అడవి తల్లి ఒడిలో అక్షర శిల్పాలు  

ఆ అడవిలోచెట్లకు అక్షరాు పూస్తాయి.. కొన్నాళ్ళకు అవే పుస్తక ఫలాు గా పుట్టికొస్తున్నాయి. తమజాతి సంస్కృతి..సాంప్రదాయ ఔన్నత్యాన్ని పరిరక్షణ కోసం అహర్ణిశు కృషిచేస్తాయి. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా… వాస్తవ విషయం తెలిశాక అవును నిజమే కదా!!అనక మానం. సాధారణంగా ఆదివాసు అనగానే అందరికీ వెంటనే మదిలో మెదిలే చిత్రం కొద్దిపాటి వస్త్రాతో చేతిలో బాణం,నడుముకు వెదురుబుట్టతో, అమాయకపు చూపు బలిష్టమైన దేహదారుడ్యంతో శ్రమశక్తుకు చిరునామాుగా కనిపిస్తారు, కానీ ఇది అనాటి ఆదివాసీ జీవన చిత్రం నేటి సమాజంలో కాంతో పాటు ఆధునిక ఆదివాసి జీవన చిత్రం అందుకు పూర్తి భిన్నం.


స్వాతంత్రానంతరం మన దేశంలో వచ్చిన మార్పు ల్లో భాగంగా అడవిబిడ్డ జీవితాల్లో కూడా కొద్ది మార్పు వచ్చాయన్నది నిజం. ఆకాస్త మార్పు ఆర్థికప్రగతికి కారణం వారిలో’’ అక్షజ్ఞానం’’ కగడమె !! అక్షరజ్ఞానం పెంచుకున్న ప్రతి గిరిజన బిడ్డ ఉపాధిపరంగా ఆర్థికంగా ఎదిగి తమగత కాపు శారీరక శ్రమకు స్వస్తిపలికి హుందాగా జీవిస్తున్న సంఘటను అనేకం,ఆకోవకు చెందిందే ఈ ఆదివాసియువకు ‘‘అక్షరవ్యవసాయం’’ తెం గాణలోని ముగు జిల్లా తాడ్వాయి మండం లోని అనే గిరిజనగ్రామానికి‘‘కామారం’’అనే గిరిజన గ్రామానికి చెందిన విశ్వవిద్యాయ విద్యా ర్థులైన ఈగిరిజన యువత సాగిస్తున్న‘అక్షరయజ్ఞం’ అంద రికీ అబ్బురం కలిగిస్తుంది.


ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర జరిగే మేడారం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన గ ఈగ్రామంలోని యువతచేస్తున్నకృషి అందరికీ ఆదర్శంగా నిుస్తుంది, 1945 సం:లో హైమన్‌ డార్ప్‌ సూచనతో నైజాంరాజ్యంలో ఏర్పాటుచేసిన గిరిజనప్రాంత ప్రాధమికపాఠాల్లో ఒక పాఠశాను ఈ‘‘కామారం’’గ్రామంలో ఏర్పా టు చేయడం విశేషం.అలాఅందుబాటులోకి వచ్చిన పాఠశా సాయంతో ఈఆదివాసి బిడ్డు తమ లోని ప్రతిభకు విద్యసాయంతో నగిషీుచెక్కకుంటు నిరంతర కృషితో అందరికీ ఆదర్శంగా నిుస్తు న్నారు, సుమారు 100కుటుంబాు గ కామారం గ్రామంలోని ఆదివాసిల్లో 40మంది ప్రభుత్వ ఉద్యోగుగా ఉండగా, మరి కొందరు విశ్వవిద్యా య స్థాయిలో చదువుపూర్తి చేసుకుని పరిశోధన పనిలో కృషి చేస్తున్నారు. ఈక్రమంలో ఈగిరిజన గ్రామానికి చెందిన మైపతి సంతోష్‌ కుమార్‌, మైపతి అరుణ్‌ కుమార్‌, అనే అన్నదమ్ము విశ్వవిద్యాయ విద్యపూర్తి చేసుకుని ఒకరుప్రభుత్వ ఉపాధ్యాయుని గా విధు నిర్వహిస్తుండగా మరొకరు ‘‘తుడుం దెబ్బ’’(ఆదివాసిహక్కు పోరాటసమితి) రాష్ట్ర అధ్యక్షునిగా గిరిజను ప్రగతి కోసం నిమగ్నమ య్యాడు. తను ప్రభుత్వ పాన శాస్త్రంలో కాకతీయ విశ్వవిద్యాయంలో మాష్టరుడిగ్రీ పొంది అక్కడే తమ జాతి గురించిన పరిశోధనకు శ్రీకారం చుట్టుకున్నారు. పరిశోధన అంటే కేవం నాుగు గోడ గదుల్లో కూర్చుని వందలాది పుస్తకాను అధ్యయనం చేసి వాటి సారాన్నిమరో కొత్తపుస్తకంగా మార్చడమే కాదు. ప్రాంతాను ప్రత్యక్షంగా పర్యటించి అవగాహన పెంచుకున్న అనుభవ సారంతో వ్రాయడమే ప్రామాణిక పరిశోధన అని నమ్మిన ఈ గిరిజనయువకుడు తను ఆ మార్గం వైపు అడుగువేస్తున్నాడు. అందులో భాగంగానే 2012 ఏప్రిల్‌ 21న ప్రారంభమైన అరుణ్‌ కుమార్‌ క్షేత్ర పర్యటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 11 జిల్లా ల్లోని గిరిజనప్రాంతాల్లో గిరిజన ప్రాంతా గుండా సాగింది 29 రోజుల్లో మొత్తం 5848 కిలోమీటర్ల దూరం ప్రయాణించినతను అతని మిత్ర బృందం అనుభవాతో ‘‘ఆదివాసి జీవన విధ్వంసం’’ అనే మూడు వంద పేజీ ఉద్గ్రంథాన్ని 2016లో ప్రచురించారు. దీనిలో వివిధ ప్రాంతాల్లోని గిరిజ ను జీవనస్థితిగతు అనేకఆధారాు, గణాంకా తోసవివరంగా వ్రాసారు. అరుణ్‌ కుమార్‌ జన్మ ప్రాంతమైన మేడారంనుంచి ప్రారంభ మైన ‘‘ క్షేత్ర పర్యటన’’లో ఖమ్మం జిల్లాలోని భద్రాచం మన్యం సంస్కృతి,తూర్పుగోదావరి జిల్లాలోని కొండరెడ్లు జీవనం,సూరంపాలెం భూపతిపాలెం ప్రాజెక్ట్‌ స్థితిగ తు, కొమ్మునృత్యాు,గంగామ్మ జాతర, వివరా తో పాటు శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, జిల్లాల్లోని గిరిజను సంస్కృతి ఎదుర్కొంటున్న ఇబ్బందు, వివరిస్తూ పశ్చిమ గోదావరి ప్రాంత గిరిజనుకుప్రశ్నార్థకంగా మారిన ‘పోవరం’వ్యధ !ప్రకాశం,కర్నూు,ప్రాంతపు చెంచుజీవితాను భిన్నకోణంనుంచి ఆవిష్కరించి, తెంగాణ లోని మహబూబ్‌నగర్‌,ఇ్లందు,గుండా,ప్రాంతా గిరిజనజీవితాను అక్షరీకరిన్చారు. అలాగే ఆదిలా బాద్‌,కరీంనగర్‌,జిల్లాలోని గోండు జీవితాను పరిశీలించి అనేక చారిత్రక విషయాు మెగులోకి తెచ్చారు. తమ క్షేత్రపర్యటన ద్వారా ఈ ఆదివాసీ జీవనవిధ్వంసం క్షేత్రపర్యటన పరిశోధన నిండా వివిధ ప్రాంతా గిరిజను స్థితిగతుతో పాటు ఆప్రాంతాలోని పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ, ద్వారా అక్కడి ఆదివాసీకు జరుగుతున్న అన్యా యంనష్టం, పాకుకు హెచ్చరికు చేస్తూ గిరిజను ను జాగృతపరుస్తున్నారు. ఆయా ప్రాంతాలోని మహనీయును ప్రకృతిసోయగాను పండుగను సంస్కృతీ సంప్రదాయాను సవివరంగా సచరిత్రా త్మకంగా వివరించడంలో ఈ గిరిజన పరిశోధక విద్యార్థి విజయం సాధించారు. ఇకకామారం గ్రామానికి చెందిన యువత సంయుక్త సాకారంతో ‘‘మైపతిసహోదయి’’చేసిన అక్షరకృషికి మరో సాక్ష్యం ‘‘ఇండిజినస్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ ది కోయతూర్‌ ఆఫ్‌ కామారం’’ అనే వర్ణచిత్రాయుతమైన 300 పేజీ పుస్తకాన్ని 2018లో వారి బిర్సాముండా ఉద్యోగసంఘం పక్షాన ప్రచురించుకున్నారు. ఈఅం దమైన పరిశోధక పుస్తకంలో కోయ తెగ నిర్వచనం తో మొదు పెట్టి తమ గ్రామ భౌగోళిక అంశాు దేశీయ జ్ఞానం,గిరిజను జకుముకరాయి వెదురు బొంగునుంచి నిప్పు తయారు చేసేతీరు, కార్తు, రాశు,గిరిజను కాలాన్ని పూర్వంనుంచి గుణి స్తున్నతీరు, ఎంతోశాస్త్రీయంగా ఆధారాతో ఇందు లో వివరించారు. సింధు నాగరికతే కోయ నాగ రికత అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ కోయ తూర్‌,గోండ్వాన,ధర్మచిహ్నా గురించిన సమాచారం కూడా ఇందులో చేర్చబడిరది. కోయగృహ నిర్మా ణాు వారిసామాజిక కట్టుబాట్లు, ఉమ్మడి జీవన వ్యవస్థ, బంధుత్వాు నీతి మివకు వారు ఇచ్చే ప్రత్యేకతు ఈపుస్తకంలో ప్రామాణికంగా పొందు పరిచారు. పూర్వపు భూపంపిణీ విధానంగురించి శాస్త్రీయవిశ్లేషణతో ఆనందించారు, గిరిజను సంస్కృతి సంప్రదాయా గురించి ఎంతో విస్తా రంగా వర్ణచిత్రాతో అందించిన వ్కెనం పాఠకు కు అబ్బురం కలిగిస్తూ అమ్యూమైన గిరిజన విజ్ఞానం అందిస్తుంది.ఎవరికైనా ప్రాంతీయ అభి మానం సహజం తమ ప్రాంతం ప్రాముఖ్యత సంత రించుకున్నదైతే ఇక ఆ అభిమానంఎత్తు మరింత పెరుగుతుంది. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం జాతర ప్రాం తానికి చేరువలోగ కామారం గిరిజన పరిశోధక యువతకు జాతరకు కారకులైన సమ్మక్క-సారమ్మ వీరవనిత పూర్వచరిత్రను అక్షరీకరిన్చే ఆలోచన వచ్చింది.అయితే అంతకముందే వీరి నేపద్యం గురించి అనేక ఉహాత్మక రచనుమెవడ్డాయి. అరుణ్‌ కుమార్‌ తమజాతి వీరవనితు గురించి సరైన చారిత్రాత్మక సమాచారవివరణ అందిం చాని తనమిత్రబృందంతో కసి సమ్మక్క భర్త పగిడిద్ద రాజు జన్మస్థమైన బస్తర్‌ ను సందర్శించి అక్కడ గ పగిడిద్దరాజు కోట గ గుట్టను దర్శించి విషయసేకరణ చేసాడు సంపూర్ణవివరాతో 2020సంవత్సరంలో ‘సమ్మక్క-సారమ్మ పూర్వ చరిత్ర’అనే పుస్తకంచిత్రలిపి పరిశోధనగా ప్రచు రించారు. దీనిలో సమ్మక్క సారక్క చరిత్ర ఛత్తీస్‌ ఘడ్‌,మహరాష్ట్ర,ఒరిస్సా,గిరిజనప్రాంతాతో ముడి పడివున్న వ్కెనం వివరించ బడిరది. అలాగే జాతర చారిత్రక నేపద్యంవివరణతో పాటు గిరిజన సం స్కృతి ఆధారశాసనాుగా చెప్పబడే చిత్రలిపిగ పడిగెప్రస్థావనతో వీరి పరిశోధన కొన సాగిం చారు. సమ్మక్క సారమ్మపై ఆ ప్రాంత ఆదివాసీ పరిశోధక యువత తాముచేసిన క్షేత్ర పర్యటన ద్వారాను తమ తాతముత్తాత నుంచి విని తొసు కున్న విజ్ఞానం అన్వయం చేసుకుని భిన్న కోణంలో ఈ రచన చేసారు, కేవం పూర్వాపరాు చారిత్రక విషయాు వివరించడంతో సరిపుచ్చుకోకుండా ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం జాతర జరిగే తీరు సచిత్రాత్మకంగా వివరించిన వ్కెనం ఆసక్తిగా వుంటుంది.


ఇలా ఈగిరిజన యువత తమ అస్తి త్వాన్ని గురించి వివరిస్తూ ఇన్నాళ్ళు గిరిజన సాహి త్యం అంటే కేవం ‘‘మౌఖికసాహిత్యం’’గానే పరిగ ణించేవారు దానినుండి తమ సంస్కృతి సంప్రదా యాను బయటకు తెచ్చి వారి సంస్కృతిని ఆధునిక వైజ్ఞానిక ఉపకరణా సాయంతో అక్షర బద్దంగా పుస్తకీకరణచేసి విశ్వవ్యాప్తంగాభావితరాకి అందిం చే కృషిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం 250రకా గిరిజనఆహార వస్తువును సేకరించి ‘ఆదివాసీ ఆహార ఔన్నత్యం’ గురించిపరిశోధన పుస్తకం తొగు-ఆంగ్ల భాషల్లో ప్రచురించే పనిలో నిమగ్న మయ్యారు కామారం గిరిజన యువత, గతంలో మైపతి సంతోష్‌ కుమార్‌ ‘నాగపున్నమి’(2016) ‘‘కోయభాష-నిఘంటువు’’(2017)కోయలిపి (2019), మైపతి అరుణ్‌ కుమార్‌ ‘‘ డెక్క రామక్క జీవితచరిత్ర’’(2018)వంటిపేర్లతో తమజాతి సాహిత్యంను పుస్తకాుగా ప్రచురించారు. ఒక మారుమూ గిరిజన గ్రామంలో ఆదివాసీ విద్యా ర్ధు తామునేర్చుకున్న అక్షర జ్ఞానం సాయంతో ఇలాపరిశోధను క్షేత్రపర్యటను చేసి ఆకృషి నంతా పుస్తకాుగా ప్రచురించి భావితరాకి భద్రపరచడం ఒక అపురూపవిషయం, ఇది పట్టణవాసుకీ అబ్బురంకలిగించే ఆదర్శనీయ అంశం. కామారం గిరిజన యువతచేస్తున్న అక్షరకృషి మరికొన్ని ప్రాంతాలోని విద్యార్ధుకు బాసటగా నివాని వారి క్ష్యం నెరవేరి విశ్వవ్యాప్తంకావాని ఆశిద్దాం.!
` వ్యాస రచయిత –అమ్మిన శ్రీనివాసు రాజు : సెల్‌ : 7729883223.


కామారం గిరిజన పరిశోధనబృందంమార్గదర్శి
మా జాతి సంస్కృతి సాంప్రదాయా గురించి ఆదివాసి హక్కు పోరాట సమితి తుడుందెబ్బ ద్వారా తెలియజేయానే క్ష్యంతో మాకృషి కొనసాగుతుంది మా గిరిజను గత చరిత్రను మివైన సంస్కృతి సాంప్రదాయాను తెలియజేస్తూ మా జాతి ప్రజకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయడమే మా సంఘం ప్రధాన క్ష్యం అందులో భాగంగానే గతంలో మా జాతి గురించి జరిగిన అరకొర అసంపూర్ణ పరిశోధనకు భిన్నంగా మా సొంత అనుభవాతో మాకు సంబంధించిన సంస్కృతి గురించిన పరిశోధను కొనసాగించి మా పరిజ్ఞానంతో పుస్తకరూపంలో ప్రచురించుకుంటున్నాము.
-మైపతి అరుణ్‌ కుమార్‌,తుడుందెబ్బ అద్యక్షుడు


జాతి సంస్కృతి పరిరక్షణ కోసం
మాగ్రామంలోని విద్యార్ధుంతా కలిసి మాజాతి సంస్కృతి మివను పరిరక్షించుకునే పనిలో భాగంగా 2014 సంవత్సరంలో ఒక యువజన సంఘం ఏర్పాటు చేసుకుని గ్రామ మిత్రు సహకారంతో అనేక కార్యక్రమాు చేయ గలిగాం 2016నుంచి దీనిని గిరిజన సంస్కృతి పరిశోధనా కేంద్రం గా తీర్చిదిద్ది మిత్రు,దాతు, ప్రభుత్వ సహకారంతో సొంత భవనం నిర్మించి అధ్యయనం,పరిశోధన, క్షేత్ర పర్యటను, చేస్తూ గిరిజన సంస్కృతిపై పరిశోధను చేసేవారికి మాసంఘం ఒక దారి దీపం కావాలి అన్నది మాక్ష్యం. దీనికి మేథావు, సామాజిక వేత్తు అందరూ సహకారం ఎంతో అవసరం.

  • రేగ రాజశేఖర్‌ అధ్యక్షుడు – బిర్సాముండా యూత్‌ – కామారం,