ఆదివాసుల చీకటి బతుకుల్లో అక్షర కాంతి..

అజ్ఞానం అన్ని సమస్యలకు మూలం. ఇంటర్నెట్‌, పేస్‌ బుక్‌, వట్సాప్‌ వంటి సాంకేతిక విప్లవం రాజ్యమేలు తున్న నేడు సరస్వతి కాళు మోపని ఆదివాసి గ్రామా లు ఇంకా ఉన్నాయంటే నమ్మశక్యం కాదు.కాని ఇది నిజం.స్వాతంత్య్ర పోరాటంలో తెల్లదొరలను తరిమి కొట్టడం,ముఠాదారి వ్యవస్థల రద్దు, స్వేచ్ఛను పొం దడం మాత్రమే కాకుండా తన సొంత ప్రజలు (ఆది వాసులు) విజ్ఞానవంతులు కావడం కుడా అంతే ముఖ్యమని గుర్తించిన గొప్ప దార్శని కుడు మర్రి కామయ్య. సుమారు 90ఏళ్ల క్రితమే ఆదివాసులకు చదువు అవసరాన్ని గుర్తించి పాఠశాలలు తెరిచి విద్యాభివృద్దికి కృషిచేసిన ఆది వాసుల మరో జ్యోతి రావు పూలే మర్రి కామయ్య. ఆయనతో పాటు డుంబేరి వీరన్న, రేగం భీమేశ్వర రావు, పొండోయి కొండన్న, మర్రి దన్ను (మర్రి కామయ్య కుమారుడు), కంట మచ్చేలు,బొండా మల్లుడు,బొండా బాలన్న మొదలైన అనేకమంది ఈ కార్యదిక్షలో భాగమ య్యారు.1940 వ సంవత్సంలో నెలకొల్పిన ‘‘ఆంద్ర శ్రామిక ధర్మరాజ్య సభ మాడుగుల, అనంతగిరి కొండ జాతి శాఖ సంఘము’’ల ద్వారా స్వాతంత్య్ర కాంక్షతో పాటు ఏజేన్సిలో పాఠశా లలు నెలకొల్పి, స్వీయ పర్యవేక్షణలో అక్షరోద్యమాన్ని నడిపించారు. ఈ బృహత్‌ కార్యానికి రెబ్బప్రగడ మండే శ్వర శర్మ గారు సంఘ కార్యదర్శిగా ఎంతగానో దోహద పడ్డారు. చదువుకున్న ఆదివాసీ యువకులను గుర్తించి, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో శిక్షణ ఇప్పించి ఉపాద్యయులుగా నియ మించారు. ఆ సంఘం ద్వారా శిక్షణ పొందిన ఉపాద్యయుడి (మండి పెంటయ్య, జనకోట) వద్దనే తొలి అక్షర భ్యాసం చేసిన నాకు ఈ కొద్ది విషయాలు మీ ముందుకు తెచ్చే అవకాశం దొరికినందుకు సంతోసిస్తున్నాను. మధ్య కాలంలో పోలీసులు కామయ్యను అరెస్టు చేసి జైలుకు వేశారు. కామయ్యకు సంబందించిన భూములు, పశువులు ఇతర ఆస్తులు స్వాధీనం చేసుకుని వేలం వేశారు.బ్రిటిష్‌వారు,ముఠాదార్లు, సావుకార్లు, ధనవంతులు, ఉద్యోగులు ఏకమై ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్‌లో చేరిన వారిపై నిర్బంధాలు చేయడం,జైలు శిక్షలు వేయడం,లాఠీలతో కొట్టడం, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటం వంటి ఆకృత్యాలకు చేసేవారు. బ్రిటిష్‌ వారు ప్రవేశపెట్టిన వేట్టిసాకిరి రద్దు,స్థానిక ప్రజల సంక్షేమం కోసం రహదారుల నిర్మాణం,ఆది వాసి యేతరుల వలసలను అరికట్టడం,సంత లలో వ్యాపారుల మోసలు అరికట్టడం,మద్య పాన నిషేధం,రవాణా,తపాల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకు రావదానికి ఎనలేని కృషి చేశారు. భూగోళం హద్దులు చెరిగిపోయి ‘‘వసుదైక కుటుంబం (గ్లోబల్‌ ఫ్యామిలీ)’’గా మారిపోతున్న మర్రి కామయ్య ఉద్యమకాంక్ష మాత్రం నేటి వరకు నెరవేడడం లేదు. ఆ మహనీయుల కృషికి కొనసాగింపుగా గత నాలుగున్నర దశబ్దాలుగా గిరిజన విద్యార్థుల సంఘం (జి.యస్‌.యు) ఆదివాసుల విద్యాభి వృద్ధికి,ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తోంది.ఈ ఉద్యమ ప్రయాణంలో 1999 జనవరి 31న ముగ్గురు సహచర విద్యార్థి ఉద్యమకారులు కటారి కొండబాబు, కిల్లో సురేంద్ర కుమార్‌,మజ్జి జయరామ్‌లను జి.యస్‌.యు కోల్పోయింది. విద్యార్థుల, ప్రజల సమస్యలు పరిష్కారానికి విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభ ముగించుకుని తిరుగుప్రయాణంలో రోడ్డు ప్రమదానికి గురై ప్రాణాలు కోల్పోయారు.ఆంధ్రప్రదేశ్‌లో బ్రిటీష్‌ వలసపాలనకు వ్యతిరేకంగా తూర్పు ఏజెన్సీలో కారం తమన్న దొరతో ప్రారంభమైన రంప తిరుగుబాటు (రంప రెబలియన్‌) విశాఖ మన్యం మీదుగా విజయనగరం వరకు పాకింది. 1917 నాటికి ఉధృతం దాల్చి 1922-24 నాటికి ముగి సింది. తదానంతరం 1930 తర్వాత ఆ పోరా టాన్ని మర్రి కామయ్య కాంగ్రెసుతో కలిసి కొన సాగించాడు.అవిభాజ్య విశాఖ మన్యానికి దక్షిణ బాగానా ఒరిషా సరిహద్దు కామయ్యపేట (హుకుంపేట మండలం) కేంద్రంగా ఆంగ్లే యులు పెంచిపోసించిన ముఠా సిస్టం, వెట్టి పని రద్దుకు వ్యతిరేకంగా ఉద్యమం సాగింది. రంప తిరుగుబాటు లాగయాతు వేట్టిసాకిరి రద్దుకు స్వాతంత్య్రనంతరం వరకు ఆదివాసులు కొనసాగించిన పోరాటల వరకు చరిత్రకారులు విస్మరిచిన,ఆ నాడు వారు వేసిన కరపత్రాలు, సర్వోదయ సేవ సంఘం అద్యక్షులు జర్సింగి మంగ్లన్న (గలగండ) కంబిడి బలాన్న (గూడ) కామయ్య గురించి అచువేసిన పుస్తకం, అందు బాటులో ఉన్న సమాచారం పుణ్యాన ఆదివా సుల విద్యాభివృద్ధికి (పాఠశాలల నిర్వహణకు) మర్రికామయ్య, అతని సహచర ఘనం చేసిన కృషి కొద్దిగానైన తెలుసుకునే అవకాశం దొరికింది. రంప తిరుగుబాటు (మన్యం పితూరి) దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం తెచ్చిపెట్టడానికి ఎంతో దోహదం చేసినప్పటికీ, ఆ పోరాటంలో పాల్గొన్న అనేకమంది యోధుల త్యాగాలు చీకటిలో ఉండిపోవడం శోచనీయం. మన్యం పితూరి కోసం గాం గంటం దొర కుటుంబం సర్వస్వం త్యాగం చేసింది. గంటం దొర సోదరుడు మల్లు దొర దేశద్రోహం నేరం కింద అండమాన్‌ జైలులో శిక్ష అనుబవిం చాడు. ఆ కుటుంబంతో రాజకీయాలు నెరిపిన పాలకులు వారి మనువడు గాం బోడి దొరకు కనీసం ఒకఇల్లు కట్టి ఇవ్వలేకపోయారు. దాతల వితరనతో కాలం వెల్లడిస్తూ, చివరికి దిక్కులేని మరణం పొందాడు. ఐపీసీ సెక్షన్‌ 121 దేశద్రోహం నేరం కింద అండమాన్‌ జైలుకు పంపబడ్డ మొట్టమొదట ఖైది బోనంగి పండు పడాల్‌. పడాల్‌ తో పాటు మరో 12 మంది అతని సహచరులను దశలవారిగా అండమాన్‌ కు తరలించారు. పాలకులు విస్మరించిన ఈ మధ్యకాలంలో కొంతమంది మానవతవాదులు ఆదివాసి పోరాటలపై చేసిన అధ్యయనాలు, బ్రిటీష్‌ కాలం నాటి జైలు రికార్డులు ఆధారంగా నేడు కొంతమేరకు బయటి ప్రపంచానికి పరిచయమవుతుంది. ఇది ఒక శుభ పరిణామం. తెల్లవాడి పెత్తనానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి ప్రేరేపి తుడైన బోనంగి పండు పడాల్‌ ఇంట్లో భార్యకు గాని, కుటుంబ సభ్యులకు గాని చెప్పకుండా సాయుధ పోరులో చేరిపోయాడు. ఆ సమయం లో అతని భార్య లింగమ్మ ఏడేనిమిది నెలల గర్భవతి. పోలీసు స్టేషన్లపై పితూరీ సేనలు చేస్తున్న మెరుపు దాడులు తిరుగులేని స్వతంత్య్రోద్యమంగా ప్రాధన్యత సంతరిం చుకుంది. చింతపల్లి, కృష్ణదేవి పేట, రాజ మ్మంగి పోలీస్‌ స్టేషన్లపై మెరుపు దాడులు చేసి ఆయుదాలు స్వాధీనం చేసుకొన్న సంగతి తెలుసుకున్న స్థానిక ప్రజలు మరింత ఉత్తేజితు లయ్యారు. విశాఖ-తూర్పు ఏజెన్సీలలో ఆదివాసులు సాంప్రదాయ విల్లంబులతో చేస్తున్న గెరిల్లా దాడులు ఉద్యమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పండుపడాల్‌ ఆచూకీ తెలిపిన వారికి వంద రూపాయలు (రూ. 100/-లు) బహుమతి కూడా ప్రకటించింది బ్రిటిష్‌ ప్రభుత్వం. వాస్తవానికి పండు పడాల్‌ కు ఉరిశిక్ష పడిరది.13 మే1925న పునర్‌ విచారణ జరిపిన విశాఖపట్నం వాల్తేరు సెషన్స్‌ కోర్టు ఉరిశిక్షను రద్దు చేసి జీవిత ఖరగార శిక్షగా మార్చింది. పండుపడాల్‌ను 25ఏప్రిల్‌ 1926న అండమాన్‌ నికోబార్‌ దీవులు పోర్టు బ్లేయర్‌ లోని సేల్లులార్‌ జైలుకు తరలించారు. ఆ తరువాత తగ్గి వీరయ్య దొర (20.11. 1926), కోరబు కోటయ్య (20.11.1926), కుంచెటి సన్యాసి,గొలివిల్లి సన్యాసి,సుంకరి పొట్టయ్య,కోరబు పొట్టయ్య, లక్ష్మయ్య, కూడ లక్ష్మయ్య, ధనకొండ లక్ష్మయ్య,లోత లక్ష్మయ్య, అంబటి లక్ష్మయ్య, మామిడి చిన్నయ్య,కోరాబు లింగయ్య లను దశావరిగా తరలించారు. పండుపడాల్‌ వారసులు తమ స్వగ్రామమైన చింతపల్లి మండలం గొండిపాకలు గ్రామానికి అండమాన్‌ నుండి అప్పుడప్పుడు వచ్చిపోయ్యేవారు.ఆదివాసుల తిరుగుబాట్లు అన్ని దాదాపుగా ఆంగ్లేయులతో జరిగినవే. అయినా అవెక్కడ దేశం కోసం జరిగిన తిరుగుబట్లుగా గుర్తించబడలేదు. అతిసాధారణ ఘటనలుగానే చుస్తువచ్చారు. 1835 ఒరిషా రాష్టం పుల్బాని ప్రాంతాలను ఆక్రమించుకున్న ఆంగ్లేయులపై చక్ర బిసోయ్‌,గౌర బిసోయ్‌ లు సాంప్రదాయ అయుదాలతో తిరుగుబతు చేశారు.1885లో బెంగాల్‌,బీహార్‌ ప్రాం తాలలో ఈస్ట్‌ ఇండియా కంపెని ప్రవేశపెట్టిన జమిందారి విధానం,శిస్తు వసూళ్ళకు వ్యతిరేకంగా అంగ్లేయులపై తిరుగుబాటు చేసారు.బ్రిటిష్‌ రాయబారి లార్డ్‌ కారన్‌ వాల్లిస్‌ ప్రవేశపెట్టిన తప్పుడు చట్టానికి వ్యతిరేకంగా ‘‘సంతాల్‌’’ప్రజలు తిరుగుబాటు చేసారు. 1768, 1835లలో అస్సాంలోని ‘‘షేర్‌, కాశీ’’ తెగలు, 1824-48ల మద్య కాలంలో మహారాష్ట్రలోని ‘‘కోల్‌’’ తెగలు, ఒరిస్సాలో ‘‘కొందు’’లు, 1889-90 బీహార్‌ లో సంతాల్‌ తేగలు,1913 న రాజస్థాన్‌ లో బిల్లులు, 1919న మణిపూర్‌లో‘‘కుకీ’’లు వలసవాద బ్రిటిష్‌ వారిపై తిరుగుబాట్లు చేశారు. 1921లో నల్లమల అడవులలో ‘‘చెంచు’’లు 1916న తూర్పు ఏజెన్సీ లాగారాయి తిరుగు బాటు కూడా అంగ్లేయులపై జరిగినవే. చరిత్రకు ` ఆదివాసులకు ఉన్న ప్రాధాన్యత గురించి ఒక చిన్న సందర్బం గుర్తుచేస్తాను. 29 మార్చి 1857న మంగళ్‌ పాండే నాయకత్వంలో జరిగిన సిపాయిల తిరిగుబాటును మొట్టమొదటి స్వాతంత్య్ర సంగ్రామంగా చరిత్రలో చదువుకుంటున్నాం. బ్రిటిషు వారు ఇండియన్‌ సిపాయిలకు ఆవు కొవ్వు,పంది కొవ్వు పూసి తయారుచేసిన తూటాలు ఇచ్చేవారు. ఆతూటాలని నోటితో కొరికి తొక్క తొలిగిస్తేనే పేలుతాయి.ఆవు, పంది కొవ్వులు పూసిన తూటాలు ఇవ్వడాన్ని అగ్రహించిన ఇండియన్‌ సైనికులు ‘ఈస్ట్‌ ఇండియా కంపెనీ దళాల’పై తిరుగుబాటు చేసాయి. సిపాయిల తిరుగుబాటుకంటే సుమారు 70సంవత్సరాల ముందు1784లో బాబా తిల్కా మారీa బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా మొదటిసారి సాయుధ తిరుగుబాటు చేసాడు.?బ్రిటీష్‌ వారి వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటానికి అతను ఆదివాసులతో ఒక సాయుధ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. బాబా తిల్కా బ్రిటీష్‌ కమీషనర్‌ లెఫ్టినెంట్‌ అగస్టస్‌ క్లివ్‌ ల్యాండ్‌ మరియు అతని నివాసం రాజ్‌మహల్‌పై గులేల్‌ స్లింగ్‌షాట్‌తో సమానమైన ఆయుధం)తో దాడి చేశాడు. బ్రిటీష్‌ వారు,తిల్కా సైన్యం నిర్వహించే తిలా పూర్‌ అడవిని చుట్టుముట్టారు.కానీ తిల్కా తన సైన్యంతో చాలా వారాల పాటు నిలువరిస్తు వచ్చారు. చివరకు తన 34వ ఏట 13జనవరి 1785 పట్టుబదినపుడు,అతన్ని గుర్రపు తోకకు కట్టి బీహార్‌లోని భాగల్‌పూర్‌ కలెక్టర్‌ నివాసం వరకు ఈడ్చుకెళ్లారు అక్కడ మర్రిచెట్టుకు అతని దేహాన్ని వేలాడదీశారు. కానీ,తిల్కా బ్రిటిష్‌ వారిపై చేసిన తిరుబటును ఆంగ్లేయులతో చేసిన స్వాతంత్య్ర పోరాటంగా గుర్తించ బడలేదు.1600 సంవత్సరంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ భారతదేశానికి కాళ్ళు మోపిన నాటి నుంచి వందల ఏళ్లుగా అనేక సార్లు బ్రిటిష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేస్తూ వచ్చారు.ఇప్పటికైనా గిరిజన సంక్షేమ శాఖ, ుజడుRI,ఐటిడీఏలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి చొరవ తీసు కోవాలి. ఆదివాసి పోరాట యోధుల చరిత్ర లను,ఇతివృత్తాలను,ఏజేన్సీ రక్షణ చట్టాలను పాఠ్యాంశాలలో చేర్చడం,పుస్తకాలు ముద్రించి ప్రచారంలోకి తీసుకురవాలి.విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల ముందు స్వతంత్ర పోరాట యోదుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి. ఇలా చేయకపోతే ఈ దేశంలో ఆదివాసుల చరిత్ర కనుమరుగావ్వడం కయంగా కనిపిస్తుంది.
తరాలు మారినా తీరని వేతలు..
భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రూపంలో గొప్ప రాజ్యాంగం కూడా రాసుకున్నాం.అంత మాత్రణ అన్ని చట్టాలు వాటంతటవే అమలవు తాయని ఎమరుపాటుగా ఉండటం అంత మంచిది కాదు.ముఖ్యంగా ఆదివాసులు, దళితులు,సంఖ్య బలం లేని అల్ప సంఖ్యక ప్రజలు,ఓట్ల రూపంలో ప్రభావితం చేయలేని వారు గట్టిగా ప్రశ్నించడం అలవాటు చేసు కోవాలి.ఎందుకంటే పెట్టుబడిదార్లకు,ఆర్ధిక పెత్తందార్లకు వనరులు దోచి పెట్టడానికి అధికారం కోసం పాలకులు ఏదైనా చెయ్య గలరు.ఎక్కువ ఓట్లు శాతం కలిగి ఉంటే అర్హత ఉన్నా లేకపోయినా-అడిగిన అడగక పోయినా తాయిలాలు ప్రకటించే దుర్మార్గపు అలవాటు మన పాలకులకు ఉన్నదే! ఇది మాత్రం తూ.చ తప్పకుండా పాటిస్తారు. వర్ణ,వర్గ,మత విద్వేష గ్నులు ఆరనివ్వకుండా జగర్తపడతారు.ఆ విద్వే షాలను అధికారం తెచ్చి పెట్టే సాధనంగా వాడుకుంటారు. కాబట్టి అవసరం ఉన్న వారు గట్టిగా మాట్లాడకపోతే ఏమి ఇవ్వరు.సరి కదా ఉన్నది కూడా లాగేసు కుంటారు. ఆదివాసు లకు రక్షణగా ఉన్న చట్టాలు అమలు, రిజర్వే షన్ల, ప్రకృతి వనరుల విషయంలో తీరని అన్యాయం జరుగుతునే ఉంది.రాజకీయ అవస రాల కోసం,అధికారం దక్కించుకోవడం కోసం కేంద్ర,రాష్ట్ర పాలక పక్షాలు ఆదిమజాతుల కంటే అన్ని విధాల అభివృద్ధి చెందిన కులాలను షెడ్యుల్డ్‌ తెగలలో కలిపి, మాకు (షె.తె.లకు) కేటాయించిన రిజర్వేషన్లనే అందరికీ సమానంగా పంచాలని చూస్తున్నారు. 1956 తరువాత షె.తె.ల జాబితా క్రమంగా పెంచుతూ వచ్చారు. పెంచిన జాబితాలో కొండ ప్రాంతాలలో నివసించే మూలజాతుల ఉనికి మరింత వెనుకకు నెట్టబడ్డాయి.మరికొన్ని జాతులు అవశేషాలు లేకుండా పోయాయి. ప్రతీ ఎన్నికలలో ఇతర కులాలను తెగల జాబితాలో చేర్చే అంశం ప్రచార అశ్రంగా మారుతుంది.ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రాజకీయ పార్టీలు ఎవరికివారు అధికారంలోకి రావడం కోసం బోయలను ఎస్టిలలోకి కలపాలని పోటిపడు తున్నారు.150కోట్లకు చేరువలో ఉన్న గొప్ప ప్రజాస్వామ్య భారత దేశంలో ఇతర కులాలను కలుపుతూపోతే ఆదివాసులు ఎంత నష్టపోతరో ఆలోచించగలిగిన ఒక్క రాజకీయ పార్టి గాని, నాయకుడు గాని లేరంటే సిగ్గుపడాలి.2024 సార్వతిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లోని అరుకు ఎస్టి పార్లమెంట్‌ నియోజకవర్గానికి బిజెపి అభ్యర్థిగా కొతపల్లి గీతాను బరిలోకి దించింది. ఆమెను కుల వివాద అంశంలో గిరిజన సంక్షేమశాఖా ఎస్టి కాదని తేల్చింది. జివో నెంబర్‌ 3ద్వారా ఆమెకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ జారి చేసిన ఎస్టి-వాల్మీకి ద్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ రద్దుచేసింది. ప్రస్తుతం ‘హైకోర్టులో స్టే’ ఉంది. రేపోమాపో ‘స్టే’కొట్టివేసే అవకాసం కూడా ఉంది. అంతేకాదు,బిజెపికి అస్సలు గిట్టని అవినీతి కేసుకుడా సిబీఐ దోషిగా తేల్చింది. గీతా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 42.79కోట్ల రూపాయలు ఎగవేసినదుకు జైలు శిక్ష కూడా అనుభవించింది. ఆదివాసులంత ముక్తకంఠంతో ఆమే అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా,బిజెపి జాతీయ అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు జెపి నడ్డా, బిఎల్‌ సంతోష్‌ గార్లకు లేఖలు రాసిన పట్టించుకోవడం లేదు. అంటే చట్టసభలలో అసలైన ఆదివాసుల ప్రాతినిద్యం తగ్గించడం, బాక్సైట్‌ వంటి వనరుల దోపిడీకి గీతాను ఒక పావుగా వాడుకోవడానికి బిజెపి హ్యుహం పన్నినట్టు స్పష్టమవుతుంది.షెడ్యూల్‌ ప్రాంత ఆదివాసుల రక్షణ కవచాలుగా ఉన్న 1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టం,జీవో నెంబర్‌ 3,ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటి చట్టం-1989, పంచా యతీరాజ్‌ (షెడ్యూల్‌ ప్రాంతాల విస్తారన) చట్టం-1996(ూజుూA),అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 వంటి చట్టాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసిన పోరాటాల ఆధారంగా సాధ్యపరచుకున్నదే. ఇక ముందు కూడా రాజ్యాంగం స్ఫూర్తిగా ప్రశ్నించనిదే ఈ చట్టాలు అమలు కావు. పాలకులు వాటిని అమలు చేయరు. ఆదివాసులు కోరుకున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రం అంటే అధికార మార్పిడి కాదు. ప్రజలు బ్రిటిష్‌ పాలకుల నుంచి స్వదేశి పాలకుల ఏలుబడిలో ఉండటం అంతకన్నా కాదు. ఈ భూమిపైన, భూమి లోపల ఉండే వనరులపైన సర్వహక్కులు కలిగి స్వేచ్చగా జీవించగలిగే హక్కు ప్రజలకే ఉండాలి. అభివృద్ధి అంటే వచ్చిన అభివృద్దిలో స్థానిక ప్రజల జీవితాలు ఆధారపడి ఉండాలి. మన అభివృద్ధికి రోడ్డు వస్తే,ఆరోడ్డు పేదలకు సౌకార్యాన్ని, జీవన ప్రమాణాలు మేరుగుపడ టానికి దోహదపడాలి. అంతేకాని,ఉన్న కొద్దిపాటి భూమిని, వనరులను దూరం చేస్తే, అది ఎలా అభివృద్ధి అవుతుంది. వినాశం అవు తుంది గాని.ఉదాహరణకు విజయనగరం జిల్లా బొడ్డవర నుండి పాడేరు మీదుగా రాజ మండ్రి వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి 516జులో ఆదివాసులు పెద్ద ఎత్తున తమ పంట భూములు కోల్పోయారు.2013 కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం ఆదివా సులకు భూమికి భూమి పరిహారం ఇవ్వవలసి ఉన్న దాని ఉసే ఎత్తడం లేదు.అధికార్లు మాత్ర భూమికి భూమి ఇవ్వడానికి భూమి ఎక్కడ ఉంది.లేదుకదా? అంటున్నారు. నష్టపోయిన వారికి ఇవ్వడానికి భూమి లేనపుడు,ఉన్న భూమి ఎందుకు లాక్కొంటున్నారని అడిగిన ప్రశ్నకు వారివద్ద సమాధానం లేదు. హక్కుల స్ఫూర్తిని రాజ్యాంగంలో పొందుపరచడానికి వందల ఏళ్ళుగా ఆదివాసులు చేసిన/చేస్తున్న పోరాటాల కృషి ఉంది.వాటిపై ఒత్తిడి ఫలి తంగానే అమలవుతాయి. బ్రిటిష్‌ వారు కాళు మోపిన ప్రతీ చోట ఆదివాసులు తిరుగు బాట్లు మొదలుపెట్టినా ఇతర ప్రజలు ఎవరు కనీసం సహకారించలేదు. బ్రిటీష్‌ పాలకులు తీసుకు వచ్చిన అటవీ చట్టాలు ఆదివాసులకు అడవిపై ఉండే సహజమైన హక్కులను సైతం నిరాకరిం చాయి. అదే ‘‘మద్రాసు అటివీ చట్టం -2006’’.ఈ చట్టం ఆదివాసులను అడవుల్లో స్వేచ్ఛగా తిరగడం, తమ సహజ హక్కులను అనుభవించడం నిరాకరించాయి.అనేక కఠిన మైన ఆంక్షలు విధించింది. ఆదివాసుల పరం పరగత/సాంప్రదాయకమైన ‘పోడు’ వ్యవ సాయం చేయడం,కట్టెలు (వంట చెరుకు) సేక రించి తెచ్చుకోవడం, ఇప్పపువ్వు,ఈత కళ్ళు, తాటికల్లు మొదలైన ఫలసాయలు సేకరించడం వంటివి కూడా ఈ చట్టం ప్రకారం నేరమే. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన అటవీ చట్టం ముసాయిదా మద్రాసు అటవీ చట్టానికి తలదన్నే విధంగా రూపొందించారు. ఆదివాసులు తమ దయనందిన కార్యకలా పాలకు అడివిలోకి వెల్లడానికి వీలు లేకుండా సాయుధ బలగాలతో కాపలాగా పెట్టాలని, అడవులకు ప్రవేశించిన వారిపై కఠినమైన కేసులు పెట్టి జైలుకు పంపే విధంగా ప్రతిపా దనలు ప్రవేశపెట్టింది. ఈ ముసాయిదా రూపొందించిన నాటి నుండి వ్యతిరేకిస్తూ వచ్చాము. కానీ,పాలకులు పట్టించుకోలేదు. అటవీ సంరక్షణ చట్టాన్ని తమకు నచ్చిన బహుళజాతి కంపెనీలకు, వారు అడిగిన ప్పుడల్లా ప్రభుత్వమే నేరుగా అటవీ భూములను దారాదత్తం చేసే విధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మార్చివేసింది.‘‘2023 నూతన అటవీ సంరక్షణ సవరణ చట్టం’’ద్వారా గ్రామ సభ అధికారులను తొలగించింది. ఇప్పుడు గ్రామసభ అభిప్రాయలతో పని లేకుండా బహుళజాతి కంపెనీలకు అటవీ భూములు కేటాయించేయ్యవచ్చు. చట్టాన్ని ఆవిధంగా మార్చేసుకున్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వవలసిన ప్రభుత్వాలు అటవీ భూముల నుంచి ఆదివా సులను సొరబాటుదారులుగా ముద్ర వేసి దేశవ్యాప్తంగా అడవులపై ఆధారపడ్డ పది లక్షలకు పైగా ఆదివాసి కుటుంబాలను అడవుల నుండి గెంటివేయడానికి పథకం వేసారు. సత్తిస్గడ్‌ రాష్ట్రంలో నూతన అటవీ సంరక్షణ చట్టం ప్రభావం మొదలైంది. ఆ రాష్ట్రంలో ఇటివలే కొలువుదీరిన బాజపా ప్రభుత్వం బొగ్గు గనుల వెలికితీత, జాతీయ రహదారులు నిర్మాణం కోసం లక్షలాది చెట్లను తొలగించే పని మొదలు పెట్టేసింది. కఠీనమైన అటవీ సంరక్షణ చట్టాలు అమలో ఉన్నప్పుడే లెక్కచేయని పాలకులు, ఆ చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నకా వదిలి పెడతరా?.ఈ ఎలక్షన్‌ ముగిసిన తరువాత మనకు బాక్సైట్‌ గనుల రూపంలో ముప్పు పొంచివుంది.ఆదివాసులకు అవసాలుగా ఉంటు న్న భూమి,అడివీ,వనరులు వారికి దూరం చేయడానికి అడవుల నుంచి తరిమి వేసే కుట్ర నేటిది కాదు. వందల ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ వివక్ష నాడు బ్రిటిషు వాడి చేతుల నుంచి నేడు స్వదేశీ పెట్టుబడిదారి పాలకుల చేతుల్లోకి మారింది. అంతే తప్పితే! వివక్షలో మాత్రం మార్పు లేదు. ప్రపంచవ్యాప్తంగా నేటికీ మనుగడ కొనసాగిస్తూన్న జాతులు ఇతర ఆదిపత్య సమూహాల ఒత్తిడికి గురౌతు, పాలక పక్షాల కుట్రలను ఎదిరించి నిలిచినవే.
వ్యాసకర్త : కె రామారావు దొర ,జిల్లా కన్వీనర్‌,ఏఎస్‌ఆర్‌ జిల్లా ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసి జెఎసి, 9492340452