అడవిపై ఆదివాసీకి హక్కు ఎక్కడ?

అడవిని చట్టబద్దంగా పొందవలసిన ఆదివాసీలనూ వారి హక్కులనూ కాల రాశారు. అడవిపై ఆదివాసీల హక్కులు పూర్తి కాలరాయడంతో అనేక పరిణామాలు సంభవించాయి. అడవిలో ఉండే ఆదివాసీలను ఆక్రమణదారులుగా గుర్తించారు. అడవిలో జీవించటం, జీవనాధారాన్ని పొందటం నేరపూరిత చర్యగా భావించారు. దీనితో ఆదివాసీలలో అభద్రతా భావం మొదలైంది! ఏజెన్సీలో ఈ విధంగా జరుగుతుండటంతో పోషకార లోపంతో, ఆకలి చావులతో ఆదివాసీలు చనిపోవడం నిత్యక ృత్యం అయింది. దీనితో నిర్వాసితం అనేది ఆదివాసీల జీవితంలో ఒక భాగం అయిపోయింది. దాదాపుగా 60శాతం పైగా షెడ్యూల్డ్‌ ప్రాంత భూములు అటవీశాఖ ఆధీనంలో ఉన్నాయి. జీవనాధారానికి కొద్ది భూభాగం మాత్రమే ఆదివాసీలకి దక్కింది. ఏజెన్సీలో 50శాతం పైగా భూములు ఆదివాసేతరుల చేతిలో ఉన్నాయి.వూకె రామకృష్ణ దొర
తరతరాలుగా ఆదివాసీలు అడవులతో మమే కం అయిపోయి అవినాభావ సంబంధంలో జీవనాన్ని గడుపుతున్నారు. అడవుల నుండి పండ్లు, దుంపలు, మూలికలు ఇతర ఆహార పదార్థాలను సమకూర్చుకుంటున్నారు. ఆదివాసీలు ఆర్థిక వ్యవస్థ అంతా అడవులపైనే ఆధారపడి ఉంటుంది. కేవలం ఆర్థిక వ్యవస్థే కాదు సామాజిక, సాంస్క ృతిక, సంప్రదాయ మత జీవనాలు కూడా అడవులతోనే ముడిపడి ఉంటాయి.
ఆదిమకాలం నుంచి అడవులను ఆదివాసీలు యథేచ్ఛగా ఉపయోగించుకుంటున్నారు. ఆదివాసీ ప్రాంతాలలోకి బ్రిటీషు వారి ప్రవేశంతో సమస్యలు తలెత్తాయి. బ్రిటీషు పాలకులు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి భూమికి శిస్తు వసూలు చేయడం ప్రారంభించారు. వనరులను తమ ఆదాయన్ని పెంచే సాధనాలుగా గుర్తించి అడవులనూ అమ్ముకోవచ్చు అనుకున్నారు.
అందుకనే ఆదివాసీలనూ అడవి నుంచి తరిమి వాటిని తమ సొంత ఆస్తిగా మార్చుకోవడానికి అటవీ హక్కుల విధానాలనూ రూపొందించి అడవులపై తన అధికార పరిధిని పెంచుకుంటూ దోపిడి చేయటం ప్రారంభించారు. అనాదిగా అడవులు తమకి చెందినవని భావిస్తున్న ఆదివాసీల పట్ల అటవీ విధానాలు ఆశనిపాతాలయ్యాయి. అడవికి ఆదివాసికి మధ్య అగాధాన్ని పెంచాయి.
1894లో మొదటిసారిగా బ్రిటీషు ప్రభు త్వం అటవీ హక్కుల విధానాన్ని ప్రకటించింది. దీనితో అటవీ శాఖ వెలుగులోకి వచ్చింది. అప్పటి నుండి క్రమంగా ఆదివాసీలపై ప్రభుత్వ అధికారం మొదలయ్యింది. భారతదేశ స్వాతంత్య్ర అనంతరం ప్రభుత్వం 1952లో నూతన అటవీ విధానాన్ని తీసుకవచ్చింది. దీనిలో ఆదివాసుల హక్కులు రాయితీల స్థానానికి దిగజారిపోయాయి.
1894 అటవీ విధానానికి భిన్నంగా 1952 అటవీ విధానంలో మొత్తం అటవీప్రాంతానికి ఒకేపద్ధతి అవలంభించారు. ఈచట్టంతో అడవి భూమిని వ్యవసాయ భూమిగా మార్చడం అంగీకరించారు. పచ్చిక బయళ్ళనూ అడవుల్లో పశువులకూ ఉచితంగా మేపుకునే స్వేచ్ఛనూ ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చారు.
1952లో జాతీయ అటవీ విధానం అడవులనూ వ్యాపారానికి వాడుకునేందుకు అనువైన పరిస్థితిని రూపొందించింది. ఈ విధానమే ఆదివాసీలను అడవికి పరాయివాళ్ళను చేసింది. పారిశ్రామిక అవసరాలకు అడవులను నరకకుండా ఆపలేకపోయారు. 1980లో అటవీ సంరక్షణ చట్టం తీసుకవచ్చారు. ఈచట్టం ఆదివాసుల జీవనాన్ని భవిష్యత్‌నూ మరింత ప్రమాదంలోకి నెట్టింది.
భారత అటవీ సంరక్షణ చట్టం ద్వారా మానవ సంచారం లేకుండా ఉండే అటవీ ప్రాంతాలుగా అడవిని పునర్నిర్వించడం జరిగింది. అడవిలో ఉండే ఆదివాసీలను ఆక్రమణదారులుగా గుర్తించారు. చట్టబద్ధంగా పొందవల్సిన అటవీ ప్రాంత ఆదివాసీల హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి. అడవిని రిజర్వ్‌ చేసే క్రమంలో ఆదివాసీ గ్రామాలు, భూములు రిజర్వులలో కలిసిపోయాయి.
అటవీశాఖ ఏకపక్షంగా, గిరిజన సంక్షేమ శాఖ, రెవిన్యూ శాఖల మధ్య సమన్వయంతో భూములు సర్వే చేయకుండానే అనేక సాగుభూములనూ ‘రిజర్వ్‌’ గా నోటీపై చేసింది. అటవీ చట్టం ప్రకారం ఆదివాసీలు తమ సొంత భూమిలోనే ఆక్రమణదారులుగా గుర్తించబడ్డారు. అడవి, ఆదివాసులకి మధ్య మరింత దూరం పెరిగింది.
ఆదివాసీ ప్రజలకు అడవికి ఉన్న సంబంధాన్ని వారి సంప్రదాయ హక్కులనూ, అవసరాలనూ కాపాడాలని 1908లో భారత అటవీ విధానం గుర్తిం చింది. దానికి అనుగుణంగా 1990 సెప్టెంబర్‌ 18న కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ: 13-1/90 ఎఫ్‌పి 1,2,3,4,5 అనే సర్క్యులర్స్‌ జారీ చేసింది. అవి ఇప్పటి వరకు అమలు జరుగలేదు.
1996లో పంచాయితీరాజ్‌ షెడ్యూల్‌ ప్రాంతాల విస్తరణ చట్టం ద్వారా ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల్లోని అటవీ వనరులపై ఆదివాసీలకే అధికారం ఉంటుందని అంగీకరించింది. అయితే ప్రభుత్వమే దానిని ఉల్లఘించి నిర్లక్ష్యం చేసింది. 1947లో అధికార మార్పిడి జరిగిన తరువాత రిజర్వు ఫారెస్ట్‌గా వర్గీకరించేటప్పుడు ఆదివాసుల భూములనూ, ఉమ్మడి భూముల్ని హక్కుల్ని నిర్ధారించకుండానే సెటిల్‌ చేయకుండానే అడవులుగా ప్రకటించారు. ఆదివాసీల సెటిల్‌మెంట్‌ హక్కుల గురించి పట్టించుకోలేదు. 1952 నాటి జాతీయ అటవీ విధానంను భారత ప్రభుత్వం సవరించి 1980 అటవీ సంరక్షణ చట్టం ద్వారా అడవి హక్కులపై భారత ప్రభుత్వానికి పూర్తి ఆదిపత్యం వచ్చింది. ఎవరైతే వ్యాపార పరంగా అడవులను ఆదివాసీలనూ దోచుకున్నారో ఆవర్గాల నుండి వచ్చిన వారే అడవి రక్షకులుగా మారి అడవులనూ భక్షించారు.
అడవిని చట్టబద్దంగా పొందవలసిన ఆదివాసీలనూ వారి హక్కులనూ కాల రాశారు. అడవిపై ఆదివాసీల హక్కులు పూర్తి కాలరాయడంతో అనేక పరి ణామాలు సంభవించాయి. అడవిలో ఉండే ఆదివాసీలను ఆక్రమణదారులుగా గుర్తించారు. అడవిలో జీవించటం, జీవనాధారాన్ని పొందటం నేరపూరిత చర్యగా భావించారు.
దీనితో ఆదివాసీలలో అభద్రతా భావం మొదలైంది! ఏజెన్సీలో ఈ విధంగా జరుగుతుండటంతో పోషకార లోపంతో, ఆకలి చావులతో ఆదివాసీలు చనిపోవడం నిత్యక ృత్యం అయింది. దీనితో నిర్వాసితం అనేది ఆదివాసీల జీవితంలో ఒక భాగం అయిపోయింది.
దాదాపుగా 60శాతం పైగా షెడ్యూల్డ్‌ ప్రాంత భూములు అటవీశాఖ ఆధీనంలో ఉన్నాయి. జీవనాధారానికి కొద్ది భూభాగం మాత్రమే ఆదివాసీలకి దక్కింది. ఏజెన్సీలో 50శాతం పైగా భూములు ఆదివాసేతరుల చేతిలోఉన్నాయి.
రచయిత : తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ రచయితల సంఘం అధ్యక్షుడు, 9866073866