ఆదివాసీ భాషల పరిరక్షణే కర్తవ్యం
శాంతిదూత అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం కలిగిన ప్రజాస్వామిక దేశంలోనే ఆదిమజాతుల పరిస్థితి ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఈదీనావస్తలను ఎలా వర్ణించాలి. మనుషులుగా మా ఆదిమజాతులకు లేని భద్రత మా భాషలకు, సంస్కృతులకు ఎలా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాద వలస పాలన ఆక్రమణల కారణంగా స్థానిక ఆదిమజాతులు రాజ్యాధికారానికి దూరం కావడం, తద్వారా సంస్కృతిలు, భాషలు అణిచివేతకు గురికావడం నిరంతరం జరుగుతూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 90దేశాలలో సుమారు ఐదువేల తెగలు, సంస్కృతులు కలిగి 370మిలియన్ల జనాభా, ఏడు వేలరకాలకు పైగా భాషలు ఉన్నట్టు యునెస్కో (ఖఅఱ్‌వస చీa్‌ఱశీఅం జుసబషa్‌ఱశీఅaశ్రీ ూషఱవఅ్‌ఱటఱష aఅస జబశ్ర్‌ీబతీaశ్రీ ూతీస్త్రaఅఱస్త్రa్‌ఱశీఅ) గుర్తించగా, 2680 లకుపైగా ఆదిమ జాతులు మాట్లడే భాషాలు అంతరించి పోతున్న భాషాల జాభిలో ఉండడం ఆందోళన కలిగించే అంశం. మన దేశంలో 104 మిలియన్ల జనాభా కలిగి 700 తెగలు (యునెస్కో గుర్తింపు పొందిన) ఆదివాసులుండగా, 500 తెగలు మాత్రమే ఉనికిలో ఉన్నాయి. 1635భాషలు స్థానిక జాతుల వాడుకలో ఉంటే 197 భాషలు, 75 తెగలు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదావస్తలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో తోటి, చెంచు, కొండ రెడ్డి, కులియా, దులియా మొదలైన తెగలు, కొలాం, సవర, కొండ భాషా వంటి భాషాలు ఇతర భాషాల ఆదిపత్యానికి లోనై కనుమరుగు కానున్నాయి. ఈ పరిణామాలు ఆదిమజాతుల మనుగడకు, విశ్వ మానవాళి వినాశానికి హెచ్చరికలుగా పరిణామీస్తున్న వేళ యునెస్కో 2019 సంవత్సరాన్ని ‘‘ప్రపంచ ఆదివాసీ భాషా సంవత్సరోత్సవం’’గా ప్రకటించడం ఆదిమజాతుల భాషా జ్ఞానాన్ని పరిరక్షించుకోవడం ప్రపంచ సమాజం భాద్యత అని గుర్తు చేయడం శుభపరిణామం.
ఆదిమజాతుల భాషా పరిరక్షణ అంటే మన సాంస్కృతిక వారసత్వం జ్ఞానమూలాల పరిరక్షణేనని సమాజం గుర్తించాలి. ఆదిమజాతుల నాగరికత సంస్కృతులతో పాటు భాషలు మన సమాజానికి ఎంతో అవసరమని గ్రహించి గౌరవించి కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం ఆదిమజాతులది మాత్రమే కాదని, మన అందర బాధ్యత అని యునెస్కో గుర్తుచేసింది. ఆదిమ జాతుల సంస్కృతి వర్ధిల్లితేనే మానవ మనుగడ వైవిధ్యత వర్ధిల్లుతుంది. ఆదిమజాతుల, భాషా సంస్కృతుల పరిరక్షణ అంటే పురాతన సమాధుల త్రవ్వకాలు, సామాగ్రిని మ్యూజియంలలో భద్రపరచడం మాత్రమే కాదు. మా భాషా సంస్కృతిని, జీవన విధానాన్ని, సజీవంగా కొనసాగే అవకాశాలు కల్పించడమని వీలైనంత తొందరగా గుర్తించాలి. విశ్వవిద్యాలయాలు సైతం భాషా అధ్యయనాల పేరిట పురాణ ఇతిహాసాలు, రాతప్రతులు, భాషా, అలంకారాలు, రంధ్రాన్వేషణలు మాని నిజాయితీగా వాస్తవ మూల భాషాజ్ఞాన అన్వేషణ ఇకనైనా మొదలు పెట్టాల్సి ఉంది. అధ్యయ నాలు అలంకారప్రాయాలుగా అనుకరణలుగా కాక, చారిత్రక వాస్తవ నిర్ధారణలు కావాలి. ఆదివాసి భాషాసంవత్సరం భాషల జనని సంవత్స రోత్సవంగా యూరివర్శిటీలు, భాషాపండితులు, అధ్యయనాలు, మేధో మధనాలు జరగాలి.
నిజానికి యునెస్కో ప్రయత్నం మొదటిదేమి కాదు. ముందడుగు అంతకన్నా కాదు. 2005లోనే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్Êట్రైనింగ్ (ఎన్సీఆర్టీ) సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజేస్ (సి.ఐ.ఐ.ఎల్) సంస్థలు మైసూర్లో సెమినార్ నిర్వహించి ‘‘ఆదివాసీ సమాజంలో భాషా పరిరక్షణ-విద్యావకాశాలు మరియు విద్య వెనుకబాటుతనానికి కారణాలు’’ అనేఅంశంపై సమీ క్షించి భాషఅవరోధం ఒకపెద్ద సమస్య అనిగ్రహించింది. ఆ అవరో ధాన్ని అధిగమించడానికి మల్టీ లింగ్వల్ ఎడ్యుకేషన్ (వీూజు) ప్రోగ్రాం ద్వారా మాతృభాషలో ప్రాధమిక విద్యాబోధన అందించే విధంగా కార్యక్రమాలను రూపొందించింది. ఆదివాసీ విద్యార్ధిని, విద్యార్థులకు వారి మాతృభాషలోనే విద్యాబోధన అందించడం ద్వారా ఆదివాసీ సమాజంలో విద్యాభివృద్ధికి భాషా అవరోధంతో పాటు డ్రాపౌట్స్ శాతం తగ్గించడం ధ్యేయంగా పెట్టుకొంది. 2006 లో దేశవ్యాప్తంగా ప్రత్యేక మాతృభాషలు కలిగిన ఆదివాసీ సమూహాలు కలిగి ఉన్న రాష్ట్రాలను ఎన్నుకుని ప్రారంభించారు. అందులో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి గోండి (గోండిభారతి), కోయ (కోయ భారతి), కొలాం (కొలాం భారతి), సవర (సవర భారతి), కొండ దొర (కొండ భారతి), కోందు (కుంవి భారతి) వారి వారి మాతృభాషాల ద్వారా విద్యబోధన మొదలైయ్యింది. వాస్తవంగా సాధారణ విద్యార్ధికి మాతృభాషే విద్యాభాష, కాని ప్రత్యేక మాతృభాష కలిగిన ఆదిమజాతుల విద్యార్ధులకు మాత్రం స్థానిక విద్యా బోధన భాష పూర్తిగా తెలియని భూతమై కూర్చుంది. ఆభాష ఏంటో ఆ అక్షరాలేంటో అర్థమవ్వక బడికి రాకుండా పారిపోయే వారే ఎక్కువ. మిగిలిన కొద్ది మందికి మాతృభాషా పమస్య (మనకు తెలుగు)ఉంటుండగానే సెంకండ్ లాంగ్వేజ్ (హింది), థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీషు) అంటూ తెలియని భాషలు బలవంతంగా చొప్పించే ప్రయత్నం కారణం గానే అజ్ఞానులుగా, అనాగరికులుగా ముద్రపడే దౌర్భాగ్యం దాపురిం చింది. ప్రభుత్వం, పాలకుల నిర్లక్ష్యం వల్లే మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ (ఎం.ఎల్.ఇ), ఆదిమజాతుల విద్యార్ధుల మాతృభాష వికాస కార్యక్రమ మైన ‘‘ఆనందలహరి’’ వంటి పథకాలు దీర్గకాలంగా కొనసాగించ కుండా మూడునాళ్ళ ముచ్చటగా మిగిలాయి. అదే కొనసాగి ఉంటే కొంతమేరకు భాషా పరిరక్షణకు దోహదపడి ఉండేది.
అభివృద్ధి ముసుగులో ఆదిమజాతుల మనుగడ ప్రమాదక రంగా మారిందన్నది. ఎంతవాస్తవమో విద్యా విధానాలవల్ల వారి భాషలు సంస్కృతులు అంతరించి పోవడానికి దారి తీసిందన్నది అంతే వాస్తవం. ఆదిమజాతుల సంస్కృతులు పాఠ్యాంశాలు కాకపోవడం, కనీసం వారి సమీప ఆవాస ప్రాంతాల్లో జరిగే సాంప్రదాయ పండగా లకైనా సెలవులు ప్రకటించి విద్యార్థిని విద్యార్థులకు సంస్కృతిలో భాగస్వా మం కల్పించక పోవడం కారణంగా తరువాతి తరాలు సంస్కృతికి దూరమైన కారణంగానే సాంస్కృతిక వారసత్వం పూర్తిగా అంతరించి పోవడానికి కారణమౌతుంది. మాఆదిమజాతుల విద్యార్ధులు మాది కాని భాషలో విద్యాబోధన కారణంగా,ే మాభాషలకు ప్రాధాన్యత గౌరవం సమాజంలో కానీ పాలన అవసరాలు కానీ, లేనందున విద్యా వంతులైన ఆదివాసీ కుటుంబాలు తరువాతి తరాలకు భాషను నేర్పించకపోవడం, వారి లాగే ఇతర కుటుంబాలు భాషకు దూరం కావటం జరుగుతుంది. ఇది ఏస్థితికి చేరుకుందంటే భృాణ హత్యాపాత కంలా తల్లి గర్భంలోనే మాతృభాషకు సమాధి కట్టే దౌర్భాగ్య పరిస్థితులు ఆదిమజాతుల భాషలకు దాపురించింది. నిజానికి భాష బ్రతకడానికి, కొనసాగడానికి కావలసింది సామాజిక ఆదరణ, ఆచరణ, అవసరం. ‘‘సంస్కృతిభాష ఆధరంగా విస్తృతం అవుతుంది. భాషసంస్కృతి ఆధారంగా సంపూరణమ వుతుం ది’’. ఆచరణ సంస్కృతినిస్తుంది. సాంస్కృతిక పరిరక్షణే భాషను పరిరక్షి స్తుంది. సంస్కృతి భాష ఒకదానికొకటి పెనవేసుకుని సాంస్కృతిక కొనసా గింపు భాషతో, భాషా కొనసాగింపు సంస్కృతితో వారసత్వంగా అందు తుంది. దానికి ప్రభుత్వ తోడ్పాటు అవసరం. కొన్ని వేల సంవత్సరాలు గా ఇప్పటికీ కొన్ని ఆదిమ జాతులు, భాషలు, మనుగడలో ఉన్నాయంటే సామాజిక, సాంస్కృతిక ఆమోదమే కారణం. కానీ పాలకుల తోడ్పాటు ఏ మాత్రం కాదు. ఆదివాసీ భాషలు అంతరించి పోవడానికి లిపి లేకపోవడమే! అనే పరిపక్వత లేని వాదన తెరమీదికి తెస్తున్నారు. అదే వాస్తవమైతే లిపి ఉన్న హరప్ప నాగరిక భాషేది? లిపి ఉండి దేవనాగరిక భాషేది? లిపి లేకుండా దేవనాగరి లిపితో మనుగడ సాగిస్తున్న సంస్కృతం, హింది,బోజ్‌పురి,మరాఠిభాషల పరిస్థితిఏమిటి? ఇంగ్లీష్ కే లిపి లేక పరాయి లిపితో వెలిగిపోతుంది. నిన్నటి వరకు అధికారిక భాషగా గౌరవం పొంది లిపి ఉండి అధికారిక ఆమోదం కోల్పోయాక మనుగడే ప్రశ్నార్థకమైన మహారాష్ట్ర ప్రాంత ‘‘మోది’’ భాష పరిస్థితి ఏమిటి ? లిపి ఉండి భావన(భాష) తెలియక అడివి కాచిన వెన్నెలైన హరప్పా జ్ఞానం అంతర్ధానం మరువరాదు. అందుకే ఆదిమ జాతుల భాషలకు లిపి అందించాలనే వృదా ప్రయత్నాల కన్నా ముందుగా ఆ భాషలను ఎక్కువ సమాజం చదవగలిగిన, వ్రాయ గలిగిన లిపిలో భవిష్యత్ తరాలకు, సమాజానికి అందే విధంగా గ్రంథస్థం చేసుకోవటం ఉత్తమం. అలాంటి అద్భుత ప్రయత్నమే మల్టి లింగ్విల్ ఎడ్యుకేషన్. ఎవరికీ తెలియని కొత్త లిపిలో మనకు మాత్రమే తెలిసిన భాషను లిఖించుకోవటం, గ్రంథస్థం చేయటం అంటే తుఫాను సమయంలో నడి సముద్రానికి చుక్కాని లేని పడవ ప్రయాణం లాంటిది. విశ్వ జ్ఞానమూలాల ఆధారాలను అన్వేషించడం అధ్యయనం చేయటం మాని అక్షరాల్ని వెతకడం ఆదిమ జాతుల భాషా పరిరక్షణకు ఇప్పుడంత అవసరం కాదు. పైగా ఇది ఆదిమ సమాజాన్ని మరింత అయోమయంలోకి నెట్టే కుట్రలో భాగమే. ఆదిమ జాతుల భాషా వారసులు విద్యావంతులు, పెద్దలు, ఆయా భాషల్లో సాహిత్యాన్ని, రచనలను విరివిగా విస్తరింప చేయటం తక్షణ అవసరం.
పాలకులు, మేధావులు, సమాజం, ఆదిమ జాతుల భాషా పరిరక్షణని ఆదివాసుల కోసమే అనే చిన్నచూపుతో లేదా సానుభూతితో కాక సామాజికభాద్యతతో పాటు జ్ఞాన దృష్టితో చూడకపోవడం పెద్ద అవరోదం. ఎందుకంటే భాష ఒక సామాజిక సమాచార మాధ్యమమో, సాంస్కృతిక జీవాధారమో, గుర్తింపో మాత్రమే కాదు. అంతకుమించి భాష అంటే జ్ఞానం. ఆది భాషాలంటే జ్ఞానభాండాగారాలు. ఎందుకంటే ఎంత గొప్ప నాగరికత అయినా మూలం మూలవాసీలతోనే మొదలవ్వాలి. ఈనాటి విజ్ఞానానికి నాంది మా ఆదిమజాతుల భారaా జ్ఞానబీజాలే. నేటి భాషలన్నిటికీ మాతృ భాష మా తొలి పలుకులే. ఎంతటి జ్ఞానం అయినా, ఆవిష్కరణ అయినా భాషలోనే నిక్షిప్తమై ఉంటుంది. భాషలోనే వ్యక్తమవు తుంది. భాషలోనే ప్రసారమవుతుంది. ఆ భాషా జ్ఞానం లేకనే ఈజిప్టు, హరప్పా నాగరికత జ్ఞాన వైభవం తెలియక శతాభ్దాలపాటు విశ్వ విద్యాల యాలతో పాటు జుట్లు పీక్కుంటున్నాం. అయినా ఈ పాలక మేథావులకు, యూనివర్సిటీలకు నిన్న మొన్నటి భాషలకు వ్రాత ప్రతులంటూ ప్రాచీన హోదాలు కవి సమ్మేళనాలు వంటి ఇగోలు, కాలక్షేపం తప్ప మూల జ్ఞానం, మూల వాసీల వద్ద మూల వాసీల భాషా రూపంలో నిక్షిప్తమై ఉందని ఆభాండాగారాన్ని మధించి శోధించి అభివృద్ది చేద్దాం. సమాజానికి మరింత వైజ్ఞానిక మూల జ్ఞానాలు పంచుదామనే ధ్యాస, దృష్టి, దృక్పథం ఏ కోశానా లేదు. భాష ముందా, అక్షరం ముందా అనే ప్రశ్న! చెట్టు ముందా, విత్తు ముందా అన్నంత సంక్లిష్టమేమీ కాదు. అక్షరాల కంటే ముందే అద్భుత విజ్ఞానాన్ని తమలో నిక్షిప్తం చేసుకున్నాయి మా ఆదివాసి భాషాసాగరాలు. అందుకు హరప్పా నాగరికతే సాక్ష్యం. హరప్పా ముద్రికల్లో భావాన్ని అర్ధంచేసుకోవటానికి వలసవిదేశీ భాషల్లో డీకోడిరగ్ ప్రయత్నాలు దశాబ్దాలుగా విశ్వవిద్యాలయాలు సైతం సాగిస్తున్నాయి. ఈ హాస్యాస్పద తంతు మన ఇంటి బిడ్డ డి.యన్.ఎ మ్యాచింగ్ కోసం పక్కింట్లో వెతుకు లాడినట్లు సాగుతూనే ఉంది. పైగా పశుపతి ముద్రికల్లోని కొమ్ముల కిరీటం ధరించే ఆదివాసి సమాజం సజీవంగా ఉన్నా, ఆ భాషలు సమృద్దిగ ఉన్నా కాదని ఆ నాగరికత
వారసత్వం అంతరించింది అని నిర్దారించటం అంటే బ్రతికుండగానే డెత్ సర్టిఫికేట్స్ ఇచ్చేంత గుడ్డితనమా? లేక ఆ వారస త్వాన్ని అంతం చేసే కుట్రలో భాగమా అనేది అర్ధం అవుతూనే ఉంది. జాతులనే కాక సంస్కృతుల్ని భాషల్ని కూడా అంతం చేసి, హైజాక్ చేసే కుట్రలు వలస వాద పాలనలో సర్వ సాధారణం, చారిత్రక విదితం. కానీ అంతం అయ్యేది మా ఆదిమ జాతులు భాషా సంస్కృలు మాత్రమే కాదు. విశ్వమానవాళి జ్ఞానం. ఎప్పటికీ అందక అంతుచిక్కని రహస్యాలుగా మిగిలి పోవటం ఏ సమాజానికి శ్రేయస్కరం?. పొరుగు భాష అయిన ఉర్దు, చాయ్, తహశీల్ వంటి పదాలతో హిందీ భాషకు తద్వారా ఈ దేశానికి ఎంతో మేలు చేసిందని కొనియాడే మేధావులు భాషా పండితులు ఈ దేశం మూల భాషల సమృద్ధతను, గొప్పతనాన్ని కొనియాడడం అటుంచి నేటివరకు గుర్తించనే లేదు. గంగ : అంటే నది పేరు మాత్రమే కాదని నీటి ప్రవాహం అనే అర్ధం ఉందని ఎంతమందికి తెలుసు. చేపల్ని మీన్ లేదా మీనా, నాగుపాముని నాగ్ లేదా నాగిని అని అనేక భాషల్లో వ్యవహరిస్తున్నారు. నిజానికిది ఈదేశ మూలవాసీలైన కోయభాషా పదాలు. అలానే తెలుగులో పొట్ట, పటేల్, పట్వారీ, పొద్దు, నెల, వెన్నెల, తళారీ, ఏరువాకలో ఏరు అనే పదాలు తమిళంలో కై, కాల్, కండ్, కుడిచే, వర, నల్ల వంటి పదాలు కోయభాష లోనివే. తెలుగులో 20 శాతం, తమిళంలో 30 శాతం, కన్నడంలో 80 శాతం కోయభాషా పదాలతోను సంమృద్ధతను పొందాయి. సింప్‌ాసింహం, ఇంద్
సముద్రం (హిందూమహా సముద్రము), ఇమ్‌మంచు (హిమాలయపర్వతాలు), ఒడిస్సేల్, ఒడిస్సి చెట్టు పదాల నుండి ఒడిస్సా అనే పదము ఉత్పత్తి అలానే చెన్నయ్ చెట్టు పదం నుండి చెన్నె (మద్రాసు) పట్టణం పేరు, శివం
పూనకం (దేవర) నుండి శివుడు, శివతాండవం వంటి పదాలు ఉద్భవించాయి. తెలియదు అనే పదమే ‘కంగారు’ జంతువు పేరుగా స్ధిరపడిరదనేది విదితం. అలానే మడ, మర్ర, మార ` చెట్టు అనే పదం నుండి మడ అడవులు వంటి పదాల ఉత్పత్తులు ఆదిమభాషల నుండే ఉద్భవించాయి.
ఆదిమజాతుల భాషలన్ని చిన్నచూపు చూడడం సమాజపు తెలియనితనం. చిన్నతనమే కాని ఆ భాషల చిన్నతనం కాదు. ఉదాహరణకు ప్రపంచంలో గుర్తింపు పొందిన దాదాపు అన్ని భాషల్లో భర్త చనిపోయిన భార్యను వితంతువు అనే పదం మాత్రమే ఉంది. కానీ అండమాన్ దీవుల్లో ఒక ఆదిమతెగ భాషలో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన రక్తసంబంధీకు లందరిని ప్రత్యేకంగా సంబోధించే పదజాలం సమృద్ధిగా ఉంది. అంటే సాంకేతిక పదజాలంలో ఆదిమజాతుల భాషలు వెనుకబడి ఉండొచ్చు కాని సామాజిక పదజాలంలో మాత్రం భాషలన్నింటికి ఆదిమజాతుల భాషలు జన్మ నిచ్చాయని స్పష్టమవుతుంది. సంస్కృతి లాగే భాషలు కూడా ఇచ్చి పుచ్చుకుంటూ సంమృద్ధతను, సమగ్రతను సాధించుకుంటాయి. అది నాగరికతా వికాసానికి వారధి. నిజానికి సాంకేతిక పదాలు కూడా ఇతర దేశాల మూల భాషాపదాలే. తెలియని ప్రాంతాలకు మాత్రమే అవి కొత్త పదాలు. అందుకే మాఆదిమ జాతుల నాగరికత సంస్కృతితో పాటు భాషలు మన సమాజానికి ఎంతో అవసరమని గ్రహించి గౌరవించి కాపాడుకోవాల్సిన భాధ్యత కేవలం మా జాతులది మాత్రమే కాదు. విశ్వ మానవాళి భాధ్యతకూడా అని ‘‘ఆదివాసి భాషా సంవత్సరం’’గా యునెస్కో చాటి చెప్పింది. 2019 సంవత్సరంలో విశ్వవిధ్యాలయాలు ప్రత్యేక శ్రద్దతో మరింత నిశితమైన అధ్యాయనాలు సాగించాల్సి ఉంది. ప్రభుత్వాలు కూడా ఆనంద లహరి, మల్టి లింగ్విల్ ఎడ్యుకేషన్ వంటి పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తూ ఆదివాసి భాషా సాహిత్యం అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తూ తోడ్పాటు అందించాల్సిందిగా మా ఆదివాసీల ఆకాంక్ష. – మడివి నెహ్రు