ఆహార అభద్రతలో ఆదివాసీలు

ఆహార భద్రత ప్రధాన లక్షణంగా జీవించే స్వయం సమృద్ధ ఆదివాసీ జీవన విధానంలోకి వాణిజ్య పంటలను చొప్పించడం ఎంత వరకు సమంజసం? గిరిజన జీవన శైలిలో అన్నిటికన్నా నాకు నచ్చిన విషయం వారికి డబ్బు సంపాదించాలనే యావ, ఆధునిక సౌకర్యాల పైన మోజు లేకపోవడం. తినడానికి కావలసినంత కష్టపడటం, తర్వాతంతా కావలసినంత తీరిక. రంప చోడవరం ఏజెన్సీలోని కొండరెడ్లేతోనే కాదు, నా పనిలో భాగంగా నల్లమల లోని చెంచు లతో, ఆదిలాబాద్‌ లోని గోండులతో, జార్ఖండ్‌లోని ముండా తెగ వారితో,పశ్చిమ బెంగాల్‌ లోని సంథాల్‌ లతో ఇలా ఎన్నో గిరిజన తెగల వారితో పని చేయడం జరిగింది. ఈ అన్ని ప్రాంతాలలోను నేను గమనించింది ఒకటే. అభివృద్ధి, నాగరికతల పేరుతో జరుగుతున్న గిరిజనుల సంత ృప్తికరమైన, స్వయం సమృద్ధమైన జీవితాల విధ్వంసం. ఆదివాసీ సంస్కృతి పై, వనరులపై జరిగే మరోదాడి పర్యాటకం అనే రూపంలో కూడా కొనసాగడం నేను గమనిం చిన మరొక అంశం. పశ్చిమ బెంగాల్‌ లోని భీర్‌భమ్‌ జిల్లాలోని బోల్‌పూర్‌ (ఇక్కడే రవీంద్రుని శాంతినికేతన్‌, ప్రస్తుత విశ్వ భారతి యూనివర్సిటీ ఉంది) దగ్గర ఒక సంతాల్‌ గిరిజన గ్రామాన్ని గతంలో నేను సందర్శించడం జరిగింది. గిరిజనుల సంస్క ృతి సంప్రదాయాలలోని విభిన్నతను, వైవిధ్యాన్ని నాగరీకులకు తెలియచేయాలనే ఉద్దేశ్యంతోఆ రాష్ట్ర పర్యాటక శాఖ ఆ గ్రామాన్ని రూరల్‌ టూరిజం (గ్రామీణ పర్యాటక) కేంద్రంగా మార్చింది. పర్యాటకులు అక్కడ బస చేసేందుకు కాటేజ్‌ లు నిర్మించి, అక్కడి ఆదివాసీలలో కొందరికి గైడ్లుగా శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకుంది. శాంతినికేతన్‌ కు వచ్చే పర్యాటకులు అక్కడికి కేవలం మూడు నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో పచ్చటి అడవిలో ఉన్న ఈ గ్రామంలో విడిది చేయడం, కాలుష్యానికి కల్మషానికి దూరంగా ప్రశాంతంగా ఉన్న ఆ గిరిజన గ్రామాన్ని చెత్త, కాలుష్యంతో నింపేయడం తప్ప ఈ పర్యాటక కేంద్ర హోదా వల్ల ఆ ఆదివాసీలకు ఒరిగిందేమీ లేదు. కొంచెం బియ్యం, కారం దొంగతనం చేశాడనే ఆరోపణపై ఇటీవల కేరళలో కొట్టి చంపబడిన ఆదివాసీ యువకుడు మధు ఉదంతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ప్రధాన, సామాజిక మీడియాలలో విస్త ృతంగా చర్చించబడ్డ ఈ సంఘటన నిజంగానే ఒక దారుణం. మానవత్వాన్నే ప్రశ్నార్థకంగా మార్చిన దురెటన. ఎవరైతే మధుని కొట్టి చంపారో ఆ గుంపులోని వ్యక్తులే ఆ సంఘటనను చిత్రీకరించి సోషల్‌ మీడియా లో పోస్ట్‌ చేయడంతో ఈ విషయం వెంటనే వెలుగులోకి వచ్చింది కానీ నిజానికి ఈ మధు ఒంటరి వాడు కాదు. ఆదివాసీలపై ఇటువంటి వివక్ష, దాడులు కొత్త కూడా కాదు.కొన్ని సంవత్సరాల క్రితం గిరిజనులకు సంబంధించిన ఒక అధ్యయనంలో భాగంగా సుబ్బారావు గారనే ఒక గిరిజన వైద్యుడితో మాట్లాడటం జరిగింది. రంపచోడవరం ఏజెన్సీలోని ఒక చిన్న గిరిజన గ్రామం ఈయనది. ఆ ఏజెన్సీ లో ప్రతి చెట్టు, ఆకు, కొమ్మ, కాండం అన్నీ ఆయనకు తెలుసు. దేనిలో ఏ ఔషధ విలువలు ఉన్నాయో ఏ చెట్టులో ఏ భాగాన్ని ఎటువంటి వైద్యానికి వాడాలో ఆయనకు వారసత్వంగా వచ్చిన విద్య. అక్కడి కొండ రెడ్ల జీవితం అడవితో ఎలా పెనవేసుకుని ఉంటుందో ఎంతో చక్కగా వివరించారాయన. కలపేతర అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని దగ్గరలో ఉన్న వారపు సంతలో అమ్ముకోవడం, ఉన్న కొద్దిపాటి కొండ పోడు లో వ్యవసాయం చేసుకోవడం అక్కడి గిరిజనుల ప్రధాన జీవనోపాధులు. ఒక ఎకరం కొండ పోడు ఉంటే వరి, కొర్రలు, ఆవాలు, కందులు ఇలాంటివి పదకొండు రకాల పంటలు ఒక ఏడాదిలో పండిస్తారని చెప్పారాయన. ఆ పంటలు, అడవిలో దొరికే పండ్లు, కాయలతో వారికి ఆహార భద్రతకి లోటు ఉండదు అని ఆయన చెబుతుండగానే పెద్ద శబ్దం చేస్తూ రెండు లారీలు కొండవైపుకి వెళ్లడం చూశాం. వాటి నిండా యేవో మొక్కలు ఉన్నట్లు కనపడి అవి ఏమిటి అని అడిగాను ఆయనను. కాఫీ మొక్కలు అని చెప్పారాయన. మా గిరిజనులకు వ్యవసాయం చేయడం తెలియక ఎక్కువ లాభాలు పొందలేక పోతున్నామని మా కొండ పోడు లో ఈ కాఫీ మొక్కలు పెడతారట గవర్నమెంట్‌ వాళ్ళు. వీటితో మాకు లాభాలు బాగా వస్తాయని చెబుతున్నారు అన్నారు ఆయన. మరి మీ ఆహార పంటలు ఏమవుతాయి, అవి లేకపోతే మీరేమి తింటారు? అంటే మీ అందరి లాగా మార్కెట్‌లో కొనుక్కోవాలి ఇక అన్నారు సుబ్బారావు గారు నిట్టూరుస్తూ. ఆహార భద్రత ప్రధాన లక్షణంగా జీవించే స్వయం సమ ృద్ధ జీవన విధానంలోకి వాణిజ్య పంటలను చొప్పించడం ఎంత వరకు సమంజసం అనుకుంటూ తిరిగి వచ్చాను ఆ ఊరి నుండి నేను. వారి జీవన విధానంలో అన్నిటికన్నా నాకు నచ్చిన విషయం వారికి డబ్బు సంపాదించాలనే యావ లేదు. ఆధునిక సౌకర్యాల పైన మోజు లేదు. తినడానికి కావలసినంత కష్టపడటం,తర్వాతంతా కావలసినంత తీరిక.ఈ రంపచోడవరం ఏజెన్సీలోని కొండరెడ్లేతోనే కాదు, నా పనిలో భాగంగా నల్లమల లోని చెంచులతో, ఆదిలా బాద్‌ లోని గోండులతో, జార్ఖాండ్‌లోని ముండా తెగ వారితో, పశ్చిమ బెంగాల్‌ లోని సంథాల్‌ లతో ఇలా ఎన్నో గిరిజన తెగల వారితో పని చేయడం జరిగింది. ఈ అన్ని ప్రాంతాలలోను నేను గమనించింది ఒకటే. అభివృద్ధి, నాగరికతల పేరుతో జరుగుతున్న గిరిజనుల సంత ృప్తికరమైన, స్వయం సమ ృద్ధమైన జీవితాల విధ్వంసం.2001 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 8.10 శాతం ఆదివాసీలు. వీరి ఆవాసాలు అడవులు, కొండ ప్రాంతాలే. పోడు వ్యవసాయం, కలపేతర అటవీ ఉత్పత్తుల సేకరణ వీరి ప్రధాన వృత్తులు. స్వయం సమ ృద్ధ జీవన విధానం, ప్రత్యేకమైన సంస్కృతి సంప్రదాయాలు, తమవైన కట్టుబాట్లు ఆచారాలతో దేశంలోని అనేక గిరిజన తెగలు నాగరిక సమాజానికి దూరంగా జీవనం సాగిస్తున్నారు. వీరి ఆవాసాలు ఉండే ప్రాంతాలు మౌలిక సదుపాయాల కల్పనకు అనుకూలంగా లేకపోవడం, ఆసౌకర్యాల గురించి గట్టిగా ప్రశ్నించే గొంతు గిరిజనులకు కొరవడడంతో ఈనాటికీ అనేక ఆదివాసీ గ్రామాలు త్రాగునీరు, విద్యుత్తు, రవాణా సదుపాయాలు వంటి కనీస మౌలిక వసతులు కూడా కరవై అభివ ృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక విద్య, వైద్యం వంటి సదుపాయాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ మధ్య ఒడిస్సా లో ఒక గిరిజనుడు అంబులెన్సు సదుపాయం అందుబాటులో లేక పక్కన వెక్కి వెక్కి ఏడుస్తున్న కూతురు వెంటరాగా తన భార్య శవాన్ని భుజాన వేసుకుని మైళ్ళ కొద్దీ నడిచిన సంఘటన ప్రతి ఒక్కరికీ బాధ కలిగించింది. ఇక విద్యా సదుపాయాల విషయానికి వస్తే చాలా వరకు గిరిజన గ్రామాలలో పాఠశాలలే లేవు. ఉన్నా వాటిపై పర్యవేక్షణా లోపంతో ఉపాధ్యాయుల లో జవాబుదారీతనం లేదు. ఒకవేళ మంచి టీచర్లు ఉండి బోధన జరిగినా తమ జీవన విధానానికి ఏ మాత్రం సంబం ధంలేని పాఠ్యాంశాలు ఆ గిరిజన బాల బాలికలను అయోమయానికి గురి చేయడం తప్ప వారికి అవసరమైన విద్య, పరిజ్ఞానాన్ని అందివ్వలేకపోతున్నాయి. గిరిజనుల మరొక ప్రధాన సమస్య భూమిపై హక్కు. వ్యవసాయం చేసుకునే భూమిపై పట్టా లేకపోవడం కొందరి సమస్య అయితే భూ రికార్డుల నిర్వహణలో అవకతవకలు, వాటికి తోడు గిరిజనుల పేదరికం, నిరక్షరాస్యతల వల్ల వారి భూములు చాలా వరకు స్వార్ధపరులైన నాగరీకుల చేతులలోకి వెళ్లిపోయాయి. మన తెలంగాణా చరిత్రను ఒక్క సారి చూస్తే 1940లలో ఆదిలాబాద్‌ జిల్లాలో కొమరం భీం నాయక త్వాన గోండు తెగకు చెందిన గిరిజనులు జరిపిన పోరాటం తమ భూమికోసమేఆ భూమిపై హక్కు కోసమే. బ్రిటిష్‌ కాలంలో మెరుగుపడిన రవాణా వ్యవస్థ గిరిజనులు మైదాన ప్రాంతాలకు ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పించినదానికన్నా నాగరీకులు గిరిజన ప్రాంతాలలోకి చొరబడి వారి భూములు, వనరులు లాక్కునేందుకు ఎక్కువ అవకాశం కల్పించింది. దీనితో ఆ ఆదివాసీలు ఎదురు తిరిగి తమ భూమి కోసం ఉద్యమం చేసినప్పటికీ భూ రికార్డులు సరిగా లేకపోవడంతో ఆ భూములు తమవే అని నిరూపించుకోలేక తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూమిని కోల్పోవాల్సి వచ్చింది. 1946-51 మధ్య వచ్చిన తెలంగాణా సాయుధ పోరాటం, పశ్చిమ బెంగాల్‌ లో మొదలై ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలకు విస్తరించిన నక్సల్బరీ ఉద్యమం, 1980లో ఇంద్రవెల్లి తిరుగుబాటు అన్నీ భూ పోరాటాల చరిత్రలే. 1990లలో వచ్చిన పీసా (ూజుూA- ూaఅషష్ట్రaవa్‌ జుఞ్‌వఅంఱశీఅ ్‌శీ ూషష్ట్రవసబశ్రీవస Aతీవaం),2006 నాటి అటవీ హక్కుల చట్టం వంటి బలమైన శాసనాలు కూడా అమలులో చిత్తశుద్ధి లోపం, ఆదివాసీల అవగాహనా రాహిత్యంవల్ల ఎందుకూ కొరగానివిగా అయి పోయాయి. నిజానికి అత్యధిక శాతం ఆదివాసీలకు వారి సంక్షేమం కోసం రూపొందించబడిన ఎన్నో పథకాల పేర్లు కూడా తెలియవు. భారత దేశంలోని గిరిజనుల జీవితాలపై విస్త ృతంగా అధ్యయనం చేసిన హేమాండార్‌ా అనే సామాజిక శాస్త్రవేత్త ప్రకారం మైదాన ప్రాంతాల నుండి వలస వెళ్లిన నాగరీకులు గిరిజనులకు మద్యం, డ్రగ్స్‌ (మత్తుమందులు) అలవాటు చేసి వారి భూములను, విలువైన వనరులను దోచుకోవడం మొదలు పెట్టారు. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో దీనిని నేను స్వయంగా చూశాను. అక్కడి గిరిజనులు వారమంతా అడవిలో తిరిగి గమ్‌ కరయా, కరక్కాయ, తిప్పతీగ (దీనిని మలేరియా తీగ అని పిలుస్తారు), తేనె వంటి కలపేతర అటవీ ఉత్పత్తులను సేకరించి అడ్డతీగల వారపు సంతలో అమ్ముకుని వారికి కావాల్సిన ఉప్పు, పప్పులను కొనుక్కుని వారి వారి గ్రామాలకు తిరిగి వెళతారు. ఈ సంతలో ఒకరోజు గడిపిన మాకు బయట మార్కెట్‌ లో దాదాపు కిలో రెండువేల ఖరీదు చేసే గమ్‌ కరయా (దీనిని ఫార్మా పరిశ్రమలో ఎక్కువగా వినియోగిస్తారు)ను సారాదుకాణం లో ఇచ్చి ఒక సీసా చీప్‌ లిక్కర్‌ తీసుకుని తాగుతున్న గిరిజన దంపతులను చూసి బాధ కలిగింది. ఆ గిరిజ నుల బలహీనతలను, అమాయకత్వాన్ని తమ దోపిడీకి వాడుకునే నాగరీకులను నిజంగా నాగరీకులు అనవచ్చా అనే సందేహం కలిగింది. తేనె, కరక్కాయ, ఉసిరి, కుంకుడుకాయలు ఇలా ఏ అటవీ ఉత్పత్తి తీసుకున్నా మార్కెట్‌ ధరలో ఆ గిరిజనులకు దక్కేది రూపాయలో పది పైసలు మాత్రమే. వారు ఎంతో శ్రమపడి తెచ్చిన ఉత్పత్తులను ఇంత తక్కువ ధరకు తీసుకోవడం అన్యాయం కదా అని దళారీని అడిగితే ’వాళ్ళకి అడవిలో ఉచితంగా దొరికే వాటికి ఈ మాత్రం ఇవ్వడమే ఎక్కువ’ అనేశారాయన. అవి సేకరించేందుకు వారు ఖర్చు పెట్టిన సమయం, శ్రమ, తీసుకున్న రిస్క్‌ లకు ఏ మాత్రం విలువ లేదు వారి ద ృష్టిలో. తాడుకట్టుకుని కొండ అంచునుండి తలకిం దులుగా వేలాడుతూ కొద్దిపాటి కొండ తేనె సేకరించేందుకు ఒక గిరిజనుడు తన ప్రాణాలనే రిస్క్‌ చేస్తుంటాడు. కానీ మన ద ృష్టిలో అది ఉచితంగా దొరికే పదార్ధం. ఇలా వారి భూములు, వనరులు కారు చౌకగా లేదా ఉచితంగా నాగరీకులు దోచుకుని ఆదివాసీ లను నిరుపేదలుగా, నిస్సహాయులుగా మారు స్తున్నారు. ఇక దేశంలో పెద్ద ఎత్తున ఏ అభివ ృద్ధి ప్రాజెక్ట్‌ లు చేపట్టినా అందులో ప్రధానం గా నిర్వాసితులయ్యేది గిరిజనులే. భారీ నీటి పారుదల ప్రాజెక్ట్‌ లు, గనుల తవ్వకాలు, పారిశ్రామిక అభివ ృద్ధి ఇలా ఏది చేపట్టినా నిర్వాసితులయ్యే జనాభాలో దాదాపు మూడిర ట ఒకటో వంతు గిరిజనులే ఉంటున్నా రని అనేక అధ్యయనాలలో వెల్లడయింది. ఛత్తీస్‌ గఢ్‌, జార్ఖండ్‌్‌ వంటి రాష్ట్రాలలో వేళ్ళూను కునిపోయిన నక్సల్‌ ఉద్య మం కూడా ఆదివా సీల జీవితాలను అతలా కుతలం చేసింది. తమపై జరుగుతున్న దోపిడీ, దౌర్జన్యాలకు ఆగ్రహించిన కొంత మంది ఆదివాసీలు నక్సల్‌ ఉద్యమాన్ని బలంగా సమర్ధించి దానికి తోడ్పాటు నందించగా ఆ ఉద్యమాలను అణచివేసేందుకు ప్రభుత్వాలు, కాపాడుకు నేందుకు నక్సలైట్‌లు పరస్పరం తలపడడంతో జరుగుతున్న ఘర్షణలో నలిగిపోతున్నది కూడా ఆదివాసీలే. అందుకే పెద్దఎత్తున ఆ ప్రాంతా లలోని ఆదివాసీలు తమ ఆవాసాలను వదిలి మన తెలంగాణాలోని భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాలలో కూలి నాలీ చేసుకుంటూ బతకడం మొదలుపెట్టారు. ఆదివాసీ సంస్క ృతి పై, వనరులపై జరిగే మరోదాడి పర్యాటకం అనే రూపంలో కూడా కొన సాగడం నేను గమనించిన మరొక అంశం. పశ్చిమ బెంగాల్‌ లోని భీర్‌భమ్‌ జిల్లాలోని బోల్‌పూర్‌ (ఇక్కడే రవీంద్రుని శాంతినికేతన్‌, ప్రస్తుత విశ్వ భారతి యూనివర్సిటీ ఉంది) దగ్గర ఒక సంతాల్‌ గిరిజన గ్రామాన్ని గతంలో నేను సందర్శించడం జరిగింది. గిరిజనుల సంస్క ృతి సంప్రదాయాలలోని విభిన్నతను, వైవిధ్యాన్ని నాగరీకులకు తెలియచేయాలనే ఉద్దేశ్యంతో ఆ రాష్ట్ర పర్యాటక శాఖ ఆ గ్రామాన్ని రూరల్‌ టూరిజం (గ్రామీణ పర్యాటక) కేంద్రంగా మార్చింది. పర్యాటకులు అక్కడ బస చేసేందుకు కాటేజ్‌ లు నిర్మించి, అక్కడి ఆదివాసీలలో కొందరికి గైడ్లుగా శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకుంది. శాంతినికేతన్‌ కు వచ్చే పర్యాటకులు అక్కడికి కేవలం మూడు నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో పచ్చటి అడవిలో ఉన్న ఈ గ్రామంలో విడిది చేయడం, కాలుష్యానికి కల్మషానికి దూరంగా ప్రశాంతంగా ఉన్న ఆ గిరిజన గ్రామాన్ని చెత్త, కాలుష్యంతో నింపేయడం తప్ప ఈ పర్యాటక కేంద్ర హోదా వల్ల ఆ ఆదివాసీలకు ఒరిగిందేమీ లేదు. తెలంగాణ రాష్ట్రంలోని ఉట్నూర్‌, ఏటూరు నాగారం, భద్రాచలం. ఈ మూడు ఏజెన్సీ ప్రాంతాలలోని గిరిజనులదీ ఇదే పరిస్థితి. ఎప్పుడో 1970ల లోనే హేమాండార్‌ ఉట్నూర్‌ ప్రాంతాన్ని సందర్శించి మహారాష్ట్ర నుండి, గుజరాత్‌ నుండి వచ్చిన గిరిజనేతరులు ఆ ప్రాంతంలో బలమైన వర్గంగా మారడం గమనించారు. ఏదో కొద్ది మంది గుజరాతీలు చిన్న పాటి దుకాణాలు, వడ్డీ వ్యాపారం వంటి వ ృత్తులలో స్థిరపడగా చాలా వరకు ఈ వలస దారులు అక్కడి గిరిజనుల భూములను ఆక్రమించుకుని వారిని వారి స్వంత ప్రాంతంలోనే ఒక మైనారిటీ వర్గంగా మార్చేయడం జరిగింది. గిరిజనుల భూములు, వనరులపై జరుగుతున్న దోపిడీ మాత్రమే ఇదంతా. ఇక నిస్సహాయులైన, అమాయకులైన గిరిజన స్త్రీలపై జరిగే అక ృత్యాల గురించి రాయాలంటే పేజీలు సరిపోవు. ఒక్కసారి వాకపల్లి ఉదంతం గుర్తు చేసుకుంటే చాలు, దుఃఖం పొంగుకొస్తుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌, ఒడిశా,చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ ఇలా ఏ ప్రాంతం తీసుకున్నా గిరిజనుల ప్రాంతాలను ఆక్రమించి, వారి సంస్క ృతి సంప్రదాయాలను విచ్చిన్నం చేసి, వారికి జీవనోపాధి లేకుండా చేసి వారిని బలహీనులుగా, నిస్సహాయులుగా మార్చినది నాగరీకులం అని చెప్పుకునే మనవంటి వారి స్వార్ధం, క్రూరత్వమే. అప్పుడప్పుడు బయట పడే మధు లాంటి వారి ఉదంతాలు మన నాగరికత విక ృత రూపాన్ని బయట పెడుతున్నాయి. మనం సామూ హికంగా సిగ్గుపడాల్సిన సందరాÄలేలో అది ఒకటి మాత్రమే.-(జి.ఎ.సునీల్‌ కుమార్‌)