సామర్ధ్యానికి మించి 118శాతంఉత్పత్తి చేసిన ప్రభుత్వ కంపెనీలు… 2009-10 నాటికి 79 శాతం ఉత్పత్తికి, 2014-15 నాటికి 66 శాతం ఉత్పత్తికి తగ్గిపోయాయి. గతనెలలో ప్రభుత్వ రంగంలోని ఎనిమిది ఎరు వుల కర్మాగారాలను ప్రెవేటీకరించడానికి కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించినట్లు వార్తలు వెలు వడ్డా యి. మణిరత్నంగా పేరుగాంచిన రాష్ట్రీయ ఫెర్టి లైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌,నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమి టెడ్‌,ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌, ఫెర్టిలైజర్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, ఎఫ్‌.సి.ఐ ఆరావళి జిప్సమ్‌ అండ్‌ మినరల్స్‌, మద్రాస్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌,హిందుస్తాన్‌ ఫెర్టి లైజర్స్‌ కార్పొరేషన్‌ ఫ్యాక్టరీలు ప్రెవేటుపరం కానున్న జాబితాలో ఉన్నాయి.
ఎరువుల రేట్లపై నియంత్రణ ఎవరిది?
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు’ ఇప్పటికే కుదేలైన వ్యవసాయ రంగంపై పెరిగిన ఎరువుల ధరలు పరిస్థితిని మరింత దిగజారు స్తున్నాయి. పెరిగిన పెట్టుబడులతో పైసా మిగలక రైతులు అప్పులపాలవుతున్న టైమ్‌?లో ఎరువుల ధరల పెరుగుదల రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పెట్టుబడిపై కనీస లాభాన్ని కళ్లజూడలేక పోతున్న రైతులు..ఏడాదికేడాది పెట్టుబడులు పెరుగుతుండడంతో వ్యవసాయాన్ని వదులుకోవాల్సి వస్తోంది. పెట్టుబడికి సరిపోను రుణాలను బ్యాంకు లు ఇవ్వకపోవడంతో రైతులు తప్పని స్థితిలో ప్రైవేటుగా ఎక్కువ వడ్డీకి తెచ్చి అప్పుల ఊబిలోకి జారుకుంటున్నారు.అవిభారమై చాలామంది ప్రాణా లు తీసుకుంటున్నారు. ఇందులో 60 శాతం మంది కౌలు రైతులుంటున్నట్టు ఎన్‌సీఆర్‌బీరిపోర్టు చెబుతోంది.
మన దేశంలో తయారీపై దృష్టేది?
వ్యవసాయ ఆధారితమైన మన దేశం లో ఇంకా ఎరువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దేశంలో సగటున ఎకరాకు 75 కిలోల ఎరువులు వాడుతున్నాం. ఇతర దేశాల్లో ఎకరాకు200కిలోలు వాడుతున్నట్టు లెక్కలు చెబుతు న్నాయి. సేంద్రియ ఎరువుల వాడకంతో కలిపి రసాయన ఎరువుల వాడకంపెంచడం ద్వారా ఉత్పాదకతను పెంచుకోవచ్చు.గత పదేండ్లుగా దేశం లో వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల స్థిరంగానే ఉంది. 2021-22లోకోటి టన్నుల ఉత్పత్తి పెరగ డంతో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 30.16 కోట్ల టన్నులకు పెరిగింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక ఉత్పత్తి. మిగిలిన పంటల ఉత్పత్తిలో పెద్దగా పెరుగుదల లేదు. వీటితోపాటు మరో రూ.3లక్షల కోట్ల విలువైన నూనెలు, పంచదార, పప్పులు, పత్తిని దిగుమతి చేసుకున్నాం.
రేట్లపై నియంత్రణ ఎవరిది?
మన దేశానికి ఎరువుల్ని దిగుమతి చేసే దేశాలులాబీగా ఏర్పడి రేట్లు, డిమాండ్‌?ను కం ట్రోల్‌? చేస్తున్నాయి. దీంతో మనం తీవ్రంగా నష్ట పోతున్నాం. చివరకు క్రిమిసంహారక మందులు, బయోపెస్టిసైడ్స్‌, బయో ఫెర్టిలైజర్స్‌ తోపాటు వాటి తయారీ టెక్నాలజీని కూడా దిగుమతి చేసుకుం టున్నాం. దీంతో ఇండియా విదేశీ మారకద్ర వ్యాన్ని కూడా కోల్పోతున్నది.కాంప్లెక్స్‌ ఎరువుల కంపెనీలు ధరలు ఇష్టానుసారం పెంచుకోవడానికి చట్టం ఒప్పు కోదు. ప్రతి ఎరువు ధరను కేంద్రం నిర్ణయిం చాల్సిందే. కానీ ఇటీవల కంపెనీలు, వ్యాపారులు ధరలు పెంచుకోవడంతో రైతులు గతంలోకంటే ఎక్కువ మొత్తం ఖర్చుచేయాల్సి వస్తోంది.
తయారీని ప్రోత్సహించాలె
రైతుల పెట్టుబడిని తగ్గించడంలో ఎరు వుల ధరలు కీలకం. ఎరువులు, ఉపకరణాల ధర లు పెంచి 2022లో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నహామీని కేంద్రం ఎలా నిలబెట్టుకుంటుం దో చూడాలి. ప్రస్తుత పరిస్థితిలో రైతుల పెట్టుబడిని తగ్గించడం కేంద్రంపై ఉన్న ప్రధాన బాధ్యత. ఆ దిశగా చర్యలు తీసుకుంటేనే రైతులు సక్రమంగా వ్యవసాయం చేయగలుగుతారు. ఎరువుల ధరల నియంత్రణ మన చేతుల్లో ఉండాలంటే ఇప్పటికైనా స్వదేశంలో తయారీని ప్రోత్సహించాలి. భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు ఎరువుల వాడకం మోతాదును తెలియజెప్పాలి.ఎరువుల ధరలు, సప్లయ్‌,వాడకంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఓ ప్లాన్‌?తో ముందుకెళ్లాలి. ప్రస్తుత పరిస్థితి నుంచి రైతు గట్టెక్కాలంటూ వెంటనే ఎరువుల ధరల్ని తగ్గించాలి.
తగ్గిన సబ్సిడీ..
`2022-23ఏడాది మినహా పెరుగుతున్న బడ్జె ట్‌కు అనుగుణంగా,డాలర్‌ విలువ పెరుగు దలను లెక్కలోకి తీసుకుని ఎరువుల సబ్సిడీని కేంద్రం పెంచలేదు. గత ఏప్రిల్‌లో 58 శాతం పెంచిన ఎరువుల ధరలు ఆందోళన ఫలితంగా తగ్గిం చినప్పటికీ తిరిగి వ్యాపారులు సబ్సిడీ తగ్గిందన్న పేరుతో ధరలు విపరీతంగా పెంచారు. పెంచిన ధరలపై కేంద్రం స్పందించకపోవడంతో చాలా కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులను ముంచేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నత్రజని, భాస్వరం,పొటాష్‌ ఎరువుల వాడకం 272.28 లక్షల టన్నులు.ఇందులో పొటాష్‌ వాడకం 26.80 లక్షల టన్నులు. ఇది పూర్తిగా 100 శాతం దిగుమతి చేసుకోవాల్సింది. యూరియా, డీఏపీ కూడా దిగుమతి అవుతోంది. దిగుమతి చేసుకున్న యూరియాపై2021-22లో రూ.53,619 కోట్లు సబ్సిడీని కేంద్రం చెల్లించింది. భాస్వరం, పొటాష్‌కు రూ.26,335 కోట్లు సబ్సిడీ ఇచ్చారు.
కేంద్రం తగ్గించినా..
కిందటి ఏడాది పెంచిన ధరలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో కేంద్రం వాటిని తాత్కాలికంగా పెండిరగ్‌లో పెట్టింది. 2022 జనవరి10వరకు పాత ధరలే ఉంటాయని చెప్పింది. కానీ కాంప్లెక్స్‌ ఎరువుల తయారీ కంపె నీలు అప్పటికే కేంద్రం ప్రతిపాదించిన ధరలను ఇంకాస్త పెంచి అమల్లోకి తీసుకొచ్చాయి. కేంద్రం తమకిచ్చే సబ్సిడీని తగ్గించడం వల్లే ధరలు పెం చాల్సి వచ్చిందని ప్రచారం చేసుకున్నాయి. ఈ రేట్ల కట్టడికి కేంద్రం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. సాధారణంగా కాంప్లెక్స్‌ ఎరువుల తయారీ కం పెనీలకు కేంద్రం సబ్సిడీలు ఇస్తుంది. కానీ కంపె నీలు షార్టేజ్‌ సృష్టించి బ్లాక్‌ లో అమ్మి రైతులకు రాయితీని దూరం చేశాయి.ఒకవైపు పెరిగిన ధరలు, మరోవైపు సబ్బిడీ అందక రైతులు నష్ట పోయారు. –వ్యాసకర్త : ఎ.పి రైతుసంఘం సీనియర్‌ నాయకులు